Wednesday, December 16, 2009

రాముని మించిన రాముడు--1975



సంగీతం::T.చలపతి రావ్
రచన::దాసరి నారాయణ రావ్
గానం::S.P.బాలు,P.సుశీల


చిన్నారి నారాణి చిరునవ్వులే నవ్వితే
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

అందాల నారాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

నా నోము పండింది నేడు..నాకు ఈనాడు దొరికింది తోడు
నారాణి అధరాల పిలుపు..నాకు తెలిపేను కలలోని వలపూ..నిండు వలపూ

అందాల నారాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

ఎన్నెన్ని జన్మాల వరమో..నేడు నావాడవైనావు నీవు
నావెంట నీవున్న వేళా..కోటిస్వర్గాల వైభోగమేల..భోగమేలా

చిన్నారి నారాణి చిరునవ్వులే నవ్వితే
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

ఈ తోట మనపెళ్ళి పీటా
పలికె మంత్రాలు గోరింక నోటా
నెమలి పురివిప్పి ఆడింది ఆట
వినగ విందాయే చిలకమ్మ పాటా..పెళ్ళి పాట

అందాల నారాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

No comments: