Monday, September 26, 2011

పెళ్లి పుస్తకం--1991




సంగీతం::KV.మహాదేవన్

రచన::ఆత్రేయ
దర్శకత్వం::బాపు
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::రాజేంద్ర ప్రసాద్,దివ్యవాణి
శ్రీ:::రాగం

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికినింపుకో

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

బడిపంతులు--1972



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల,బృందం


ల్లాలాలాల్లాలాలలలల
ల్లాలాలాల్లాలాలలలల

పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము
పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము
పిడికిలి బిగించి కదిలాము

ల్లాలాలాల్లాలాలలలల
హ్హహ్హహహహహాహ్హాఊఊఊఊఒ

పలక బలపం పట్టిన చేతులు పలుగూ పార ఎత్తినవి
పలక బలపం పట్టిన చేతులు పలుగూ పార ఎత్తినవి
ఓనమాలను దిద్దినవే ళ్ళు ఒకైటె మట్టిని కలిపినవి
ఒకైటె మట్టిని కలిపినవి
పిల్లలము.పిల్లలము..బడి పిల్లలము..బడి పిల్లలము

ప్రతి అణువు మా భక్తికి గుర్తు..ప్రతిరాయి మా శక్తికి గుర్తు
ప్రతి అణువు మా భక్తికి గుర్తు..ప్రతిరాయి మా శక్తికి గుర్తు
చేతులు కలిపి చెమటతో తడిపి
చేతులు కలిపి చెమటతో తడిపి
కోవెల కడదాం గురుదేవునికి
కోవెల కడదాం గురుదేవునికి
పిల్లలము.పిల్లలము..బడి పిల్లలము..బడి పిల్లలము

ల్లాలాలాల్లాలాలలలల
హ్హహ్హహహహహాహ్హాఊఊఊఊఒ

తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
వెలుగును తెచ్చే ఈ కిటికీలు పంతులుగారి చల్లని కళ్ళు
పంతులుగారి చల్లని కళ్ళు
పిల్లలము.పిల్లలము..బడి పిల్లలము..బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము
ల్లాలాలాల్లాలాలలలల

బడిపంతులు--1972



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


అతడు::నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె::నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా

అతడు::నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె::నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా!


అతడు::పరికిణీలు కట్టినప్పుడు లేని సొగసులు
నీ పైటకొంగు చాటున దోబూచులాడెను
పరికిణీలు కట్టినప్పుడు లేని సొగసులు
నీ పైటకొంగు చాటున దోబూచులాడెను

ఆమె::పసితనాన ఆడుకున్న తొక్కుడు బిళ్లలు
నీ పరువానికి నేర్పినవీ దుడుకు కోర్కెలు
పసితనాన ఆడుకున్న తొక్కుడు బిళ్లలు
నీ పరువానికి నేర్పినవీ దుడుకు కోర్కెలు

అతడు::పాలబుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందు దోచె వయసు జోరులు
పాలబుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందు దోచె వయసు జోరులు

ఆమె::చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమితీసె వలపుదారులు
చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమితీసె వలపుదారులు

అతడు::నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె::నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా!

అతడు::ఇన్నాళ్లూ కళ్లుకళ్లు కలిపి చూస్తివి
ఇప్పుడేం రెప్పలలా రెపరెపన్నవి
ఇన్నాళ్లూ కళ్లుకళ్లు కలిపి చూస్తివి
ఇప్పుడేం రెప్పలలా రెపరెపన్నవి


ఆమె::ఇన్నాళ్లూ నీ కళ్లు వూరుకున్నవి
ఇపుడేవేవో మూగబాస లాడుచున్నవి
ఇన్నాళ్లూ నీ కళ్లు వూరుకున్నవి
ఇపుడేవేవో మూగబాస లాడుచున్నవి


అతడు::నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె::నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా!

బడిపంతులు--1972::ఆనంద భైరవి::రాగం



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

ఆనంద భైరవి::రాగం 

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

ఉపకారాలే చేసితినో..ఎరగక అపచరాలే చేసితినో
ఉపకారాలే చేసితినో..ఎరగక అపచరాలే చేసితినో
ఒడుదుడుకులలో తొడై ఉంటిని..మీ అడుగున అడుగై నడిచితిని

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు..రెక్కలు అలిసి మీరున్నారు
రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు..రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి..
పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

ఏ నోములు నే నోచితినో..ఈ దేవుని పతిగా పొందితిని
ఏ నోములు నే నోచితినో..ఈ దేవుని పతిగా పొందితిని
ప్రతి జన్మ మీ సన్నిధిలొనా ప్రమిదగ వెలిగే వరమడిగితిని

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

Sunday, September 25, 2011

దేశోద్ధారకులు--1973














సంగీతం::K.V.మహాదేవన్
రచన:: మోదుకూరి జాన్సన్
గానం::P.సుశీల,బృందం


స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం
తేనెలాంటి మనసులున్న తేలుగు నేలకు
అన్నపూర్ణను మించిన ఆంద్రభూమికీ
స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం

పల్లెసీమ పైరగాలి పరవళ్ళూ
కల్లలేని జానపదుల జావళీలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ గ రీ స ద..
మ ప ద స రి సా ద ప రి మ ప ద
రి స ద ప మ రి స రి మ ప ద స..
పల్లెసీమ పైరగాలి పరవళ్ళూ
కల్లలేని జానపదుల జావళీలు
రైతుబిడ్డ తొలిపాటల రవళులూ
రైతుబిడ్డ తొలిపాటల రవళులూ
తెలుగు సిరులు కురిసి నీకు హారతులివ్వగ

స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం

గోదావరీ పాదాలకూ నీళ్ళివ్వగా
పినాకినీ పిలిచి నీకు పీట వేయగా
గోదావరీ పాదాలకూ నీళ్ళివ్వగా
పినాకినీ పిలిచి నీకు పీట వేయగా
కృష్ణవేణి మెచ్చి కడుపు నింపగా
గోదావరీ పాదాలకూ నీళ్ళివ్వగా
పినాకినీ పిలిచి నీకు పీట వేయగా
కన్నతల్లి కడుపుతీపి తాంబూలమివ్వగ

స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగత

అజంతా ఎల్లోరా కన్నియలూ
అజంతా ఎల్లోరా కన్నియలూ
ఓరుగల్లు వీణయతో కొండవీటి తీగచుట్టి
హంపీ అమరావతి గొంతులతో ఆ ఆ ఆ
హంపీ అమరావతి గొంతులతొ
గతస్మృతులను పాడగా గర్వంగా నిలిచినదీ

స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం
తేనెలాంటి మనసులున్న తేలుగు నేలకు
అన్నపూర్ణను మించిన ఆంద్రభూమికీ
స్వాగతం దొరా సుస్వాగతం
స్వాగతం దొరా సుస్వాగతం

Saturday, September 24, 2011

అమాయకురాలు--1971



సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య.

::::::

సన్నజాజి పువ్వులు..చందమామ కాంతులు
చిన్నారి పాపా నవ్వులూ..మా ఇంటి వెలుగు
మా కంటి వెలుగు..బంగారు జ్యోతుల దీవెనలు
సన్నజాజి పువ్వులు..చందమామ కాంతులు
చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు..మా కంటి వెలుగు
బంగారు జ్యోతుల దీవెనలు...

:::::1


పాపయి గెంతులు..తువ్వాయి చెంగులు
పాపయి గెంతులు..తువ్వాయి చెంగులు
తూనీగ లాగా దొరకదు
పరుగులు తీసె పండుగ..ఉరకలు వేసే వేడుక
మా జ్యోతి చిందులే అందాల విందులు

సన్నజాజి పువ్వులు..చందమామ కాంతులు
చిన్నారి పాపా నవ్వులు ...

::::2


తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను
అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను
తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను
అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను
ఆడిన ఆట...పాడిన పాట
ఆడిన ఆట అల్లరి..పాడిన పాట పల్లవి
మా జ్యోతి మాటలే వరహాల మూటలు..

సన్నజాజి పువ్వులు..చందమామ కాంతులు
చిన్నారి పాపా నవ్వులు

:::::3


ఆ కొంటె చేష్టలు..ఆ చిలిపి చూపులు
ఆ కొంటె చేష్టలు..ఆ చిలిపి చూపులు
ఆనందమొసగే వరములు
ఇరుగు పొరుగు మెచ్చగా..ఇంటీలిపాదికి నచ్చగా
చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా..

సన్నజాజి పువ్వులు..చందమామ కాంతులు
చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు..మా కంటి వెలుగు
బంగారు జ్యోతుల దీవెనలు...


Amayakuralu--1971
Music::Saluri Rajeswara Rao
Lyricis::C Narayana Reddy
Singer's::S.P.Balu, P.Susheela

:::

sannajaji puvvulu chandamama kantulu
chinnari papa navvulu
ma inti velugu ma kanti velugu
bangaaru jotula deevenalu
angaaru jotula deevenalu

:::1

papayi gentulu tuvvayi chengulu
papayi gentulu tuvvayi chengulu
tureegalaaga dorakadu
parugulu teeste panduga
urakalu veste veduka
ma joti chindule andaala vindulu

:::2

tatayya meesala uyyalalugenu
ammamma kallato dobuchulaadenu
tatayya meesala uyyalalugenu
ammamma kallato dobuchulaadenu
aadina aata padina paata
aadina aata allari padina paata pallavi
ma joti matale varahala mutalu

:::3

aa konte chestalu aa chilipi chupulu
anandamosage varamulu
iruguporugu mechaga intillipadiki nachaga

chiranjeevi peragali bangaru talligaa

అమాయకురాలు--1971



సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల


::::


అతడు::నీ చూపులు గారడి చేసెను..
నీ నవ్వులు పూలై పూచెను
ఆ నవ్వులలో..అ చూపులలో..
నిను కవ్వించే వాడెవ్వడూ

ఆమె::నా చూపులు గారడి చేసినా..
నా నవ్వులు పూలై పూచిన
ఏ ఒక్కరికో అవి దక్కును లే..ఆ టక్కరి దొంగవు నీవేలే

::::::1


అతడు::నీ మోమే ఒక చంద్రబింబం
దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం
నీ మోమె ఒక చంద్రబింబం
ఆ అందం చూసి..నీ ముందుకు దూకి
ఆ అందం చూసి..నీ ముందుకు దూకి
ఎందరు యువకులు తొందరపడి నిను ఎత్తుకు పోతారో
నేనేమైపోతానో...
ఆమె::అహహహహా...

ఆమె::నా చూపులు గారడి చెసినా
నా నవ్వులు పూలై పూచిన
ఏ ఒక్కరికో అవి దక్కును లే...ఆ టక్కరి దొంగవు నీవేలే

:::::::2


ఆమె::మగసరి గల సొగసైన దొరవు
అందుకు సరిపడు సిరులెన్నొ కలవు
మగసరి గల సొగసైన దొరవు
నీ పక్కన మూగీ..తమ మక్కువ చూపీ
నీ పక్కన మూగీ..తమ మక్కువ చూపీ
చక్కని పడుచుల చెక్కిలి తళుకుల చిక్కుకుపోతావో
నేనేమై పోతానో..నీ చెలిని మరిచేవో
హూ..ఉహుహుహుహు..

అతడు::నీ చూపులు గారడి చేసెను..
నీ నవ్వులు పూలై పూచెను
ఆ నవ్వులలో..అ చూపులలో..నిను కవ్వించే వాడెవ్వడూ

ఆమె::చిగురించిన ఈ అనురాగం
వికసించునులే కలకాలం
చిగురించిన ఈ అనురాగం

అతడు::నీ వలపేనేనై...
ఆమె:: నా వెలుగే నీవై..
ఇద్దరు::కమ్మని మమతల బంగరు మేడల కలలే కందామా
కల..ఏ కందామా..
అహా హా హ హా..ఆ హా హ హా
అహా హా హ హా..ఆ హా హ హా

అమాయకురాలు--1971



సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::కోసరాజు
గానం::P.సుశీల,L.R.ఈశ్వరీ

తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య.

::::::

చిరునవ్వుల కులికే రాజా..సిగ్గంతా ఒలికే రాణీ

సరి జోడు కుదిరింది లే..ఏ..
సరదాలకు లోటే లేదు లే..
చిరునవ్వుల కులికే రాజా..సిగ్గంతా ఒలికే రాణీ సరి జోడు కుదిరింది లే..ఏ..
సరదాలకు లోటే లేదు లే..

:::1

కనకానికి లొంగని వాన్ని..కాంతంటే పొంగని వాన్ని
కనకానికి లొంగని వాన్ని..కాంతంటే పొంగని వాన్ని
ముచ్చటైన ముద్దులగుమ్మా..మోజుతీర వలచిందయ్య
చేతిలోన చెయ్ వెయ్యమందీ..చెప్పినట్టు వినుకోమందీ
బుద్ది కలిగి ఉండకపోతే..బుగ్గపోట్లు తింటావందీ

చిరునవ్వుల కులికే రాజా..సిగ్గంతా ఒలికే రాణీ
సరి జోడు కుదిరింది లే..ఏ..
సరదాలకు లోటే లేదు లే..

:::2

అంతస్థులు చూడకుండా..ఐశ్వర్యం ఎంచకుండా..

అంతస్థులు చూడకుండా..ఐశ్వర్యం ఎంచకుండా
చక్కనైన నడవడి చూసీ..చల్లని మనసిచ్చాడమ్మా..
అజం తోటి నడిచావంటే..చులకనగా చూసావంటే
మడత చపాతీలు వేసీ..బడిత పూజ చేస్తాడమ్మా..

చిరునవ్వుల కులికే రాజా...సిగ్గంతా ఒలికే రాణీ
సరి జోడు కుదిరింది లే..ఏ..
సరదాలకు లోటే లేదు లే..

:::3

మా కష్టం తెలిసిన బాబు..నీ జతగాడైనాడమ్మా..
చిలికా గొరింకల్లాగా కిల కిలమని కులకండమ్మా
సరసాల్లో గుమ్మైపోయీ..జలసాల్లో చిత్తైపోయీ
మమ్ము కాస్త మరిచారంటే దుమ్ము దులిపి వేస్తామయ్యో

చిరునవ్వుల కులికే రాజా..సిగ్గంతా ఒలికే రాణీ
సరి జోడు కుదిరింది లే..ఏ..
సరదాలకు లోటే లేదు లే

Amayakuralu--1971
Music::Saluri Rajeswara Rao
Lyricis::C Narayana Reddy
Singer's::S.P.Balu, P.Susheela
Caste::A.N.R. , Kanchana ,Sarada,Gummadi,Naagabhushanam,Alluraamalingayya,Raajabaabu,Ramaaprabha,Chalam,Chandramohan.

:::

chirunavvula kulike raajaa
siggantaa volike rani
sarijodu kudirindile saradalaku lote ledule
sarijodu kudirindile saradalaku lote ledule

:::1

kanakaniki longani vanni
kasante pongani vanni
muchataina muddula gumma 
moju teera valachindayya
chetilona chey veyyamandi 
cheppinattu vinukomandi
buddi kaligi vundakapote 
buggapotlu tintaavandi..

:::2

antastulu chudakundaa
aishwarayam chudakundaa
antastulu chudakundaa
aishwarayam chudakundaa
chakkanaina nadavadi chuchi 
challani manasichaadammaa
aduru toti nadichavante 
chulakanaga chusavante
madata chapaatilu vesi 
badite puja chestadamma

:::3

ma kastam telisina babu
ne jatagadainadammaa
chilaka gorinkallaga 
kilakilamani kulakandamma
sarasaallo gummaipoyi 
jalasaallo chittayipoyi
mammu kasta maricharante 

dummu dulipe vestamayyo

పులు బిడ్డ--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల


పల్లవి:: 

అతడు::మనసంతా మంగళవాద్యాలే
ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే
మనసంతా మంగళవాద్యాలే
ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

ఆమె::అనురాగ గీతాల సుమమాల లల్లి
అనుబంధ గంధాలు మన మీద చల్లి
దేవతలే దీవించువేళ

అతడు::మనసంతా మంగళవాద్యాలే
ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

చరణం::1

అతడు::చిగురుటాకుల పందిరిలోన
చిలకపాప పేరంటంలో
కోయిలమ్మ మేళంపెట్టి
కొంగు కొంగు ముడిపడుతుంటె

ఆమె::ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో 
ఆశీర్వదించేనులే ఈ వసంతం
ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో 
ఆశీర్వదించేనులే ఈ వసంతం
ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం
ఇకమనకు సొంతం 

అతడు::మనసంతా మంగళవాద్యాలే
ఆమె::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

చరణం::2

ఆమె::కలలు పండి గెలలేస్తుంటే
కళ్లు నన్ను నిలవేస్తుంటే
ఇద్దరొకటై గదిలొ..చేరి
నిద్దర కోసం వెతుకుతు వుంటె

అతడు::ఏడేడు అడుగుల సప్తస్వరాలు
నా ముద్దుమురిపాల మధురాక్షరాలు
ఏడేడు అడుగుల సప్తస్వరాలు
నా ముద్దుమురిపాల మధురాక్షరాలు
ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు..ఎన్నోవరాలు

ఆమె::మనసంతా మంగళవాద్యాలే
ఆమె::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

అతడు::మనసంతా మంగళవాద్యాలే
అతడు::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

పులు బిడ్డ--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల


పల్లవి:: 

బుజ్జిపాపా..బుల్లిపాపా
బొజ్జనిండా పాలుతాగి పండుకోమ్మా
చంటిపాపా..కొంటెపాపా
అల్లరింక..చాలుగానీ నిద్దరోమ్మా

బుజ్జిపాపా..బుల్లిపాపా
బొజ్జనిండా పాలుతాగి పండుకోమ్మా
చంటిపాపా..కొంటెపాపా
అల్లరింక..చాలుగానీ నిద్దరోమ్మా

చరణం::1

బస్కీల వీర కుస్తీ కుమారా
ఉంగ ఉంగ ఉగ్గుపడతావేరా
సాములేల నా సామి రారా
టింగురంగా సిగ్గుపడతావేరా
గిల్లి జోలల్లు నే పాడనా..
తల్లి ముద్దుల్లోనే ముంచినా కోపమొచ్చినా..
తాపమొచ్చినా..ధూపమెయ్యనా
జిడ్డునాయనా బొడ్డుకోయనా
పేరు పెట్టనా నిద్దరోమ్మా..నిద్దరోమ్మా.

చరణం::2

వ్యాయామ భీమ..వస్తాదు సోమా..
దండాలెడతా దండేలింక ఆపరా
పరువాలపాప పొరుగింటిదీపా
ఆరాటాలు ఆయాసాలు మానరా
బుజ్జిగా లాల నే పొయ్యనా
వెచ్చగా చిచ్చి నే కొట్టనా
కాలుబెణికినా..కీలు విరిగినా..కాపుకాయనా
పుష్టి నాయనా దిష్టి తీయనా చుక్కపెట్టనా
నిద్దరోమ్మా..నిద్దరోమ్మా