Saturday, September 24, 2011

అమాయకురాలు--1971



సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల


::::


అతడు::నీ చూపులు గారడి చేసెను..
నీ నవ్వులు పూలై పూచెను
ఆ నవ్వులలో..అ చూపులలో..
నిను కవ్వించే వాడెవ్వడూ

ఆమె::నా చూపులు గారడి చేసినా..
నా నవ్వులు పూలై పూచిన
ఏ ఒక్కరికో అవి దక్కును లే..ఆ టక్కరి దొంగవు నీవేలే

::::::1


అతడు::నీ మోమే ఒక చంద్రబింబం
దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం
నీ మోమె ఒక చంద్రబింబం
ఆ అందం చూసి..నీ ముందుకు దూకి
ఆ అందం చూసి..నీ ముందుకు దూకి
ఎందరు యువకులు తొందరపడి నిను ఎత్తుకు పోతారో
నేనేమైపోతానో...
ఆమె::అహహహహా...

ఆమె::నా చూపులు గారడి చెసినా
నా నవ్వులు పూలై పూచిన
ఏ ఒక్కరికో అవి దక్కును లే...ఆ టక్కరి దొంగవు నీవేలే

:::::::2


ఆమె::మగసరి గల సొగసైన దొరవు
అందుకు సరిపడు సిరులెన్నొ కలవు
మగసరి గల సొగసైన దొరవు
నీ పక్కన మూగీ..తమ మక్కువ చూపీ
నీ పక్కన మూగీ..తమ మక్కువ చూపీ
చక్కని పడుచుల చెక్కిలి తళుకుల చిక్కుకుపోతావో
నేనేమై పోతానో..నీ చెలిని మరిచేవో
హూ..ఉహుహుహుహు..

అతడు::నీ చూపులు గారడి చేసెను..
నీ నవ్వులు పూలై పూచెను
ఆ నవ్వులలో..అ చూపులలో..నిను కవ్వించే వాడెవ్వడూ

ఆమె::చిగురించిన ఈ అనురాగం
వికసించునులే కలకాలం
చిగురించిన ఈ అనురాగం

అతడు::నీ వలపేనేనై...
ఆమె:: నా వెలుగే నీవై..
ఇద్దరు::కమ్మని మమతల బంగరు మేడల కలలే కందామా
కల..ఏ కందామా..
అహా హా హ హా..ఆ హా హ హా
అహా హా హ హా..ఆ హా హ హా

No comments: