సంగీత::చక్రవర్తి రచన::శ్రీశ్రీ గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ ఆసరాగా నాకు దొరికావూ..ఊఊఊఊ నా ఆశలన్నీ నిజం చేసావూ నీకూ నీవారు లేరూ..ఊఊఊఊ చరణం::1 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దారిలోని గడ్డిపువ్వు..నలిగిపోయే వేళ నువ్వు మల్లెపువ్వుగ మార్చివేసావూ..ఊఊఊఊ నీ మనసులోనే దాచివేసావూ నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ చరణం::2 రిక్షాకే రెక్కలొచ్చి..నక్షత్ర యాత్ర చేస్తే రిక్షాకే రెక్కలొచ్చి..క్షత్ర యాత్ర చేస్తే పక్షులే మన పాట..వింటాయీ..ఈఈఈ మబ్బులే పరదాలు..కడతాయీ ఈ మబ్బులే పరదాలు..కడతాయీ నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కప్పులేని ఇంటిలోనా..గడపలేని పడక గదిలో కప్పులేని ఇంటిలోనా గడపలేని..పడక గదిలో చందమామా తొంగి చూస్తాడూ..అందమంతా ఒలకబోస్తాడూ తన అందమంతా ఒలకబోస్తాడూ..నీకూ నీవారు లేరూ నాకూ నా వారు లేరూ ఆసరాగా నాకు దొరికావూ..ఊఊఊ నా ఆశలన్నీ నిజం చేసావూ..ఊ నా ఆశలన్నీ నిజం చేసావూ..ఊ
సంగీత::చక్రవర్తి రచన::ఆత్రేయ గానం::S.P.బాలు తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి పల్లవి:: మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ..ఏవంటవ్ అహా అహా ఒహో ఓహో.ఆహా హా.. నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా నీకు నీవారు లేరు..నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా చరణం::1 చుక్కల్లా చీర కట్టి..సక్కంగా కొప్పు పెట్టి చుక్కల్లా చీర కట్టి..సక్కంగా కొప్పు పెట్టి టిక్కు టాకు టాకు టక్కు టిక్కు టిక్కని నడిసెల్తున్నావే పక్క సూపు సూడనంటావ్ లకనైనా పలకనంటావ్ పక్క సూపు సూడనంటావ్ లకనైనా పలకనంటావ్ చెప్పిపోవే చిన్నదానా ఎక్కడుంటావ్ నువ్వెక్కడుంటావ్ హా ఆ ఆ..నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా చరణం::2 ఒళ్ళేడా వాడలేదు..పెళ్ళైనా జాడలేదూ ఒళ్ళేడా వాడలేదు..పెళ్ళైనా జాడలేదూ కళ్ళు రెండూ సేపలల్లే తుళ్ళి తుళ్ళి పడుతునై కళ్ళు రెండూ సేపలల్లే తుళ్ళి తుళ్ళి పడుతునై చేపలాగే జారుకుంటావ్ చిక్కెం వేస్తే చిక్కనంటావ్ హే..చెప్పిపోవే మరదలు పిల్లా ఎప్పుడొస్తావ్ మళ్ళెప్పుడొస్తవ్ ఎప్పుడంటావ్ మళ్ళెప్పుడంటవ్..హా హా హా నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా
సంగీత::చక్రవర్తి రచన::ఆత్రేయ గానం::S.జానకి తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి పల్లవి:: ఆఅ ఆఆఆఆఆఆఆఆఆ లేని దాన్నీ నేనూ లేదనేది లేని దాన్ని నాదనేది లేని దాన్నీ లేదనేది లేని దాన్ని నేనూ లేని దాన్ని నేనూ నాదనేది లేని దాన్నీ లేదనేది లేని దాన్ని నేనూ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చరణం::1 సందెవేళా అందగాడు..సరసమాడ వచ్చినాడు సందెవేళా అందగాడు..సరసమాడ వచ్చినాడు చెక్కిలంతా చిదిమి చిదిమి..అక్కున నన్నదిమి అదిమీ ఈఈఈఈ..హా..అప్పుడడిగాడూ ఇంతీ..ఎంతా..హ హ హ హ హ వయసెంతనీ..వహ్ వహ్ వహ్ లేని దాన్ని..వయసనేదే లేనిదాన్నీ లేని దాన్ని..వయసనేదే లేనిదాన్నీ నేనూ లేని దాన్నీ..నేనూ..నాదనేది లేని దాన్నీ లేదనేది లేని దాన్నినేనూ..లేనిదాన్ని నేనూ చరణం::2
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆకువక్క పంటనొక్కి..అందుకొమ్మని చెంతచేరీ ఆకువక్క పంటనొక్కి..అందుకొమ్మని చెంతచేరీ చుట్టుచేయి వేసి నన్ను పట్టబోయి దొరకకుంటే హహహహా..అప్పుడడిగాడూ అది ఎక్కడా..హ హ ఓ హ హ హ నడుమెక్కడనీ..వహ్ వహ్ వహ్ లేని దాన్ని నడుమనెదే లేనిదాన్నీ లేని దాన్ని నడుమనేదే లేనిదాన్నీ నేనూ