Sunday, November 14, 2010

పూల రంగడు--1967




















సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల, P. సుశీల

పల్లవి::

నీ నడుముపైన చేయి వేసి నడువనీ
నన్ను నడువనీ
నీ చేతుల చెరసాలలోన
చేరని..నన్ను చేరనీ

నీ జిలుగుపైట నీడలోన నిలువనీ
నన్ను నిలువనీ
నీ అడుగులోన అడుగువేసి నడువనీ 
నన్ను నడువని

చరణం::1

చిక్కని బుగ్గలపై చిటికెలు వేయనీ
సన్నని నవ్వులలో సంపెంగలేరని
గులాబి పెదవులనే..అలా అలా చూడనీ

నీ జిలుగుపైట నీడలోన నిలువని..నన్ను నిలువనీ
నీ అడుగులోన అడుగులేసి నడువని..నన్ను నడువనీ

చరణం::2
పచ్చిగ తిన్నెలలో వెచ్చగ సాగనీ
వెచ్చని వెన్నెలలో ముచ్చటలాడని
ముచ్చటలాడి ఆడి మురిసి మురిసి పాడని

నీ జిలుగుపైట నీడలోన నిలువని..నన్ను నిలువని
నీ అడుగులోన అడుగు వేసి నడువని..నన్ను నడువని

చరణం::3
మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
ఆ..ఆ...ఆ...ఆ..ఆ...

మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
బంగారు కోవెలలో కొంగులు ముడివేయనీ
బంగారు కోవెలలో కొంగులు ముడివేయనీ


Poola Rangadu--1967
Music::S.Rajeswara Rao
Lyricis::C. Narayana Reddy
Singer's::Ghantasala, P.Susheela

Nee nadumu paina cheyi vesi naduvanee
Nannu naduvanee
Nee chetula cherasalalona cheranee
Nannu cheranee

Nee jilugu paita needalona niluvanee
Nannu niluvanee
Nee adugulona adugu vesi naduvanee
Nannu naduvanee

Chikkani buggalapai chitikelu veyanee
Sannani navvulalo sampengaleranee
Gulabi pedavulane ala ala chudanee..

Pachika tinnelalo vechaga kaaganee
Vechani vennelalo muchatalaadanee
Muchatalaadi aadi murisi murisi paadanee.

Mabbula vadalo manasulu kudanee
Mallela medalo mamatalu pandanee
Mabbula vadalo manasulu kudanee
Mallela medalo mamatalu pandanee
Bangaaru kovelalo kongulu mudi veyanee 

Bangaaru kovelalo kongulu mudi veyanee 

No comments: