సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ, విజయలలిత,ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం,రమణారెడ్డి,జి.వరలక్ష్మి
పల్లవి::
లాలలాలాలలా లాలలలలలా లలలా లలలా లాలాలాలా
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు

చదవాలి మీ రెదగాలి చక్కని..మనుషులుగా చిక్కని మనసులుగా

చరణం::1
ఆ..ఆ..ఆ..ఆ
ముందుందయ్యా జీవితమూ..ముళ్ళు పూలూ కలసిన మార్గము

ముళ్ళను చూసి భయపడకు..అన్నీ పూలని భ్రమపడకు
ముళ్ళను చూసి భయపడకు..అన్నీ పూలని భ్రమపడకు
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు
చరణం::2
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఇచ్చాడమ్మా ఒకటే బ్రతుకు..బ్రతకాలమ్మా తుదివరకూ

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మానుకు వున్నది చిగిరించడము..మనిషికి లేదు మల్లి జన్మము
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు
చదవాలి మీ రెదగాలి చక్కని..మనుషులుగా చిక్కని మనసులుగా
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు
No comments:
Post a Comment