Tuesday, January 15, 2008
ఖైదీ కాళిదాసు--1977
సంగీతం :: చక్రవర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
రచన::మైలవరపు గోపి
ఎవరీ చక్కనివాడు..ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కనిచుక్క..సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతుందీ..
హా..కాదన్నా వెంట పడుతుందీ..2
కదలిక ఉందీ..మబ్బులో కదలిక ఉందీ..
నీటికీ వేగం ఉందీ..గాలికీ చలనం ఉందీ..
విడిలోన ఉలుకూ పలుకూ లేకుందీ..
కదలిక ఉంది..మబ్బులో కదలిక ఉంది..
నీటికీ వేగం ఉంది..గాలికీ చలనం ఉంది..
విడిలోన ఉలుకూ పలుకూ లేకుందీ..
వయసొచ్చింది..దానితో వలపొచ్చింది
హా.. వయసొచ్చింది..దానితో వలపొచ్చిందీ
అందుకే చిన్నది తొందర పడుతోందీ..
అందుకే చిన్నది తొందర పడుతోందీ..
ఎవరీ చక్కనివాడు..ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కనిచుక్క..సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతుందీ..
హా..కాదన్నా వెంట పడుతుందీ..
కన్నేసిందీ..కళ్ళతో కట్టేసిందీ..
చూపుతో చంపేస్తుందీ..నవ్వుతో బ్రతికిస్తుందీ..
అమ్మమ్మో కుర్రది చాలా టక్కరిదీ..
కన్నేసింది..కళ్ళతో కట్టేసింది..
చూపుతో చంపేస్తుంది..నవ్వుతో బ్రతికిస్తుంది..
అమ్మమ్మో కుర్రది చాలా టక్కరిదీ..
వీడితో అవుననిపించీ కొంగుముడి వెయ్యకపోతే
వీడితో అవుననిపించీ కొంగుముడి వెయ్యకపోతే
ఎందుకీ ఆడజన్మ ఓయమ్మా..
ఎందుకీ ఆడజన్మ ఓయమ్మా..
ఎవరీ చక్కనివాడు..ఎంతకూ చిక్కనివాడు..
ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కనిచుక్క..సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతుందీ..
హా..కాదన్నా వెంట పడుతుందీ..
Labels:
Hero::Sobhanbabu,
P.Suseela,
SP.Baalu,
ఖైదీ కాళిదాసు--1977
Monday, January 14, 2008
చెల్లెలి కాపురం--1971
సంగీతం::K.V..మహాదేవన్
రచన::కోసరాజురాఘవయ్య
గానం::S.జానకి
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,మణిమాల,నాగభూషణం,ఛాయాదేవి,నిర్మల,K.V.చలం.
అల్లు రామలింగయ్య
పల్లవి::
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
బలె బలే మా..అన్నయ్యా బంగారం లాంటన్నయ్య
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
హోయ్..బలె బలే మా అన్నయ్యా - బంగారం లాంటన్నయ్య
చరణం::1
చల్లని వార్త పంపాడూ..కొల్లగ ఆశలు పెంచాడూ
చల్లని వార్త పంపాడూ..కొల్లగ ఆశలు పెంచాడూ
చీకటి పాలౌ చెల్లి బ్రతుకున..వేయి దీపములు వెలిగించాడూ
బలె బలే మా అన్నయ్యా..బంగారం లాంటన్నయ్య
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య
చరణం::2
ఎన్నెన్నో పుస్తకాలు రాస్తాడూ..ఎంతెంతో పేరు తెచ్చుకుంటాడూ
ఎన్నెన్నో పుస్తకాలు రాస్తాడూ..ఎంతెంతో పేరు తెచ్చుకుంటాడూ
మెడ నిండా దండలతో..మేళ తాళాలతో
మెడ నిండా దండలతో..మేళ తాళాలతో
ఊరూర అన్నయ్యా ఊరేగుతూ వస్తాడూ..ఆ ఆ
బలె బలే మా అన్నయ్యా..బంగారం లాంటన్నయ్య
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య
Saturday, January 12, 2008
మనసు-మాంగల్యం--1971
సంగీతం::పెండ్యలనాగేశ్వరరావు
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::అక్కినేని,జమున,జగ్గయ్య,అంజలీదేవి,పద్మనాభం,రమణారెడ్డి,చంద్రమోహన్,రామకృష్ణ,గీతాంజలి.
పల్లవి::
పో పో పో..ఎంతదూరంపోతావో
పో పో పో..ఎంతదూరంపోతావో
పోయి పోయి..చూడు నువ్వెక్కడ వుంటావో
నా...పక్కనె వుంటావు
రా రా రా..ఎంత దూరం వస్తావో
రా రా రా..ఎంత దూరం వస్తావో
వచ్చి వచ్చి..చూడు నన్నందుకుంటావో
నా..సొంతమవుతావో..రా రా రా
చరణం::1
మరునీ విల్లునుండి అమ్ములాగ..బెదరీ తుళ్ళిపడే లేడిలాగ
మరునీ విల్లునుండి అమ్ములాగ..బెదరీ తుళ్ళిపడే లేడిలాగ
పరుగుతీసేవు పారిపొయ్యేవు..పరువమే నీదని గర్వమా
నిన్ను...పట్టుకోలేననీ...పందేమా
మరుపేరాని తీపి తలపులాగ..అలుపే లేని కోడె వలపులాగ
మరుపేరాని తీపి తలపులాగ అలుపే లేని కోడె వలపులాగ
ఉరకలు వేసేవు తరముకు వచ్చేవు..మగసిరే నీదని
గర్వమా...నన్ను గెలిచుకోవలేననీ పంతమా
రా రా రా..ఎంత దూరం వస్తావో
వచ్చివచ్చి..చూడునన్నందుకుంటావో
నా..సొంతమవుతావో..రా రా రా
చరణం::2
వయసూ వెంటబడే సొగసునీవు..మనసు కోరుకునే మమతనీవు
వయసూ వెంటబడే సొగసునీవు..మనసు కోరుకునే మమతనీవు
రెండూ కలవాలి రెండూ గెలవాలి..మనసులో సొగసులే తెలియాలి
తీపి మమతలో...వయసునే మరవాలి..ఆహాహా
రా రా రా..ఎంత దూరం వస్తావో
పో పో పో..ఎంతదూరంపోతావో..హాహాహా
Thursday, January 10, 2008
హేమాహేమీలు--1974
సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.P.శైలజ
తారాగణం::అక్కినేని,కృష్ణ,సత్యనారాయణ,గుమ్మడి,పద్మనాభం,విజయనిర్మల,జరీనావహబ్,రమాప్రభ
పల్లవి::
నువ్వంటే..నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే..నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నువ్వంటే..నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే..నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నేనంటే ఎందరికో..ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే..నాకెంతో ఇష్టం
నేనంటే ఎందరికో..ఓఓఓ..ఇష్టం
Red Lion Red Lion..Reach us to Red Lion
చరణం::1
జూ..ఊ..జూజూ..లలలలాలల..జూజూ
నీ పేరంటే..ఎందరికో..ఓఓఓ..భయం
నీ తోడుంటే..నాకేమో ప్రియం
నీ పేరంటే..ఎందరికో..ఓఓఓ..భయం
నీ తోడుంటే..నాకేమో ప్రియం
నీ మాటే మధురసం..నీ నడకే పాదరసం
నీ మాటే మధురసం..హహహా..నీ నడకే పాదరసం
మధురసం కోరుకుంటే..మరేమి పరవాలేదు
పాదరసం తాగావంటే..ప్రాణానికే నష్టం
నేనంటే ఎందరికో..ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే..నాకెంతో ఇష్టం
నువ్వంటే నాకెంతో ఇష్టం..Is it?
జువ్ జువ్వునలాగే..నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నువ్వంటే నాకెంతో..ఓఓఓఓ..ఇష్టం
Red Lion Red Lion... Reach us to Red Lion
చరణం::2
పా..పప..లలలా..లల
పా..పప
నీ సొగసంటే..ఎందరికో..ఓఓఓ..నిషా
అది చూస్తుంటే..నాకేమో తమాషా
నీ సొగసంటే..ఎందరికో..ఓఓఓ..నిషా
అది చూస్తుంటే..నాకేమో తమాషా
నీ పరువం నాగిని..అది నీతోనే ఆగనీ
నీ పరువం నాగిని..అది నీతోనే ఆగనీ
మాటలతో కవ్విస్తే..మనసు ఊరుకోదు
తాపం మరింత పెరిగితే..తట్టుకోవడం కష్టం
నువ్వంటే నాకెంతో..ఇష్టం
జువ్ జువ్వునలాగే..నీ చూపంటే.. మరీ మరీ ఇష్టం
Saturday, January 05, 2008
బలి పీఠం--1975::శంకరాభరణ::రాగం
సంగీతం::చక్రవర్తి
రచన::దేవులపల్లి కౄష్ణశాస్త్రి
గానం::S.P.బాలు,P.సుశీల
శంకరాభరణ::రాగం
కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా
మరి మరి అడిగాను
అంతే అంతే అంతే
కుశలమా నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళు వదలలేకా
ఎదో ఎదో వ్రాసాను అంతే అంతే అంతే
!! కుశలమా !!చిన్నతల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలు గారు చెక్కిలిపైన
పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవుల పైన
దేవిగారికొకటి
ఒకటేనా.....ఒకటేనా
హహ...ఎన్నైనా....ఆ...
హాయ్ ఎన్నెన్నో......
మనసు నిలుపుకోలేక మరి మరి
అడిగాను అంతే అంతే అంతే
!! కుశలమా .. హాయ్ !!పెరటిలోని పూల పానుపు
త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లు
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులొచ్చేనో
ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కల పైన
నీలి మబ్బు పాయలపైనా
అందేనా ఒకటైనా
అందెనులే తొందర తెలిసెనులే
!! కుశలమా !!
Labels:
Hero::Sobhanbabu,
P.Suseela,
SP.Baalu,
బలి పీఠం--1975
బలిపీఠం--1975::యదుకుల కాంభోజి::రాగం
సంగీతం!!చక్రవర్తి
రచన::దాశరథి
గానం::V.రామకృష్ణ ,P.సుశీల
రాగం::యదుకుల కాంభోజిపహడి(లేక) హిందుస్తానీ
పహడిలో తరుచు ప్రతిధ్వని వుంటుంది
చందమామ రావే జాబిల్లి రావే
అమ్మాయి అలిగింది అలకతీర్చిపోవే
అలకతీర్చిపోవే
చందమామ రావే జాబిల్లి రావే
అబ్బాయి నోటికి తాళమేసి పోవే
తాళమేసి పోవే
చందమామ రావే...
చల్లగాలి జడిపిస్తోంది ఎలాగా...
గళ్ళదుప్పటి కప్పుకొండి ఇలాగా
పండువెన్నెల రమ్మంటుంది ఎలాగా
తలుపుతీసా వెళ్ళిరండి ఇలాగా
అందాల ఈరేయి వెళతాను అంటొంది
ఇద్దరిని ఒక్కటిగ చూడాలని అంటుంది
ఏదో వంకతో ఎందుకు పిలవాలీ
కావాలంటే సూటిగానే అడగలేరా
చందమామ రావే జాబిల్లి రావే
అబ్బాయి నోటికి తాళమేసి పోవే
తాళమేసి పోవే
చందమామ రావే...
అమ్మాయి పుడితేను ఎలాగా
పెళ్ళిచేసి పంపాలి ఇలాగా
అబ్బాయి పుడితేను ఎలాగా
గొప్పవాణ్ణి చేయాలి ఇలాగా
అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా
మీలాగే వుండాలి మీ మనసే రావాలి
తల్లే పాలతో మంచిని పోయాలి
ఆ మంచితోనే�ోనే వారు మనకు పేరు తేవాలి
చందమామ రావే జాబిల్లి రావే
పాపాయి పుడితేను జోలపాడ రావే
జోలపాడ రావే
చందమామ రావే....
కార్తీక దీపం--1979::కానడ::రాగం
సంగీతం:: సత్యం
రచన::M.గోపి
గానం::S.జానకి,S.P.బాలు.
కానడ::రాగం
(హిందుస్తానీ ~ కర్నాటక)
పల్లవి::
నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...
చరణం::1
చల్లగ కాసే పాల వెన్నెల
నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి
నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై
వలపే దివ్వెగ వెలిగించు
నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి..
చరణం::2
నింగి సాక్షి..నేల సాక్షి
నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన
నాలో నీవే సగపాలు
వేడుకలోను..వేదనలోను
పాలు తేనెగ ఉందాము
నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి..
Labels:
Hero::Sobhanbabu,
S.Jaanaki,
SP.Baalu,
కార్తీక దీపం--1979
Friday, January 04, 2008
కార్తీక దీపం--1979
సంగీతం::సత్యం
రచన::దేవులపల్లి కౄష్ణశాస్త్రి
గానం::P.సుశీల,S.జానకి
రాగం:::కాఫీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం కర్పూరదీపం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
ఇదే సుమా నా కుంకుమతిలకం
ఇదే సుమా నా మంగళసూత్రం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
ఇంటిలోన నా పాపరూపునా గోరంతదీపం
కంటికెదురుగా కనబడువేళలా కొండంతదీపం
నా మనస్సులో వెలిగేదీపం
నామనుగడ నడిపే దీపం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో
ఈకోనేట ఈ చిరుదివ్వ్యల చూసి చుక్కలనుకొంటారు
ఏవైనా ఏదైనా కోవెలలో కొలువైవుండే దేవికిపట్టే హారతులే
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
చేరనీ నీపాద పీఠం నా ప్రాణదీపం
నోచిన నోముల పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
నోచిన నోముల పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
ఎటనైనా ఎపుడైనా నే పలికే కళ్యాణదీపం
నే వలచే నా ప్రాణదీపం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
Labels:
P.Suseela,
S.Jaanaki,
కార్తీక దీపం--1979
Thursday, January 03, 2008
కార్తీక దీపం--1979
సంగీతం::సత్యం
రచన:: మైలవరపు గోపి
గానం::SP.బాలు,P.సుశీల
రాగం:::ఆనందభైరవి
యే మాట
అహా..తెలుసు
అదికాదు
ఇంకేమిటీ
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...
యే మాట
అహా..తెలుసు
అదికాదు
ఇంకేమిటీ
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...
పగలంత నా మాట వింటావట
పడకిల్లుచేరంగ దయరాదట
ఆవేళలో నీకు ఇల్లాలినీ
ఈఝాము నీపైన అధికారినీ
యే మాట
అహా..తెలుసు
అబ్బా..అదికాదు
హా..ఇంకేమిటీ
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...!!
పలకుంటే ఒకసారి ననుదోచుకో
కౌగిట బంధిచి ముద్దాడుకో
ఎన్నైనచెపుతావు ఈఘడియలో
చాలన్నదేలేదు నీభాషలో
యే మాట
అహా..తెలుసు
..అదికాదు
హా..ఇంకేమిటీ
చెపితే చాలదూ...
కోరిక తీరదూ...
ఇది విన్నదే...
రోజు వున్నదే...
ఆహా...ఆహ..హా...మ్మ్మమ్మ్మ!!
Labels:
Hero::Sobhanbabu,
P.Suseela,
SP.Baalu,
కార్తీక దీపం--1979
Wednesday, January 02, 2008
అందరూ దోంగలే--1974
![]() |
సంగీతం::KVమహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::మోహన్‌దాస్,S.P.బాలు
చంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
చంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
నీ పంట పండితే నవాబూ
వుంది తాళం ఏది బీగం
లేనేలేదా జవాబూ
వుంది తాళం ఏది బీగం
లేనేలేదా జవాబూ
మంచి ఖజానా
మనకు....?
నిధి దొరికేనా
నీకు బజాన
దారినపోయే చక్కనిదానా
బాగున్నానా..హ్హ..
నీ పక్కకురానాచంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
నీ పంట పండితే నవాబూ
దారిలోనా మాకు చిక్కింది
లక్కీ నాడా..
చిన్నదానా..నీవు చెప్పాలి
గుర్రపు జాడా...
దారిలోనా మాకు చిక్కింది
లక్కీ నాడా..
చిన్నదానా..నీవు చెప్పాలి
గుర్రపు జాడా..........
వెదకాలీ దీనికి జోడీ
వెదకాలీ దీనికి జోడీ
అది చూపవే ఓ వగలాడీ..
ఒప్పులకుప్పా..చెపితే తప్పా
కంటికిరెప్పా..ముత్యపుచిప్పా
ఎక్కడవుంటావ్ తాళంకప్ప
చూటుచెప్పూ..హ్హ..చిక్కుముడివిప్పూచంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
నీ పంట పండితే నవాబూ
పదనాన్నా..మనలాభం
బండి సున్నా...
అచ్చుబోసి తెగ నచ్చింది
అత్తా..రిల్లూ..
అంతలోనే..ఇది దొరికింది
ఫలితం నిల్లూ
అచ్చుబోసి సాగ నంపింది
అత్తారిల్లూ
అంతలోనే..ఇది దొరికింది
ఫలితం నిల్లూ
గతి ఏదని నిన్నడిగేమూ
గతి ఏదని నిన్నడిగేమూ
అది చెపితే నీకు సలామూ..
నీ గులాము మేమవుతాము
నీవడిగింది చేసేస్తాము
రోజూ రోజూ సేవిస్తాము
చెప్పు గుట్టూ..హ్హ
దారి చూపేట్టూ...చంటి బాబూ
ఓ..బుజ్జి బాబూ
నీ పంట పండితే నవాబూ
హా..వదిలెయర
పదరా నా మనరాత
బండి సున్నా
ఏడుకొండలవాడా
వేంకటారమణా
ఆపదమొక్కులవాడా
నువ్వే శరణు..
ఓ స్వామీ మాకు ఇచ్చావు
నువ్వో తాళం
అంతర్యామి కాని చేసావు
మాయాజాలం
ఓ స్వామీ మాకు ఇచ్చావు
నువ్వో తాళం
అంతర్యామి కాని చేసావు
మాయాజాలం
చూపిస్తే సొమ్ములమూటా..
చూపిస్తే సొమ్ములమూటా..
మేమిస్తాం నీకో వాటా..
మా ఈ నోట రాజులజూట
ఆడినమాట అగ్గిబరాట
ఒడ్డుకలాట చూపుముబాట
ఆగలేదా..హ్హ
నీకు డబ్బు చేదా..చంటిబాబూ..
ఓ..బుజ్జిబాబూ
నీ పంట పండితే నవాబూ
చంటిబాబూ..
ఓ..బుజ్జిబాబూ..
చంటిబాబూ..
ఓ..బుజ్జిబాబూ..
చంటిబాబూ..
ఓ..బుజ్జిబాబూ.....
VICTORIA NO.203--1972
Music::Anandji Virji Shah, Kalyanji Virji Shah
lyrics::Verma Malik
Singer's::Kishore Kumar, Mahendra Kapoor
Film Director::Brij
Cast::Navin Nischol, Saira Banu, Pran, Ashok Kumar
::::::::::::::::::::::::::::
help me please to find the locker find the locker
help me please to find the locker
help me please to find the locker find the locker
help me please to find the locker
do bechare bina sahaare, dekho puchh-puchh kar haare
do bechare bina sahaare, dekho puchh-puchh kar haare
bin taale ki chabhi lekar phirte maare-maare
main hu raja yeh hai rana, o main diwaana yeh mastaana
dono milke gaaye gaana o hasina o jara ruk jaana
o jara ruk jaana
help me please to find the locker find the locker
help me please to find the locker
help me please to find the locker find the locker
help me please to find the locker
o father apna aisa huva hai ghotaala
o father apna aisa huva hai ghotaala
mili chabhi par mila hai nahi humko taala
gar maal milega jyaada, gar maal milega jyaada
tujhko de denge aadha yeh hai vaada, kya iraada
koi kaam nahi hai jyada, le ke jaana adha adha
yeh offer le lona, o binati sun lo na
do bechare bina sahaare, dekho puchh-puchh kar haare
help me please to find the locker find the locker
help me please to find the locker
ek chabhi chabhi sapne hazaar, sab aar paar ka phera hai
mere taal taal kyun tu faraar, bas tu hi mit ghanera hai
baje bin bin nache bekaraar, hum saap saap tu sapera hai
phir dwaar dwaar pite baar baar, kab in raato ka sabera hai
dil taar taar roye jaar jaar, khushiyo ka kaun lutera hai
parvardigaar parvardigaar bas hame bharosa tera hai
tu bata de iska milta nahi humko locker
tu bata de iska milta nahi humko locker
kuchh pata de tere ban jaayenge hum naukar
sasuraal se dekho hum aaye
sasuraal se dekho hum aaye
chabhi lekar pachhtaaye hai ghabraaye
sar chakaraaye kuchh na bhaaye, aake tumse hi takraaye
dhakke khaaye, samajh na aaye o paape
o kuchh bolo na, o kuchh bolo na
do bechare bina sahaare, dekho puchh-puchh kar haare
bin taale ki chabhi le kar phirte maare maare
main hu raja yeh hai rana, o main diwaana yeh mastaana
dono milke gaaye gaana o hasina o jara ruk jaana
o jara ruk jaana
help me please to find the locker find the locker
help me please to find the locker
help me please to find the locker find the locker
help me please to find the locker
Subscribe to:
Posts (Atom)




