సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
అరెరెరే..
ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అమ్మీ..ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ..ఓసీ..
అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్ళూ మెరుస్తుంటే 2
పొదచాటునా నేను మాటేసి చూస్తుంటే
నువ్ తానాలు ఆడావు ఓ లమ్మీ
నా ప్రాణాలు తీసావే చిన్నమ్మీ
అరెరెరే..
ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
మొగ్గలు ఒక్కొక్క రేకిప్పుకొన్నట్లు
నీ చక్కదనాలునే..ఒకటొకటే చూసాను 2
జడ చూస్తి...హుమ్మ్...
మెడ చూస్తి...ఆహా..
జబ్బల నునుపు చూస్తి...హా..
కనరాని ఒంపులన్ని ఓలమ్మీ
కసి కసిగ చూస్తినే చిన్నమ్మీ
అరెరెరే..
ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
తడిసీ నీ తెల్లకోక తపాతపా మన్నదీ
తడబడి నా గడుసు మనసు దడా దడా మన్నదీ..ఓర్నీ 2
కళ్ళుమూసుకొచ్చిననీ ఘోల్లున నువ్ నవ్వితే
హా..హా..చురకల్లె తగిలింది ఓలమ్మీ
వుడుకెక్కిపోయిందే చిన్నమ్మీ..
అరెరెరే..
ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీఎట్టాగో అవుతాది చిన్నబ్బీ
No comments:
Post a Comment