Friday, January 30, 2009

ధనమా దైవమా--1973



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

::::


ఏమిటో ఇది ఏమిటో
ఎందుకో ఇది ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం

ఇది తొలివయసు వేసిన తాళం
ఇది తొలివయసు వేసిన తాళం

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం..
గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం..


నీ కళ్ళు చూసానూ నా ఇల్లే మరిచాను
నీ కళ్ళు చూసానూ నా ఇల్లే మరిచాను
నీ పెదవులే చూసాను నీ పెదవులే చూసాను
జున్ను మీగడ మరిచాను..ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
ఏహే..గుండెరాగం


నీరూపం చూసాను ఈ లోకం మరిచాను
నీరూపం చూసాను ఈ లోకం మరిచాను
నా పేరే అడుగుతుంటే నా పేరే అడుగుతుంటే
నీ పేరే..తెలిపాను..ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
ఆహా..గుండెరాగం


నిద్దురలో పిలిచాను ముద్దులతో కొలిచాను
నిద్దురలో పిలిచాను ముద్దులతో కొలిచాను
నీకౌగిట కరిగిపోయి..నీకౌగిట కరిగిపోయి
నిన్ను నన్ను మరిచాను..ఎందుకో...ఆ..ఆ

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం

ఆహా..గుండెరాగం

ఆ..హా..ఆ..హా..ఆ..హా

No comments: