సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::ఘంటసాల,P.సుశీల అరెరెరే.. ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ అమ్మీ..ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ..ఓసీ.. అట్టాగే ఉంటాది ఓ రబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే నీ ఒంటి నిగనిగతో నీళ్ళూ మెరుస్తుంటే 2 పొదచాటునా నేను మాటేసి చూస్తుంటే నువ్ తానాలు ఆడావు ఓ లమ్మీ నా ప్రాణాలు తీసావే చిన్నమ్మీ
అరెరెరే.. ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
సంగీతం::T.చలపతి రావ్ రచన::దాసరి నారాయణ రావ్ గానం::S.P.బాలు,P.సుశీల
ఓ....హో...ఆ...ఓ..హో....ఆ... ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ నీదేలే ఈ జీవితమూ..నీకేలే అంకితమూ నీకే..నీకే..అంకితమూ.. ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
నీతీయని పిలుపులలో..నీ వెచ్చని వలపులలో నన్ను నేను మరిచానూ..నిన్నే నాలో చూసానూ నా హౄదయపు కోవెలలో..నిన్నే నిన్నే నిలిపాను ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
ప్రేమించే ప్రతి హౄదయం..పాడుతుంది ఒక రాగం వికసించే ప్రతి కుసుమం..కోరుతుంది అనురాగం నువు కోరుకొనే అనురాగం..నీకు నాకు సమభాగం ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
కంటికీ కనుపాప తోడు..చుక్కకూ జాబిల్లి జోడు కంటికీ కనుపాప తోడు..చుక్కకూ జాబిల్లి జోడు కడలికి కెరటాలు తోడు..చెలియకు చెలికాడు తోడు కలిసిందీ ఈడుజోడూ..నీవు నేను సరిజోడు ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ నీదేలే ఈ జీవితమూ..నీకేలే అంకితమూ నీకే..నీకే..అంకితమూ.. ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
రచన::ఆచార్య ఆత్రేయ సంగీతం::చక్రవర్తి గానం::K.J.జేసుదాస్,S.P.శైలజ తారాగణం::శోభన్ బాబు, జయసుధ,శ్రీదేవి,కాంతారావు,రమాప్రభ,మిక్కిలినేని ఓ బాటసారి...ఇది జీవిత రహదారి.. ఓ బాటసారి...ఇది జీవిత రహదారి.. ఎంత దూరమో...ఏది అంతమో.. ఎవరు ఎరుగని దారి ఇది ఒకరికె సొంతం కాదు ఇది.. ఓ బాటసారి...ఇది జీవిత రహదారి..
ఎవరు ఎవరికి తోడౌతారో ఎప్పుడెందుకు విడిపోతారో మమతను కాదని వెళతారో మనసే చాలని ఉంటారు ఎవ్వరి పయనం ఎందాకో... అడగదు ఎవ్వరిని..బదులే దొరకదని అడగదు ఎవ్వరిని..బదులే దొరకదని
కడుపుతీపికి రుజువేముందీ అంతకు మించిన నిజమేముందీ... కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా.. ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ.. జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ
సంగీత::T.చలపతిరావ్ రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం::ఘంటసాల తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,నాగభూషణం,రామకృష్ణ,అంజలీదేవి,గీతాంజలి,కృష్ణంరాజు,సత్యనారాయణ పల్లవి:: నేలతో నీడ అన్నది..నను తాకరాదని పగటితో రేయి అన్నది..నను తాకరాదని నీరు తన్ను తాకరాదని..గడ్డిపరక అన్నది నేడు భర్తనే తాకరాదని..ఒక భార్య అన్నది చరణం::1 వేలి కొసలు తాకనిదే..వీణ పాట పాడేన చల్లగాలి తాకనిదే..నల్ల మబ్బు కురిసేనా తల్లి తండ్రి ఒకరి నొకరు..తాకనిదే నీవు లేవు నేను లేను నీవు లేవు నేను లేను..లోకమే లేదులే నేలతో నీడ అన్నది..నను తాకరాదని పగటితో రేయి అన్నది..నను తాకరాదని చరణం::2 రవి కిరణం తాకనిదే..నవకమలం విరిసేనా మధుపం తను తాకనిదే..మందారం మురిసేనా మేను మేను తాకనిదే..మనసు మనసు కలవనిదే మమతలేదు..మనిషిలేడు..ఆఆఆ మమతలేదు..మనిషిలేడు మనుగడయే లేదులే నేలతో నీడ అన్నది..నను తాకరాదని పగటితో రేయి అన్నది నను తాకరాదని చరణం::3 అంటరాని తనము ఒంటరి తనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము అంటరాని తనము ఒంటరి తనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము ఇక సమభావం సమధర్మం సహజీవన మనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం..తెలియకుంటె మీ ఖర్మం నేలతో నీడ అన్నది నను తాకరాదని పగటితో రేయి అన్నది నను తాకరాదని నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది