సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల
పల్లవి::
బుజ్జిపాపా..బుల్లిపాపా
బొజ్జనిండా పాలుతాగి పండుకోమ్మా
చంటిపాపా..కొంటెపాపా
అల్లరింక..చాలుగానీ నిద్దరోమ్మా
బుజ్జిపాపా..బుల్లిపాపా
బొజ్జనిండా పాలుతాగి పండుకోమ్మా
చంటిపాపా..కొంటెపాపా
అల్లరింక..చాలుగానీ నిద్దరోమ్మా
చరణం::1
బస్కీల వీర కుస్తీ కుమారా
ఉంగ ఉంగ ఉగ్గుపడతావేరా
సాములేల నా సామి రారా
టింగురంగా సిగ్గుపడతావేరా
గిల్లి జోలల్లు నే పాడనా..
తల్లి ముద్దుల్లోనే ముంచినా కోపమొచ్చినా..
తాపమొచ్చినా..ధూపమెయ్యనా
జిడ్డునాయనా బొడ్డుకోయనా
పేరు పెట్టనా నిద్దరోమ్మా..నిద్దరోమ్మా.
చరణం::2
వ్యాయామ భీమ..వస్తాదు సోమా..
దండాలెడతా దండేలింక ఆపరా
పరువాలపాప పొరుగింటిదీపా
ఆరాటాలు ఆయాసాలు మానరా
బుజ్జిగా లాల నే పొయ్యనా
వెచ్చగా చిచ్చి నే కొట్టనా
కాలుబెణికినా..కీలు విరిగినా..కాపుకాయనా
పుష్టి నాయనా దిష్టి తీయనా చుక్కపెట్టనా
నిద్దరోమ్మా..నిద్దరోమ్మా
No comments:
Post a Comment