Saturday, January 31, 2009

కృష్ణార్జునులు--1982


సంగీతం::సత్యం
రచన::వేటూరి
పాడినవారు::S.P.బాలు,P.సుశీల

సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా
సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శౄతి నీవు అంది...లయ నేనే అంది...
కనుచూపే కల్యాణమంది..కనుచూపే కల్యాణమంది
సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి


నా మధుమాసాల ఉదయినిగా..నా మందహాసాల మధువనిగా
ఆ..హా..హ..ఆ..హా..హ..హా హ హా హ హా
నా మధుమాసాల ఉదయినిగా..నా మందహాసాల మధువనిగా
చిరుకాటుకలద్దితే చీకటిగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
చిరుకాటుకలద్దితే చీకటిగా
సిరిమల్లె తురిమితే పున్నమిగా
స్వరమైతే నీవు..జతి నేను అంది..
మనసంటే మాంగల్యమంది....
మనసంటే మాంగల్యమంది....
సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి

ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక
ఆహా..ఆహహా..హహాహ..హహహా..హా..హా..
ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక
ఉలి చూపు తగిలితే శిల్పముగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
ఉలి చూపు తగిలితే శిల్పముగా
చెలి తాను కదిలితే నాట్యముగా
భావాలు నీవి..రాగాలు నావి
సగమైతే జగమూగునంది..సగమైతే జగమూగునంది

సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా..హా..
జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శుతి నీవు అంది..లయ నేను అంది
కనుచూపే కల్యాణమంది..కనుచూపే కల్యాణమంది

సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా..హా..
సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి

Friday, January 30, 2009

రాజాధి రాజ ~~ 1980


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు

అల్లిబిల్లి..అమ్మాయి..అందచందలున్నాయి
వున్నవన్ని మెచ్చాను వచ్చానులే..ఉమ్మ్..
అల్లిబిల్లి అమ్మాయి అందచందలున్నాయి
వున్నవన్ని మెచ్చాను వచ్చానులే
నాజూకులూ..దాచేసినా..నే దోచగా..రానా..నా..
అల్లిబిల్లి అమ్మాయి అందచందలున్నాయి
వున్నవన్ని మెచ్చాను వచ్చానులే


లలనా..తగనా..వలలో..పడనా..నా..
లలనా...తగనా...వలలో పడనా....
నీ హంసల నడకల అడుగుల వెంబడి
చిలకల పలుకుల కిలకిల వింటు
గిర గిర గిర చుట్టు తిరిగెనె..నె..
మొన్న నిన్ను చూసాను..నిన్న కన్ను వేసాను
నేడు దారి కాచాను..రేపు చూసుకో..కోవ్..


హోయ్..మండిపోతుంది నా తాపమే..ఎండిపోతుంది నా గొంతుకే..
హ్హా..హ్హా..హ్హా..హ్హా..ఓ..ఓ..ఓ..ఓ..
మండిపోతుంది నా తాపమే..ఎండిపోతుంది నా గొంతుకే
ఈ దాహమూ..నీ మోహమే..తీర్చాలిలే రా..వే..మ్మ్
ఉడుము పట్టు మా పట్టు..ఊడగొడతా నీ బెట్టు
నాకు తెలుసు నీ గుట్టు..ఉ కొట్టవే..ఓ..వ్...


మిడిసి..పడకే..ఒడిసి పడతా..తా..
మిడిసీ..పడకే..ఏ..ఏ..ఒడిసీ పడతా..తా..తా..తా..తా..
నీ ముందరకాళ్ళకి బంధం వేస్తా..ముక్కుకు తాడు ఠక్కున వేస్తా..
ఎక్కడికెళితే అక్కడికోస్తానే..మ్మ్హ్..హ్హా..
కల్ల బోల్లి కోపాల..కస్సుబుస్సు అనబోకే..చిర్రుబుర్రు అంటున్న సింగారివే..
నాజూకులూ..దాచేసినా..నే దోచగా..రా..న..
అల్లిబిల్లి అమ్మాయి అందచందలున్నాయి
వున్నవన్ని మెచ్చాను వచ్చానులే

దేవుడు చేసిన మనుషులు--1973


సంగీతం::రమేష్‌నాయుడు
రచన:: ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి


మసక మసక చీకటిలో..మల్లెతోట వెనకాలా
మసక మసక చీకటిలో..మల్లెతోట వెనకాలా
మాపటేల కలుసుకో..ఓ..నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది..దొరుకుతుంది..ఒకే..యా...యా యా..యయాయయాయా..యాయా..యయాయ..ఓ..ఓ..ఓ..


మాదేశం వచ్చిన వాడా....మా బొమ్మను మెచ్చిన వాడా
మాదేశం వచ్చిన వాడా....మా బొమ్మను మెచ్చిన వాడా
తరతరాల అందాల..తరగని తొలి చెందాలా
తరతరాల అందాల..తరగని తొలి చెందాలా
ఈ భంగిమ నచ్చిందో..ఆనందం ఇచ్చిందో..
అయితే..ఏ..ఏ..ఏ...

మసక మసక చీకటిలో..మల్లెతోట వెనకాలా
మాపటేల కలుసుకో..ఓ..నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది..దొరుకుతుంది..ఒకే..యా...యా యా..యయాయయాయా..యాయా..యయాయ..ఓ..ఓ..ఓ..


చోద్యాలు వెతికే వాడా...సొగసుచూసి మురిసేవాడా...
చోద్యాలు వెతికే వాడా...సొగసుచూసి మురిసేవాడా...
కడచేతికి దొరకాలంటే..నలుమూలలు తిరగాల
కడచేతికి దొరకాలంటే..నలుమూలలు తిరగాల
నీ ముందుకు రావాలా..నీ సొంతం కావాలా..
అయితే..ఏ..ఏ..ఏ....


మసక మసక చీకటిలో..మల్లెతోట వెనకాలా
మాపటేల కలుసుకో..ఓ..నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది..దొరుకుతుంది..ఒకే..యా...యా యా..యయాయయాయా..యాయా..యయాయ..ఓ..ఓ..ఓ..

ధనమా దైవమా--1973



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

::::


ఏమిటో ఇది ఏమిటో
ఎందుకో ఇది ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం

ఇది తొలివయసు వేసిన తాళం
ఇది తొలివయసు వేసిన తాళం

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం..
గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం..


నీ కళ్ళు చూసానూ నా ఇల్లే మరిచాను
నీ కళ్ళు చూసానూ నా ఇల్లే మరిచాను
నీ పెదవులే చూసాను నీ పెదవులే చూసాను
జున్ను మీగడ మరిచాను..ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
ఏహే..గుండెరాగం


నీరూపం చూసాను ఈ లోకం మరిచాను
నీరూపం చూసాను ఈ లోకం మరిచాను
నా పేరే అడుగుతుంటే నా పేరే అడుగుతుంటే
నీ పేరే..తెలిపాను..ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
ఆహా..గుండెరాగం


నిద్దురలో పిలిచాను ముద్దులతో కొలిచాను
నిద్దురలో పిలిచాను ముద్దులతో కొలిచాను
నీకౌగిట కరిగిపోయి..నీకౌగిట కరిగిపోయి
నిన్ను నన్ను మరిచాను..ఎందుకో...ఆ..ఆ

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం

ఆహా..గుండెరాగం

ఆ..హా..ఆ..హా..ఆ..హా

ధనమా దైవమా--1973::ఆభేరి::రాగం



సంగీతం::TV.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల

రాగం:::ఆభేరి:::

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...


ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు

ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే.....
మనిసి బ్రతుకు నరకమౌను మనసు తనది కానిదే
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా

చీకటి ముసిరిన వేకువ ఆగునా
ఏ విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...

జానకి సహనమూ రాముని సుగుణము
ఏ యుగమైనను నిలచే ఆదర్శము
వారిదారిలోన నడచు వారి జన్మ ధన్యమూ
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...

Wednesday, January 28, 2009

అర్ధాంగి--1977


సంగీతం::T.చలపతి రావ్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
అది ఏనాదైనా ఏనాడైన నీకే నీకే కంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

తెరచిన నా కన్నులలో ఎపుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడూ నీ కలల దీపమే
తెరచిన నా కన్నులలో ఎపుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడూ నీ కలల దీపమే
కనులే కలలై..కలలే కనులై
కనులే కలలై..కలలే కనులై
చూసిమ అందాలు..అనుబంధాలు అవి నీకే నీకే అంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆధ్యానంలో ఎపుడూ..నీ ప్రణయ గానమే
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆధ్యానంలో ఎపుడూ..నీ ప్రణయ గానమే
ధ్యానమే గానమై...గానమె ప్రాణమై
ధ్యానమే గానమై...గానమె ప్రాణమై
పలికిన రాగాలు..అనురాగాలు..అవి నీకే నీకే అంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

కల్పన--1977







సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల,G.ఆనంద్


పల్లవి:

దిక్కులు చూడకు రామయ్యా..పక్కనె ఉన్నది సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా..పక్కనె ఉన్నది సీతమ్మా..సీతమ్మా
సిరిమల్లె నవ్వుల సీతమ్మా..ముందుకు రావే ముద్దుల గుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మా..ముందుకు రావే..ముద్దుల గుమ్మ..ముద్దుల గుమ్మా


చరణం::1


ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగిఉంటావో..ఓ..
ఎదనే దాచుకుంటావో..నా ఎదనే దాగిఉంటావో..
కదలికలన్నీ కధలుగ అల్లి కవితలే రాసుకుంటావో..రామయ్యా..

పొన్నలు పూచిన నవ్వు..సిరివెన్నెల దోచి నాకివ్వు
పొన్నలు పూచిన నవ్వు..సిరివెన్నెల దోచి నాకివ్వు
ఆ వెన్నెలలో..నీ కన్నులలో..ఆ వెన్నెలలో..నీ కన్నులలో..
సన్నజాజులే రువ్వు..కను సన్నజాజులే రువ్వు..సన్నజాజులే రువ్వు..
కను సన్నజాజులే రువ్వు..సీతమ్మా..సీతమ్మా..

దిక్కులు చూడకు రామయ్యా..పక్కనె ఉన్నది సీతమ్మా
సిరిమల్లె నవ్వుల సీతమ్మా..ముందుకు రావే ముద్దుల గుమ్మ..ముద్దుల గుమ్మా


చరణం::2


కలలో మేలుకుంటావో..నా కళలే ఏలుకుంటావో..
కలలో మేలుకుంటావో..నా కళలే ఏలుకుంటావో..
కలలిక మాని కలయికలో నా కనులలో చూసుకుంటావో..రామయ్యా

వెల్లువలైనది సొగసు..తొలివేకూవ నీ మనసు..
వెల్లువలైనది సొగసు..తొలివేకూవ నీ మనసు..
ఆ వెల్లువలో..నా పల్లవిలో..ఆ వెల్లువలో..నా పల్లవిలో..
రాగమే పలికించు..అనురాగమై పులకించు..రాగమే పలికించు
అనురాగమై పులకించు..సీతమ్మా..సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా..పక్కనె ఉన్నది సీతమ్మా
సిరిమల్లె నవ్వుల సీతమ్మా..ముందుకు రావే ముద్దుల గుమ్మ..ముద్దుల గుమ్మా

మహా సంగ్రామం --- 1985

s

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
అలనాటి తొలిచూపు గురిచూడగా..
కలలన్ని ఒకసారి కవ్వించగా...
అవలీలగా..ఒక నీడగా..తను వెంటాడగా..

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
చిననాటి చిరునవ్వు చిగురించగా
ఒకనాటి బిడియాలు ఒడిచేరగా
ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..


గోదారమ్మా..లాలాలాలా..
పోంగేనమ్మా..లాలాలాలా..
తొలినాటి వయ్యారాల పరవళ్ళలో..

కావేరమ్మా..లాలాలాలా..
కరిగేనమ్మా..లాలాలాలా..
కన్నూ కన్నూ కలిపే తీపి కన్నీటిలో

ఉయ్యాలూగే..లాలాలాలా..
ఊహల్లోనే..లాలాలాలా..
ఊరేగు ఈవేళలో....ఓ....
ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...


జాబిలమ్మా..లాలాలాలా..
చిక్కేనమ్మా..లాలాలాలా..
జారేపైట..పోంగేడద..సందిళ్ళలో

ముద్దుగుమ్మా..లాలాలాలా..
మురిసేనమ్మా..లాలాలాలా..
తొలిమేనల్లో పొద్దేమరచె..కౌగిళ్ళలో

సాయంత్రాల..లాలాలాలా..
నీడల్లాంటి..లాలాలాలా..
ఆదూర తీరాలలో.....

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
చిననాటి చిరునవ్వు చిగురించగా
కలలన్ని ఒకసారి కవ్వించగా...
ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..
ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం

Sunday, January 25, 2009

దీపారాధన--1981








సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి
గానం::బాలు,P.సుశీల

తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు
తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు
ఆ తూరుపెక్కడో చెప్పాలండి..మీలో...ఒక్కరు
ఆ..ఎవరో...ఒక్కరూ..

ముక్కుకు సూటిగ పోతే నీకు ఉత్తరం మొస్తుండీ
ముక్కుకు సూటిగ పోతే నీకు ఉత్తరం మొస్తుండీ
ఆ పక్కకు తిరిగి వెనక్కు చూస్తె తూరుపు వుంటుందీ...తూరుపు వుంటుందీ..హ్హా..హ్హా..


అమ్మాయి..పుడితే..పేరేమి..అన్నాను..తప్పా..ఆ ఆ
అబ్బాయి..పుడితే..పేరేమి..అన్నాను..తప్పా..ఆ ఆ

అబ్బాయే..ఎందుకు పుట్టాలీ...అమ్మాయే..ఎందుకు పుట్టాలీ...
అబ్బాయే..ఎందుకు పుట్టాలీ...అమ్మాయే..ఎందుకు పుట్టాలీ...
అబ్బాయెందుకు పుట్టాలీ ??అమ్మాయెందుకు పుట్టాలీ ??అబ్బాయెందుకు పుట్టాలీ ??
అమ్మాయెందుకు పుట్టాలీ ??
అబ్బాయే..అమ్మాయే..అబ్బాయే..అమ్మాయే..

అబ్బాయే..అమ్మాయే..అబ్బాయే..అమ్మాయే..అమ్మాయి అయితే బొట్టు కాటుక దిద్దొచ్చు..అబ్బా..
తలలో పూవులు పెట్టోచ్చు

అబ్బాయి అయితే..చొక్కా లాగు వేయోచ్చు..చక్కగ మీసం పెంచొచ్చు
అబ్భా మీసాలంటే నాకు భయమండీ
అబ్బాయొద్దు..గిబ్బాయొద్దు..నాకు అమ్మాయే..కావాలి
నీకు అమ్మాయే..కావాలా..ఆ..అమ్మాయే..కావాలా..ఆ..

అయితే తూరుపు తిరుగి దండం పెట్టు..హా హ హ హ
తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు
తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు

ఆ పక్కకు తిరిగి వెనక్కు చూస్తె తూరుపు వుంటుందీ...తూరుపు వుంటుందీ


వెళ్ళాలి..మనమూ..తిరపతీ..అన్నాను..తప్పా..ఆ
ఆ..వెళ్ళాలి మనమూ..బొంబాయి అన్నాను తప్పా..ఆ..
బోంబాయే ఎందుకు వెళ్ళాలీ ?
ఆ..తిరుపతే ఎందుకు వెళ్ళాలీ ?
బోంబాయే ఎందుకు వెళ్ళాలీ ?
ఈ..తిరుపతే ఎందుకు వెళ్ళాలీ ?
బోంబాయ్ ఎందుకు వెళ్ళాలీ...తిరుపతి ఎందుకు వెళ్ళాలీ..
బోంబాయ్ ఎందుకు వెళ్ళాలీ..తిరిపతే..ఎందుకు వెళ్ళాలీ..
తిరుపతే..బోంబాయే..తిరుపతే..బోంబాయే..
తిరుపతే..బోంబాయే..తిరుపతే..బోంబాయే..
బోంబాయ్ అయితే రైలూ..ప్లైను ఎక్కోచ్చు
దేశం చుట్టి రావచ్చు..
తిరుపతి అయితే...కోండ మెట్లూ ఎక్కోచ్చు
మొక్కి గుండు ఇవ్వొచ్చు..అబ్బో..గుండా..ఆ..
గుండంటే నాకు భంగా..హా..హా..హా..

అయితే..తూరుపు తిరిగి దండం పెట్టండి..హు..హు..
తూరుపు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడగారు
తూరుపు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడగారు
ఆ తూరుపెక్కడో చెప్పాలండి..మీలో...ఒక్కరు
ఆ..ఎవరో...ఒక్కరూ
..

దీపారాధన--1981






సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి
గానం::S.P.బాలు,P.సుశీల


సన్నగా..సన..సన్నగా
సన్నగా..సన..సన్నగా
వినిపించె ఒక పిలుపు..

సన్నగా కను సన్నగా
కనిపించె ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపులో
ఆ మెరుపే పిలుపులో

కోరికమ్మ గుడిలో..కోయిలమ్మ కూసిందో
జాజులమ్మ తోటలో..గాజులమ్మ పిలిచిందో
జాజులు జాజులు చేరీ..గుసగుస మన్నాయి

లా..లా..లా.లా లా లా
గాజులు గాజులు చేరి..గలగలమన్నాయి
అన్నాయీ..అమ్మాయీ..నీ నడుమే..సన్నాయీ
విన్నాయీ..అబ్బాయీ..ఈ..నీ మాటల సన్నాయీ

సన్నగా..సన..సన్నగా
వినిపించె ఒక పిలుపు..
సన్నగా కను సన్నగా
కనిపించె ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపులో
ఆ మెరుపే పిలుపులో

ఆ ఆ ఆ ఆ ఆ..ఆ హా హా..ఆ ఆ
చుక్కలమ్మ వాకిట్లో..జాబిలమ్మ పూసిందో
మబ్బులమ్మ పందిట్లో..ఉరుములమ్మ ఉరిమిందో
మబ్బు మబ్బు కలిసీ..మంచం వేసాయి..ఆ హా..
చుక్క చుక్క కలిపి..పక్కలు వేసాయీ

వేసాయీ..అబ్బాయీ..ప్రేమకు పీటలు వేసాయి
వేసాయీ అమ్మాయీ..పెళ్ళికి బాటలు వేసాయీ

సన్నగా కను సన్నగా
కనిపించె ఒక మెరుపు
కనిపించె ఒక మెరుపు
సన్నగా..మ్మ్ మ్మ్..సన..సన్నగా
వినిపించె ఒక పిలుపు..
ఆ పిలుపు మెరుపులో
ఆ మెరుపే పిలుపులో

ఆ ఆ ఆ ఆ ఆ..ఆ హా హా..ఆ ఆ ఆ