సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::నాగేశ్వరరావు,వాణిశ్రీ,కాంచన,రాజబాబు,రమాప్రభ,హలాం,సత్యనారాయణ,పద్మనాభం.
పల్లవి::
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
ఎందరో నీ లాంటి పాపలు పుట్టి వుంటారు
అందులో ఎందరమ్మా పండుగలకు నోచుకుంటారు
వుండి చూచుకుంటారు
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
చరణం::1
కన్న వాళ్ళు చేసుకున్న..పూజాఫలమో
నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో
కన్న వాళ్ళు చేసుకున్న..పూజాఫలమో
నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో
నూరు పండుగ లీలాగే చేసుకుంటావు
నూరు పండుగ లీలాగే చేసుకుంటావు
కొందరేమో పండుగల్లె వచ్చిపోతారు
నూరేళ్ళు నిండిపోతారు
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
చరణం::2
ఉన్నవాళ్ళు లేని వాళ్ళను భేదాలు
మనకెగాని మట్టిలోన లేవమ్మా
ఉన్నవాళ్ళు లేని వాళ్ళను భేదాలు
మనకెగాని మట్టిలోన లేవమ్మా
ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు
మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు
కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా
పెట్టి పుట్టిన దానవమ్మా నీవు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు
నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
No comments:
Post a Comment