Friday, January 30, 2009

ధనమా దైవమా--1973::ఆభేరి::రాగం



సంగీతం::TV.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల

రాగం:::ఆభేరి:::

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...


ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు

ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే.....
మనిసి బ్రతుకు నరకమౌను మనసు తనది కానిదే
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా

చీకటి ముసిరిన వేకువ ఆగునా
ఏ విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...

జానకి సహనమూ రాముని సుగుణము
ఏ యుగమైనను నిలచే ఆదర్శము
వారిదారిలోన నడచు వారి జన్మ ధన్యమూ
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...

No comments: