సంగీత::T.చలపతిరావ్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,నాగభూషణం,రామకృష్ణ,అంజలీదేవి,గీతాంజలి,కృష్ణంరాజు,సత్యనారాయణ
పల్లవి::
నేలతో నీడ అన్నది..నను తాకరాదని
పగటితో రేయి అన్నది..నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని..గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని..ఒక భార్య అన్నది
చరణం::1
వేలి కొసలు తాకనిదే..వీణ పాట పాడేన
చల్లగాలి తాకనిదే..నల్ల మబ్బు కురిసేనా
తల్లి తండ్రి ఒకరి నొకరు..తాకనిదే నీవు లేవు
నేను లేను నీవు లేవు నేను లేను..లోకమే లేదులే
నేలతో నీడ అన్నది..నను తాకరాదని
పగటితో రేయి అన్నది..నను తాకరాదని
చరణం::2
రవి కిరణం తాకనిదే..నవకమలం విరిసేనా
మధుపం తను తాకనిదే..మందారం మురిసేనా
మేను మేను తాకనిదే..మనసు మనసు కలవనిదే
మమతలేదు..మనిషిలేడు..ఆఆఆ
మమతలేదు..మనిషిలేడు మనుగడయే లేదులే
నేలతో నీడ అన్నది..నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
చరణం::3
అంటరాని తనము ఒంటరి తనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
అంటరాని తనము ఒంటరి తనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం సమధర్మం సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం..తెలియకుంటె మీ ఖర్మం
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది
No comments:
Post a Comment