Saturday, September 24, 2011

పులు బిడ్డ--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల


పల్లవి:: 

అతడు::మనసంతా మంగళవాద్యాలే
ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే
మనసంతా మంగళవాద్యాలే
ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

ఆమె::అనురాగ గీతాల సుమమాల లల్లి
అనుబంధ గంధాలు మన మీద చల్లి
దేవతలే దీవించువేళ

అతడు::మనసంతా మంగళవాద్యాలే
ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

చరణం::1

అతడు::చిగురుటాకుల పందిరిలోన
చిలకపాప పేరంటంలో
కోయిలమ్మ మేళంపెట్టి
కొంగు కొంగు ముడిపడుతుంటె

ఆమె::ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో 
ఆశీర్వదించేనులే ఈ వసంతం
ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో 
ఆశీర్వదించేనులే ఈ వసంతం
ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం
ఇకమనకు సొంతం 

అతడు::మనసంతా మంగళవాద్యాలే
ఆమె::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

చరణం::2

ఆమె::కలలు పండి గెలలేస్తుంటే
కళ్లు నన్ను నిలవేస్తుంటే
ఇద్దరొకటై గదిలొ..చేరి
నిద్దర కోసం వెతుకుతు వుంటె

అతడు::ఏడేడు అడుగుల సప్తస్వరాలు
నా ముద్దుమురిపాల మధురాక్షరాలు
ఏడేడు అడుగుల సప్తస్వరాలు
నా ముద్దుమురిపాల మధురాక్షరాలు
ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు..ఎన్నోవరాలు

ఆమె::మనసంతా మంగళవాద్యాలే
ఆమె::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

అతడు::మనసంతా మంగళవాద్యాలే
అతడు::ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

No comments: