రచన::ఆచార్య ఆత్రేయ
సంగీతం::చక్రవర్తి
గానం::K.J.జేసుదాస్,S.P.శైలజ
తారాగణం::శోభన్ బాబు, జయసుధ,శ్రీదేవి,కాంతారావు,రమాప్రభ,మిక్కిలినేని
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి..
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి..
ఎంత దూరమో...ఏది అంతమో..
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది..
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి..
ఎవరు ఎవరికి తోడౌతారో
ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో
మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని..బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని..బదులే దొరకదని
కడుపుతీపికి రుజువేముందీ
అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే
చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ..
జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ
తెంచుకుంటివి అనుబంధాన్ని
పెంచుకున్నదొక హ్రుదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని...
తల్లివి కాగలవా..తనయుడు కాగలడా?
అడ్డ దారిలో వచ్చావమ్మా
అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ..నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కధ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కధ ముగిసేపొయింది
ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ
No comments:
Post a Comment