Wednesday, December 16, 2009

దసరాబుల్లోడు--1971







సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

పాడుకొన్న పాటలూ పాతవని ఊరుకో 2
ఆ మాటలన్ని మాపేసి కొత్తపాట పాడుకో

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

మాటతప్పిపోయినా మనిషి బ్రతికితే చాలూ 2
మన మమత చంపుకొన్న ఒక మంచి మిగిలితేచాలు

చేతిలో చెయ్యేసి చెప్పు బావా

తెలియక మనసిచ్చినా తెలిసికుమిలిపోతున్నా 2
మిమ్ము కలపమనీ ముక్కోటి దేవతలకు మొక్కుతున్న

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

No comments: