Wednesday, January 28, 2009

అర్ధాంగి--1977


సంగీతం::T.చలపతి రావ్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
అది ఏనాదైనా ఏనాడైన నీకే నీకే కంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

తెరచిన నా కన్నులలో ఎపుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడూ నీ కలల దీపమే
తెరచిన నా కన్నులలో ఎపుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడూ నీ కలల దీపమే
కనులే కలలై..కలలే కనులై
కనులే కలలై..కలలే కనులై
చూసిమ అందాలు..అనుబంధాలు అవి నీకే నీకే అంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆధ్యానంలో ఎపుడూ..నీ ప్రణయ గానమే
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆధ్యానంలో ఎపుడూ..నీ ప్రణయ గానమే
ధ్యానమే గానమై...గానమె ప్రాణమై
ధ్యానమే గానమై...గానమె ప్రాణమై
పలికిన రాగాలు..అనురాగాలు..అవి నీకే నీకే అంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

No comments: