Sunday, November 14, 2010

పాల మనసులు--1968























సంగీతం::సత్యం
రచన::డా.సినారె
గానం::పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
తారాగణం::హరనాధ్,జమున,గుమ్మడి,చలం,రావికొండలరావు,రమాప్రభ,ఛాయాదేవి,పండరీబాయి

పల్లవి::

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం::1

రెక్కా రెక్కా ఆనించి..రేయి పగలు విహరించి
రెక్కా రెక్కా ఆనించి..రేయి పగలు విహరించి
మిన్నులలో ఎగిసింది..అది వెన్నెలలో తడిసినది
మిన్నులలో ఎగిసింది..అది వెన్నెలలో తడిసినది

ఆ..కోరికలూరే ఆ జంట..ఆరని ఆశల చలి మంట
కోరికలూరే ఆ జంట..ఆరని ఆశల చలి మంట 
చల్లారని ఆశల..చలి మంట

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం::2

పచ్చని చిలకను చేరగనే..వెచ్చగ ఒదిగెను గోరింక
పచ్చని చిలకను చేరగనే..వెచ్చగ ఒదిగెను గోరింక
ముద్దుల జంటను చూడగనే..ముసిముసి నవ్వును నెలవంక
ముద్దుల జంటను చూడగనే..ముసిముసి నవ్వును నెలవంక

ఆ..కలకలాలాడే ఆ జంట..కమ్మని వలపుల తొలి పంట
కలకలా లాడే ఆ జంట..కమ్మని వలపుల తొలి పంట
కమ్మని వలపుల..తొలి పంట

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది

పూల రంగడు--1967




















సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల, P. సుశీల

పల్లవి::

నీ నడుముపైన చేయి వేసి నడువనీ
నన్ను నడువనీ
నీ చేతుల చెరసాలలోన
చేరని..నన్ను చేరనీ

నీ జిలుగుపైట నీడలోన నిలువనీ
నన్ను నిలువనీ
నీ అడుగులోన అడుగువేసి నడువనీ 
నన్ను నడువని

చరణం::1

చిక్కని బుగ్గలపై చిటికెలు వేయనీ
సన్నని నవ్వులలో సంపెంగలేరని
గులాబి పెదవులనే..అలా అలా చూడనీ

నీ జిలుగుపైట నీడలోన నిలువని..నన్ను నిలువనీ
నీ అడుగులోన అడుగులేసి నడువని..నన్ను నడువనీ

చరణం::2
పచ్చిగ తిన్నెలలో వెచ్చగ సాగనీ
వెచ్చని వెన్నెలలో ముచ్చటలాడని
ముచ్చటలాడి ఆడి మురిసి మురిసి పాడని

నీ జిలుగుపైట నీడలోన నిలువని..నన్ను నిలువని
నీ అడుగులోన అడుగు వేసి నడువని..నన్ను నడువని

చరణం::3
మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
ఆ..ఆ...ఆ...ఆ..ఆ...

మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
బంగారు కోవెలలో కొంగులు ముడివేయనీ
బంగారు కోవెలలో కొంగులు ముడివేయనీ


Poola Rangadu--1967
Music::S.Rajeswara Rao
Lyricis::C. Narayana Reddy
Singer's::Ghantasala, P.Susheela

Nee nadumu paina cheyi vesi naduvanee
Nannu naduvanee
Nee chetula cherasalalona cheranee
Nannu cheranee

Nee jilugu paita needalona niluvanee
Nannu niluvanee
Nee adugulona adugu vesi naduvanee
Nannu naduvanee

Chikkani buggalapai chitikelu veyanee
Sannani navvulalo sampengaleranee
Gulabi pedavulane ala ala chudanee..

Pachika tinnelalo vechaga kaaganee
Vechani vennelalo muchatalaadanee
Muchatalaadi aadi murisi murisi paadanee.

Mabbula vadalo manasulu kudanee
Mallela medalo mamatalu pandanee
Mabbula vadalo manasulu kudanee
Mallela medalo mamatalu pandanee
Bangaaru kovelalo kongulu mudi veyanee 

Bangaaru kovelalo kongulu mudi veyanee 

Wednesday, November 10, 2010

ధర్మాత్ముడు--1983



సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P.సుశీల
film Directed By::B.Bhaaskar Rao
తారాగణం::కృష్ణంరాజు,జయసుధ,విజయశాంతి,గుమ్మడి,ప్రభాకర్ రెడ్డి, 

పల్లవి:: 

దేవతలందరు ఒకటై వచ్చి..దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి..దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం..నూరేళ్ళు నిలవాలి

నిన్నటి పాపవు నువ్వు..రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం..ఒడి నిండే సౌభాగ్యం

దేవతలందరు ఒకటై వచ్చి..దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి..దీవెనలియ్యాలి 

నీ పసుపు కుంకుమ సౌభాగ్యం..నూరేళ్ళు నిలవాలి
నిన్నటి పాపవు నువ్వు..రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం..ఒడి నిండే సౌభాగ్యం

చరణం::1

గాజులేసి గంధం పూసి..దిష్టి బొట్టు బుగ్గన పెట్టి
హారతీయరారే..పాట పాడ రారే

మీ అందరు ఆశీస్సులే..రామరక్ష జీవితాన
ఎన్నటికీ పాపవమ్మా..కన్నవారి కళ్ళలోనా
మా ప్రాణం మా ధ్యానం..మా సర్వం నీవేనమ్మ

ఇల్లాలీ శీమంతం..ఒడి నిండే సౌభాగ్యం
ఇల్లాలీ శీమంతం..ఒడి నిండే సౌభాగ్యం

దేవతలందరు ఒకటై వచ్చి..దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి..దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం..నూరేళ్ళు నిలవాలి

నిన్నటి పాపవు నువ్వు..రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం..ఒడి నిండే సౌభాగ్యం

చరణం::2 

చిట్టి తల్లి కడుపున మోసే
చిన్ని నాన్న..ఎంతటి వాడో
రామచంద్రుడో..బాలకృష్ణుడో

తాత పేరు నిల్కంటికి..వెలుగిచ్చే దీపమై
వెలగాలీ ఏనాడు..ని కడుపున పెట్టెవాడు

ఇల్లాలీ శీమంతం..ఒడి నిండే సౌభాగ్యం
ఇల్లాలీ శీమంతం..ఒడి నిండే సౌభాగ్యం

దేవతలందరు ఒకటై వచ్చి..దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి..దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం..నూరేళ్ళు నిలవాలి

నిన్నటి పాపవు నువ్వు..రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం..ఒడి నిండే సౌభాగ్యం

DharmaatmuDu--1983
Music::Satyam
Lyrics::Mailavarapu GOpi
Singer's::S.P.Baalu,P.Suseela
film Directed By::B.Bhaaskar Rao
Cast::Krishnam Raju,Jayasudha,Vijayasaanti,Gummadi,Prabhaakar Reddi, 

:::::::::::::::::::::::::::::::::: 

dEvatalandaru okaTai vachchi..deevenaliyyaali
dEvatalandaru okaTai vachchi..deevenaliyyaali
nee pasupu kunkuma saubhaagyam..noorELLu nilavaali

ninnaTi paapavu nuvvu..rEpaTi taatanu nEnu
illaalii Seemantam..oDi ninDE saubhaagyam

dEvatalandaru okaTai vachchi..deevenaliyyaali
dEvatalandaru okaTai vachchi..deevenaliyyaali

nee pasupu kunkuma saubhaagyam..noorELLu nilavaali
ninnaTi paapavu nuvvu..rEpaTi taatanu nEnu
illaalii Seemantam..oDi ninDE saubhaagyam

::::1

gaajulEsi gandham poosi..dishTi boTTu buggana peTTi
haarateeyaraarE..paaTa paaDa raarE

mii andari aaSeessulE..raamaraksha jeevitaana
ennaTikii paapavammaa..kannavaari kaLLalOnaa
maa praaNam maa dhyaanam..maa sarvam neevEnamma

illaalii Seemantam..oDi ninDae saubhaagyam
illaalii Seemantam..oDi ninDae saubhaagyam

dEvatalandaru okaTai vachchi..deevenaliyyaali
dEvatalandaru okaTai vachchi..deevenaliyyaali
nee pasupu kunkuma saubhaagyam..noorELLu nilavaali

ninnaTi paapavu nuvvu..rEpaTi taatanu nEnu
illaalii Seemantam..oDi ninDE saubhaagyam

::::2 

chiTTi talli kaDupuna mOsE
chinni naanna..entaTi vaaDO
raamachandruDO..baalakRshNuDO

taata pEru nilkanTiki..velugichchE deepamai
velagaalii EnaaDu..ni kaDupuna peTTevaaDu

illaalii Seemantam..oDi ninDE saubhaagyam
illaalii Seemantam..oDi ninDE saubhaagyam

dEvatalandaru okaTai vachchi..deevenaliyyaali
dEvatalandaru okaTai vachchi..deevenaliyyaali
nee pasupu kuNkuma saubhaagyam..noorELLu nilavaali

ninnaTi paapavu nuvvu..rEpaTi taatanu nEnu
illaalii Seemantam..oDi ninDE saubhaagyam

సత్యానికి సంకెళ్ళు--1974



















సంగీత::చక్రవర్తి
రచన::శ్రీశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ
ఆసరాగా నాకు దొరికావూ..ఊఊఊఊ
నా ఆశలన్నీ నిజం చేసావూ
నీకూ నీవారు లేరూ..ఊఊఊఊ

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
దారిలోని గడ్డిపువ్వు..నలిగిపోయే వేళ నువ్వు 
మల్లెపువ్వుగ మార్చివేసావూ..ఊఊఊఊ
నీ మనసులోనే దాచివేసావూ
నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ

చరణం::2

రిక్షాకే రెక్కలొచ్చి..నక్షత్ర యాత్ర చేస్తే
రిక్షాకే రెక్కలొచ్చి..క్షత్ర యాత్ర చేస్తే
పక్షులే మన పాట..వింటాయీ..ఈఈఈ 
మబ్బులే పరదాలు..కడతాయీ 
ఈ మబ్బులే పరదాలు..కడతాయీ
నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ

హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
కప్పులేని ఇంటిలోనా..గడపలేని పడక గదిలో
కప్పులేని ఇంటిలోనా గడపలేని..పడక గదిలో
చందమామా తొంగి చూస్తాడూ..అందమంతా ఒలకబోస్తాడూ
తన అందమంతా ఒలకబోస్తాడూ..నీకూ నీవారు లేరూ
నాకూ నా వారు లేరూ
ఆసరాగా నాకు దొరికావూ..ఊఊఊ
నా ఆశలన్నీ నిజం చేసావూ..ఊ
నా ఆశలన్నీ నిజం చేసావూ..ఊ

Tuesday, November 09, 2010

సత్యానికి సంకెళ్ళు--1974


















సంగీత::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ..ఏవంటవ్
అహా అహా ఒహో ఓహో.ఆహా హా..  
నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా
నీకు నీవారు లేరు..నాకు నావారు లేరు
నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా

చరణం::1

చుక్కల్లా చీర కట్టి..సక్కంగా కొప్పు పెట్టి
చుక్కల్లా చీర కట్టి..సక్కంగా కొప్పు పెట్టి
టిక్కు టాకు టాకు టక్కు టిక్కు టిక్కని నడిసెల్తున్నావే
పక్క సూపు సూడనంటావ్ లకనైనా పలకనంటావ్
పక్క సూపు సూడనంటావ్ లకనైనా పలకనంటావ్
చెప్పిపోవే చిన్నదానా ఎక్కడుంటావ్ నువ్వెక్కడుంటావ్  
హా ఆ ఆ..నీకు నీవారు లేరు నాకు నావారు లేరు
నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా

చరణం::2

ఒళ్ళేడా వాడలేదు..పెళ్ళైనా జాడలేదూ
ఒళ్ళేడా వాడలేదు..పెళ్ళైనా జాడలేదూ 
కళ్ళు రెండూ సేపలల్లే తుళ్ళి తుళ్ళి పడుతునై 
కళ్ళు రెండూ సేపలల్లే తుళ్ళి తుళ్ళి పడుతునై 
చేపలాగే జారుకుంటావ్ చిక్కెం వేస్తే చిక్కనంటావ్
హే..చెప్పిపోవే మరదలు పిల్లా ఎప్పుడొస్తావ్ మళ్ళెప్పుడొస్తవ్ 
ఎప్పుడంటావ్ మళ్ళెప్పుడంటవ్..హా హా హా  
నీకు నీవారు లేరు నాకు నావారు లేరు
నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా

సత్యానికి సంకెళ్ళు--1974



















సంగీత::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::S.జానకి
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి

పల్లవి::

ఆఅ ఆఆఆఆఆఆఆఆఆ   
లేని దాన్నీ నేనూ లేదనేది లేని దాన్ని
నాదనేది లేని దాన్నీ లేదనేది లేని దాన్ని నేనూ 
లేని దాన్ని నేనూ నాదనేది లేని దాన్నీ
లేదనేది లేని దాన్ని నేనూ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   

చరణం::1

సందెవేళా అందగాడు..సరసమాడ వచ్చినాడు
సందెవేళా అందగాడు..సరసమాడ వచ్చినాడు
చెక్కిలంతా చిదిమి చిదిమి..అక్కున నన్నదిమి అదిమీ
ఈఈఈఈ..హా..అప్పుడడిగాడూ
ఇంతీ..ఎంతా..హ హ హ హ హ
వయసెంతనీ..వహ్ వహ్ వహ్
లేని దాన్ని..వయసనేదే లేనిదాన్నీ
లేని దాన్ని..వయసనేదే లేనిదాన్నీ నేనూ
లేని దాన్నీ..నేనూ..నాదనేది లేని దాన్నీ
లేదనేది లేని దాన్నినేనూ..లేనిదాన్ని నేనూ

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆకువక్క పంటనొక్కి..అందుకొమ్మని చెంతచేరీ
ఆకువక్క పంటనొక్కి..అందుకొమ్మని చెంతచేరీ
చుట్టుచేయి వేసి నన్ను పట్టబోయి దొరకకుంటే
హహహహా..అప్పుడడిగాడూ 
అది ఎక్కడా..హ హ ఓ హ హ హ
నడుమెక్కడనీ..వహ్ వహ్ వహ్ 
లేని దాన్ని నడుమనెదే లేనిదాన్నీ
లేని దాన్ని నడుమనేదే లేనిదాన్నీ నేనూ

మంచివాడు--1974

























సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::నాగేశ్వరరావు,వాణిశ్రీ,కాంచన,రాజబాబు,రమాప్రభ,హలాం,సత్యనారాయణ,పద్మనాభం.

పల్లవి::

పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు 
ఎందరో నీ లాంటి పాపలు పుట్టి వుంటారు 
అందులో ఎందరమ్మా పండుగలకు నోచుకుంటారు 
వుండి చూచుకుంటారు 
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు

చరణం::1

కన్న వాళ్ళు చేసుకున్న..పూజాఫలమో 
నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో
కన్న వాళ్ళు చేసుకున్న..పూజాఫలమో 
నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో
నూరు పండుగ లీలాగే చేసుకుంటావు 
నూరు పండుగ లీలాగే చేసుకుంటావు 
కొందరేమో పండుగల్లె వచ్చిపోతారు 
నూరేళ్ళు నిండిపోతారు 
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు

చరణం::2

ఉన్నవాళ్ళు లేని వాళ్ళను భేదాలు 
మనకెగాని మట్టిలోన లేవమ్మా
ఉన్నవాళ్ళు లేని వాళ్ళను భేదాలు 
మనకెగాని మట్టిలోన లేవమ్మా
ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు 
మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు 
కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా 
పెట్టి పుట్టిన దానవమ్మా నీవు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు

Monday, November 08, 2010

మంచివాడు--1974














సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::రామారావు
తారాగణం::నాగేశ్వరరావు,వాణిశ్రీ,కాంచన,రాజబాబు,రమాప్రభ,హలాం,సత్యనారాయణ,పద్మనాభం.

పల్లవి::

చూస్తా బాగా చూస్తా..చేయి చూస్తా
చూసి చెబుతా చూస్తా..బాగా చూస్తా 
చేయి చూస్తా..చూసి చెబుతా
ముందు వెనక..యేముందో
యెక్కడుందో యెవరికెవరి..కెంతుందో చూచి చెబుతా
ముందు వెనక..యేముందో
యెక్కడుందో యెవరికెవరి కెంతుందో..చూచి చెబుతా
హేయ్ చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా..చూసి చెబుతా

చరణం::1

కోట్లు కోట్లు గా గడించి..కూడబెట్టకు 
వజ్రాలుగా బంగారుగా..మార్చి దాచకు
కోట్లు కోట్లు గా గడించి..కూడబెట్టకు 
వజ్రాలుగా బంగారుగా..మార్చి దాచకు
రాశి లగ్నమందు నేడు..రాహువున్నాడే  
రాశి లగ్నమందు నేడు..రాహువున్నాడే 
రాత్రి రాత్రి కొచ్చి మొత్తం..మింగిపోతాడు
ఏ ఎన్ ఆర్,ఎన్ టి ఆర్..ఏలుతారన్నాను 
వాణిశ్రీ సావిత్రికి..వారసని చెప్పాను
జగ్గయ్య,జయలలిత..శోభన్ బాబు 
కృష్ణకి పద్మనాభం..రమాప్రభ, రాజబాబుకి
దసరాబుల్లోడికి..ప్రేమనగర్ నాయుడికి 
ఆత్రేయ ఆదుర్తి..మహాదేవనందరికి 
ఆనాడు చెప్పింది..ఈనాడు జరుగుతుంది 
ఈనాడు చెప్పేది..రేపు జరగబోతుంది
చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా..చూసి చెబుతా
ముందు వెనక యేముందో..యెక్కడుందో 
యెవరికెవరి కెంతుందో..చూచి చెబుతా
హేయ్ చూస్తా బాగా చూస్తా..చేయి చూస్తా..చూసి చెబుతా

చరణం::2

వేలు వేలు ఎకరాలకు..గోలుమాలు 
తాతల యెట్టేట్టుకైన..చెప్పాలి టాటాలు
వేలు వేలు ఎకరాలకు..గోలుమాలు 
తాతల యెట్టేట్టుకైన..చెప్పాలి టాటాలు
దిగమింగే నాయకులకు..దిన గండాలు 
దిగమింగే నాయకులకు..దిన గండాలు 
పన్నెగ వేసే పెద్దలకు..వెలక్కాయలు
తాతయ్య పేరులో..మనవళ్ళు పెరిగారు
మనవళ్ళు దోచింది ముని మనవళ్ళడిగారు 
అడుగునున్న వాళ్ళింద అణిగి మణిగి వుండరు
ఆడోళ్ళే ఇక మీదట అందలాన వుంటారు 
మగవాళ్ళ ఆటకట్టి మరమ్మత్తు చేస్తారు 
అందుకే చిట్టి నిర్మల చేతిలో సేటు రాత రాశాడు 
ఓ పండిట్ జీ మేరా హత్ భీ దేఖియేనా..దేకుతా దేకుతా
ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది 
ఏమోలే అనుకుంటే మీ ఖర్మలే పొండి
చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా..చూసి చెబుతా
ముందు వెనక యేముందో..యెక్కడుందో 
యెవరికెవరి కెంతుందో చూచి చెబుతా
హేయ్ చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా..చూసి చెబుతా

మంచివాడు--1974
















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::నాగేశ్వరరావు,వాణిశ్రీ,కాంచన,రాజబాబు,రమాప్రభ,హలాం,సత్యనారాయణ,పద్మనాభం.

పల్లవి::

అబ్బాయే..ఏ..పుట్టాడు 
అచ్చం నాన్నలాగే..ఏ..వున్నాడు 
అబ్బాయే..ఏ..పుట్టాడు
అచ్చం నాన్నలాగే..ఏ..వున్నాడు
నాన్నలాగే..ఏఏఏ..వున్నాడు

చరణం::1

దోబూచులాడు..కళ్ళు ఇంకలేవని 
తీయ తీయన్ని..బంధాలు తీరెననీ
దోబూచులాడు..కళ్ళు ఇంకలేవని 
తీయ తీయన్ని..బంధాలు తీరెననీ
తల్లిగా నను చేసి..తాను తప్పుకున్నాడు 
తల్లిగా నను చేసి..తాను తప్పుకున్నాడు 
ఆ కన్న తండ్రి పోలికతో కడుపుకోసి పోయాడు 
అబ్బాయే పుట్టాడు..అచ్చం నాన్నలాగే వున్నాడు 
అబ్బాయే పుట్టాడు..అచ్చం నాన్నలాగే వున్నాడు 
నాన్నలాగే వున్నాడు

Friday, November 05, 2010

యమకింకరుడు--1982






యమకింకరుడు--1982
సంగీతం::చంద్రశేఖర్ 
రచన::వేటూరి 
గానం::S.జానకి 
నిర్మాత::అల్లు అరవింద్‌
దర్శకత్వం::రాజ్‌ భరత్‌
విడుదల::అక్టోబరు 1982

తారాగణం::చిరంజీవి, శరత్‌ బాబు, రాధిక, జగ్గయ్య, 
సత్య నారాయణ, సుదర్శన్, జయమాలిని, స్మిత, తదితరులు...


తకధీం తనకధీం..తకధీం తనకధీం..
తకధీం తనకధీం..తకధీం తనకధీం..   
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..
హోయ్‌మా..హోయ్‌మా..హోయ్‌మా..వయ్యారం..హ్హ..
హోయ్‌మా..హోయ్‌మా..హోయ్‌మా..వయ్యారం.. 
హోయ్‌మా గియ్‌మా అది యవ్వారం..   
హోయ్‌మా గియ్‌మా అది యవ్వారం.. 
సిగ్గేస్తే సింగారం..వొగ్గేస్తే యాపారం  
అయితే గియితే..సంసారం..
సిగ్గేస్తే సింగారం..వొగ్గేస్తే యాపారం  
అయితే గియితే సంసారం..హేయ్.. 
తకధీం తనకధీం..హే హేయ్..
తకధీం తనకధీం..
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ.. 

చరణం::1

తీసేయ్ ఏ దీపం ఉన్నా..తీసేయ్ నీ తాపాలే
చూసే..వన్నీ..చూసేసై..

తీసేయ్ ఏ దీపం ఉన్నా..తీసేయ్ నీ తాపాలే
చూసే..వన్నీ..చూసేసై..మనకేల మంచి చెడ్డ

మనసంటే..మంచి చెడ్డ..వయసున్న వలలో పడ్డ
వరసేలే రారా బిడ్డ..హా..హోయ్..

తకధీం తనకధీం..ఆ..
తకధీం తనకధీం..ఆఆ.. 
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..
హోయ్‌మా..హోయ్‌మా..హోయ్‌మా..వయ్యారం..
హోయ్‌మా..గియ్‌మా..అది యవ్వారం..హ్హ.. 
హోయ్‌మా..గియ్‌మా..అది యవ్వారం.. 

చరణం::2

తోసేయ్ నీ పాసాలన్నీ కోసేయ్..నీ కష్టలే
వేసేయ్ ఆణ్ణి..ఓడించేయ్..

తోసేయ్ నీ పాసాలన్నీ కోసేయ్..నీ కష్టలే
వేసేయ్ ఆణ్ణి..ఓడించేయ్..

చెరిపేసేయ్..నీతీ న్యాయం..చెరిసేసై వాటి గాయం 
ఒట్టేస్తే రేపే మాయం..కన్నేస్తే నేడే ఖాయం..హోయ్..  

తకధీం తనకధీం..ఆ..
తకధీం తనకధీం..ఆఆ..
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..
హోయ్‌మా..హోయ్‌మా..హోయ్‌మా..వయ్యారం..
హోయ్‌మా గియ్‌మా అది యవ్వారం..    
సిగ్గేస్తే సింగారం..వొగ్గేస్తే యాపారం  
అయితే గియితే..సంసారం..హేయ్..
తకధీం తనకధీం..హే హేయ్..ఆ..
తకధీం తనకధీం..ఆఆ.. 
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..
అఆఅఆఅఆఅఆ ఆఆఆ..అఆఅఆఅఆఅఆ ఆఆఆ..