Wednesday, January 11, 2012

హేమాహేమీలు--1974



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,కృష్ణ,సత్యనారాయణ,గుమ్మడి,పద్మనాభం,విజయనిర్మల,జరీనావహబ్,రమాప్రభ 

పల్లవి::

నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోపతాపాలకు..ఆ తీపి శాపాలకు
ఈ కోపతాపాలకు..ఆ తీపి శాపాలకు   
అందించనా నీకు..హరిచందనాలు

నీ కోలకళ్ళకి..నీరాజనాలు
ఆ వాలు చూపుకు..అభివందనాలు 

చరణం::1

కోటేరులాంటి..ఆ కొస ముక్కు
ప్రొద్దు నిద్దర లేచినట్టు..ఆ బొట్టు
మిసమిసలు..పసిగట్టి కసిపట్టి బుసకొట్టే
పగడెత్తు పైటున్న..ఆ చీరకట్టు

జిగినీల జాకెట్టు..సొగసైన లాకెట్టు
జిగినీల జాకెట్టు..హో..సొగసైన లాకెట్టు 
విడిచి పెడితే బెట్టు..నా మీద ఒట్టు 

నీ కొంటె కవితకి..నీరాజనాలు
ఆ వాడి చూపుకు..అభివందనాలు
ఈ ఆపసోపాలకు..ఆ విరహ తాపాలకు
ఈ ఆపసోపాలకు..ఆ విరహ తాపాలకు  
అందించనా నేను..సుస్వాగతాలు 

నీ కొంటె కవితకి..నీరాజనాలు
ఆ వాడి చూపుకు..అభివందనాలు 

చరణం::2

నీ వలపే..ఉసి గొలుపు..నా చెలిమే చేయి కలుపు
పొలిమేరలో పిలుపు..పులకింతలే రేపు

జడలోని మల్లికలు..జవరాలి అల్లికలు
చలి పెంచే కోరికలు..జాబిలితో కలయికలు

ఈ ఆరుబయటా..అందాల అల్లరులు
ఈ పూట నాలో పలికించే..కిన్నెరలు
కలిసిపోనా ఏరు నీరై..నేనింక నీవై..నీవింక నేనై

నీ కోలకళ్ళకి.నీరాజనాలు
ఆ వాలు చూపుకు..అభివందనాలు

No comments: