సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి
గానం::S.P.బాలు,P.సుశీల
సన్నగా..సన..సన్నగా
సన్నగా..సన..సన్నగా
వినిపించె ఒక పిలుపు..
సన్నగా కను సన్నగా
కనిపించె ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపులో
ఆ మెరుపే పిలుపులో
కోరికమ్మ గుడిలో..కోయిలమ్మ కూసిందో
జాజులమ్మ తోటలో..గాజులమ్మ పిలిచిందో
జాజులు జాజులు చేరీ..గుసగుస మన్నాయి
లా..లా..లా.లా లా లా
గాజులు గాజులు చేరి..గలగలమన్నాయి
అన్నాయీ..అమ్మాయీ..నీ నడుమే..సన్నాయీ
విన్నాయీ..అబ్బాయీ..ఈ..నీ మాటల సన్నాయీ
సన్నగా..సన..సన్నగా
వినిపించె ఒక పిలుపు..
సన్నగా కను సన్నగా
కనిపించె ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపులో
ఆ మెరుపే పిలుపులో
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ హా హా..ఆ ఆ
చుక్కలమ్మ వాకిట్లో..జాబిలమ్మ పూసిందో
మబ్బులమ్మ పందిట్లో..ఉరుములమ్మ ఉరిమిందో
మబ్బు మబ్బు కలిసీ..మంచం వేసాయి..ఆ హా..
చుక్క చుక్క కలిపి..పక్కలు వేసాయీ
వేసాయీ..అబ్బాయీ..ప్రేమకు పీటలు వేసాయి
వేసాయీ అమ్మాయీ..పెళ్ళికి బాటలు వేసాయీ
సన్నగా కను సన్నగా
కనిపించె ఒక మెరుపు
కనిపించె ఒక మెరుపు
సన్నగా..మ్మ్ మ్మ్..సన..సన్నగా
వినిపించె ఒక పిలుపు..
ఆ పిలుపు మెరుపులో
ఆ మెరుపే పిలుపులో
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ హా హా..ఆ ఆ ఆ
No comments:
Post a Comment