Wednesday, January 11, 2012

పగబట్టిన పడుచు--1971



సంగీతం::M.రంగారావ్ 
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, 

పల్లవి::

చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత 
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత  
మరుమల్లె వెల యెంత..మరుమల్లె వెల యెంత
సిరులేవీ...కొనలేనంత 
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత  

చరణం::1

ఆ..ఆహా..ఆ..ఆహా
నీ బుగ్గలమీద గులాబీలు..దూసుకోనా 
నీ కళ్ళలోన నా నీడ..చూసుకోనా 
నీ బుగ్గలమీద గులాబీలు..దూసుకోనా 
నీ కళ్ళలోన నా నీడ..చూసుకోనా 
గులాబీలు దూసేముందు చెలి వలపే తెలుసుకో 
చెలి వలపే...తెలుసుకో
గులాబీలు దూసేముందు..చెలి వలపే తెలుసుకో  
కళ్ళలో చూసే ముందు..కన్నె మనసు దోచుకో 
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత
ఆ..ఆహా..ఆ..ఆహా
   
చరణం::2
     
నా వన్నెలు చూసీ..నిన్ను నీవే మరిచేవా 
మరి ఎన్నడు వీడని..తీయని బంధం వేసేవా
నా వన్నెలు చూసీ..నిన్ను నీవే మరిచేవా 
మరి ఎన్నడు వీడని..తీయని బంధం వేసేవా
బ్రతుకంతా నీ కౌగిలిలో బందీగా వుంటాను బందీగా వుంటాను
బ్రతుకంతా నీ కౌగిలిలో..బందీగా వుంటాను  
అనురాగ బంధంలోన..నను నేనే మరిచేను
ఆ...ఆహా...ఆ...ఆహా
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత  
మరుమల్లె వెల యెంత..మరుమల్లె వెల యెంత
సిరులేవీ...కొనలేనంత ఆ 

No comments: