Monday, October 18, 2010

భక్త తుకారాం--1973


























సంగీత::P.ఆదినారాయణరావు
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::A.N.R.శివాజీ గణేషన్,అంజలిదేవి,కాంచన,నాగభూషణం,ధూళిపాళ,సాక్షి రంగారావు.
బేబి శ్రీదేవి

పల్లవి::

కలియుగం కలియుగం కలియుగం కలియుగం 
కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు..అడుగడుగున సంకటం 
కలియుగం కలియుగం..కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు..అడుగడుగున సంకటం 
హరేరామ హరేరామ..రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే
హరేరామ హరేరామ..రామరామ హరేహరే

కూడుగుడ్డలేని వాళ్ళు అవుతారా భక్తులు..అవుతారా భక్తులు 
కోవెలలో దేవుడెలా వుంటాడు పస్తులు..వుంటాడు పస్తులు
ఉన్నవారు యివ్వాలి కానుకలు..యివ్వాలి కానుకలు
ఊరికి ఉపకారం చెయ్యలి ఉత్తములు..మాలాంటి ఉత్తములు 
కలియుగం కలియుగం..కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు..అడుగడుగున సంకటం 
హరేరామ హరేరామ..రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే
హరేరామ హరేరామ..రామరామ హరేహరే

కాంతా కనకాలెకదా పాపాలకు మూలము..పాపాలకు మూలము
ఆ రెండూ మాకు వదలి చేసుకోండి పుణ్యము..చేసుకోండి పుణ్యము
శివుడు మింగే హలాహలం జగతికోసము 
మీరిచ్చేదంత మింగుతాము మీకోసము
క్రిందనున్న వారినెల్ల పైకితెచ్చి..కిటుకుచెప్పి 
చూపుతాము స్వర్గము..చూపుతాము స్వర్గము
కలియుగం కలియుగం..కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు..అడుగడుగున సంకటం 
హరేరామ హరేరామ..రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే
హరేరామ హరేరామ..రామరామ హరేహరే

Sunday, October 17, 2010

దేశోద్ధారకులు--1973





















సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం,పద్మనాభం,అల్లురామలింగయ్య,శుభ,

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
This is nineteen seventy two..ou ou ou
I am twenty two minus two
I can’t stop loving you..uuu
And I am happy to dance with you
happy to dance with you..uuuuu 

మిస్ మిస్ రాధదేవీ..ఇక్కడ మీ తెలుగు సంప్రదాయం ఉండుననీ
మాచేత ఈ తెలుగు దుస్తులు ధరింపజేసి తీసుకొని వచ్చినావు
ఇదేనా మీ సంప్రదాయం?  ఇదేనా మీ సంస్కృతీ? 

కాదు ముమ్మాటికీ కాదు!

పల్లవి::

ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ
ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ

చరణం::1

ఉయ్యాలలూగే వయసులో..సయ్యాటలాడే మనసులో
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ 
ఉయ్యాలలూగే వయసులో..సయ్యాటలాడే మనసులో  
వెచ్చని తలపులు..తొందరపడినా
పచ్చని పందిటి..పిలుపు కోసము
మంచున తడిసిన..మల్లెపువ్వులా
వేచి యుండుటే వేడుక..ఒక కన్నెకు ఒకే కోరిక
అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ

చరణం::2

కుల సతిగా పతి నారాధించి..తొలి నోముల పంటలె పండించీ
కుల సతిగా పతి నారాధించి..తొలి నోముల పంటలె పండించీ
అతడుండే కారడవే నందనవనిగా..భావించీ
అతడుండే కారడవే నందనవనిగా..భావించీ
పతి దేవుని అనుసరించుటే..సతీమ తల్లికి పరమార్థం 
ఒక సీతకు..ఒకే రాముడు
అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ

చరణం::3

ఇల్లాలుగా ఇంటికి వెలుగై..కన్నతల్లిగ పాపల పెంచీ
ఇల్లాలుగా ఇంటికి వెలుగై..కన్నతల్లిగ పాపల పెంచీ
సత్యం ధర్మం శౌర్య గుణం..సత్యం ధర్మం శౌర్య గుణం 
నిత్య సూక్తులుగ భోధించి..జాతి రక్షణకు చిరంజీవులను
తీర్చి దిద్దుటే ఆశయం..ఒక తల్లికి ఒకే ఆశయం 
అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ
ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ

దేశోద్ధారకులు--1973





























సంగీత::K.V.మహదేవన్
రచన::శ్రీశ్రీ
గానం::S.జానకి
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం,పద్మనాభం,అల్లురామలింగయ్య,శుభ,

పల్లవి::

మడీ మడీ శుచీ శుచీ..ఈ ఈ ఈ..అది నిన్నటి మాటా 
మడీ మడీ శుచీ శుచీ..అది నిన్నటి మాటా 
తడీ తడీ రుచీ రుచీ..ఇదే నేటి మాట..ఆ
            
మడీ మడీ శుచీ శుచీ..అది నిన్నటి మాటా 
తడీ తడీ రుచీ రుచీ..ఇదే నేటి మాట.ఆ            
మడీ మడీ శుచీ శుచీ..అది నిన్నటి మాటా..ఆఆఆఆ  

చరణం::1

నిన్న రాదు రేపు లేదు..నేడే నీది తెలుసుకో..ఓఓఓఓఓఓ 
నిన్న రాదు రేపు లేదు..నేడే నీది తెలుసుకో 
ఈ క్షణమే ఈ సుఖమే..శాశ్వతమని తలచుకో..ఓఓ 
నిన్న రాదు రేపు లేదు..నేడే నీది తెలుసుకో 
ఈ క్షణమే ఈ సుఖమే..శాశ్వతమని తలచుకో..ఓఓ 
ఆఆఅ..ఎండు బ్రతుకు దండుగా..ఆఆఆఅ 
నిండు బ్రతుకు పండుగా..ఆఆఆ 
మడీ మడీ..ఆఆ..శుచీ శుచీ..అది నిన్నటి మాటా 
తడీ తడీ రుచీ రుచీ..ఇదే నేటి మాట            
మడీ మడీ శుచీ శుచీ..అది నిన్నటి మాటా..ఆఆఅ  

చరణం::2

వయసు వలపు కలిమి చెలిమి..వర్తకమని తెలుసుకో..ఓఓఓఓఓ 
వయసు వలపు కలిమి చెలిమి..వర్తకమని తెలుసుకో 
ఒడుపు తెలిసి జడుపు విడిచి..బ్రతుకు తెరుపు నేర్చుకో..ఓఓ
వయసు వలపు కలిమి చెలిమి..వర్తకమని తెలుసుకో 
ఒడుపు తెలిసి జడుపు విడిచి..బ్రతుకు తెరుపు నేర్చుకో..ఓఓ 
ఈ వేళ వృదా చేయకురా..ఆఆఆఆఆ
ఈ సిరి నీదరి చేరునురా..ఆఆఆఆఆఆ  
మడీ మడీ..హాహా..మడీ మడీ శుచీ శుచీ..అది నిన్నటి మాటా 
తడీ తడీ రుచీ రుచీ..ఇదే నేటి మాట            
మడీ మడీ శుచీ శుచీ..అది నిన్నటి మాటా..ఆఆఆ  

దేశోద్ధారకులు--1973




















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం: N.T.రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం.శుభ.

పల్లవి::

మ్మ్ హు మ్మ్ హు.ఓహో ఓహోహో..ఆ ఆ ఆ ఆ 
ఆహా..ఆహా..ఆ ఆహా  

మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుందీ 
మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుందీ

మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుందీ 
మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుందీ 
మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుందీ 

చరణం::1

మూడుముళ్ళూ పడతాయంటే..సిగ్గే మొగ్గలు వేస్తుందీ
మూడుముళ్ళూ పడతాయంటే..సిగ్గే మొగ్గలు వేస్తుందీ
అ మొగ్గలు పూచీ మూడు రాత్రులు..తీయని ముద్రలు వేస్తాయి 
అ మొగ్గలు పూచీ మూడు రాత్రులు..తీయని ముద్రలు వేస్తాయి 
కన్నులు నాలుగు కలిశాయంటే..పున్నమి వెన్నెల కాస్తుందీ 
అ వెన్నెల నాలుగు వారాలైనా..తరగని వెలుగై వుంటుందీ  

మబ్బులు రెండు భేటి అయితే..మెరుపే వస్తుందీ 
మనసులు రెండు పేచీ పడితే..వలపే పుడుతుందీ 
మబ్బులు రెండు భేటి అయితే..మెరుపే వస్తుందీ 

చరణం::2

అయిదో తనమే అడజన్మకు..అన్ని వరాలను మించిందీ..ఈ 
అయిదో తనమే అడజన్మకు..అన్ని వరాలను మించిందీ 
అ వరాన్ని తెచ్చిన మగువే మగనికి..అరో ప్రాణం అవుతుందీ 
అ వరాన్ని తెచ్చిన మగువే మగనికి..అరో ప్రాణం అవుతుందీ 
అడుగులు ఏడూ నడిచామంటే..అనుబందం పెనవేస్తుందీ 
అ అనుబంధం ఏడేడుజన్మలకు..వీడనిబంధం అవుతుందీ 

మబ్బులు రెండు భేటి అయితే..మెరుపే వస్తుందీ 
మనసులు రెండు పేచీ పడితే..వలపే పుడుతుందీ 
మబ్బులు రెండు భేటి అయితే..మెరుపే వస్తుందీ 
అహహాహా అహహాహా అహహాహా అహహాహా అహహాహా 

Deshodharakulu--1973
Music::K.V.Mahadevan
Lyrics::Atreya
Singer's::Ghantasala,P.Suseela
Cast::N.T.R. , Vanisree,Savitri,Nagabhushanam,Padmnabham,Subha.
::::

Mabbulu rendu bheti ayithe..merupe vasthundee 
Manasulu rendu pechee padithe valape puduthundee 
Mabbulu rendu bheti ayithe merupe vasthundee 
Manasulu rendu pechee padithe valape puduthundee 
Mabbulu rendu bheti ayithe merupe vasthundee 

::::1

Moodu mullu padataayante sigge moggalu vestundee
Moodu mullu padataayante sigge moggalu vestundee
A moggalu poochee moodu raatrulu teeyani mudralu vestaayi 
A moggalu poochee moodu raatrulu teeyani mudralu vestaayii 
Kannulu naalugu kalisaayante punnami vennela kaastundee 
A vennela naalugu vaaraalainaa taragani velugai vuntundee 

Mabbulu rendu bheti ayite merupe vastundee 
Manasulu rendu pechee padite valape pudutundee 
Mabbulu rendu bheti ayite merupe vastundee 

::::2

Ayido taname adajanmaku anni varaalanu minchindee 
Ayido taname adajanmaku anni varaalanu minchindee 
A varaanni techchina maguve maganiki aro praanam avutundee 
A varaanni techchina maguve maganiki aro praanam avutundee 
Adugulu Edoo nadichaamante anubandam penavestundee 
A anubandham Ededujanmalaku veedani bandham avutundee 

Mabbulu rendu bheti ayite merupe vastundee 
Manasulu rendu pechee padite valape pudutundee 
Mabbulu rendu bheti ayite merupe vastundee 
Ahahaahaa ahahaahaa ahahaahaa ahahaahaa 

Saturday, October 16, 2010

దేశోద్ధారకులు--1973






















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి
తారాగణం: N.T.రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం

పల్లవి::

ఆ ఆ ఆ ఆ హా..ఆ ఆ ఆ ఓహో
ఏదో తాపం..ఒకటే మైకం
ఇంత అందం..ఏం చేసుకుంటానురా
ఇన్ని సొంపులు..ఎలా దాచుకుంటానురా     
ఇంత అందం..ఏం చేసుకుంటానురా
ఇన్ని సొంపులు..ఎలా దాచుకుంటానురా     
ఏదో తాపం..హా..ఒకటే మైకం

చరణం::1

ఒళ్ళు విరుపు ఆవులింత..తెలుసుకోరా ఎందుకో
ఉలికిబాటు మిడిసిపాటు వద్దురా..నన్నందుకో 
ఆహా..ఒళ్ళు విరుపు ఆవులింత..తెలుసుకోరా ఎందుకో
ఉలికిబాటు మిడిసిపాటు వద్దురా..నన్నందుకో 
ఏదో తాపం..అహ్హా..ఒకటే మైకం

చరణం::2

మొన్న రాతిరి యింతమందిలో..మోమాట పడితివి పాపము
నిన్న రాతిరి నేను నవ్వితే..నీకు పెరిగెను కోపము
మొన్న రాతిరి యింతమందిలో..మోమాట పడితివి పాపము
నిన్న రాతిరి నేను నవ్వితే..నీకు పెరిగెను కోపము
మంచుగదిలో ఒంటికింత కాక ఎందుకు..చెప్పరా
మంచుగదిలో ఒంటికింత కాక ఎందుకు..చెప్పరా 
హ్హా..లంచమిస్తా మమతలన్నీ మనసు నాతో..విప్పరా 
అబ్భా..ఏదో తాపం..ఒకటే మైకం
ఇంత అందం..ఏం చేసుకుంటానురా..ఆ
ఇన్ని సొంపులు..ఎలా దాచుకుంటానురా     
ఏదో తాపం..మ్మ్..హు..ఒకటే మైకం
హ్హా హ్హా హ్హా హ్హా హ్హా 

Wednesday, October 13, 2010

శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం--1972





























సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు, కాంతారావు, S.V.రంగారావు,రాజనాల,వాణిశ్రీ

పల్లవి::

ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ
ఏక పత్నీ వ్రతుడు..మా..ఆ..రామచంద్రుడే 

రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా  
   
చరణం::1

కైక కిచ్చిన మాటకోసమై..కట్టుపడెను ఆ దశరధుడు
తండ్రిచేసిన బాసకోసమై..తరలె కానలకు రాఘవుడు  
పౌరులెంత విలపించినా..ప్రకృతికూడ శోకించినా   
భరతుడెంత ప్రార్థించినా..తిరిగిరాననె రాముడు  
ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ 
ఆదర్శము ఒకే మాట అదే మా రాముని రాచబాట  

రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా  

చరణం::2

దశకంఠుడు సీతమ్మ నెత్తుకొని మింటికేగిరిపోగా 
వానిని ప్రతిఘటించిన జటాయువు పాపం
ఢరణి నొదిగిపోగా ఆ పక్షికి మోక్షం ప్రసాదించి
వానరకోటిని సమీకరించి సమభావనకే పాదులువేసె శౌర్య ధర్మనిధి దాశరధి  
ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ
జీవులందరిది ఒకే జాతి..అదే రాముని ఆదర్శ నీతి 

రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా  

చరణం::3

సీతమ్మ చెర విడిపించుటకై సేతు బంధనము గావించీ
శరణుకోరిన విభీషణునిపై కరుణా మృతమును కురిపించీ
సురులు మునులు వినుతింపగ లంకేశ్వరుని ద్రుంచి యిల రక్షించీ
అగ్ని పునీతను సీతను పరిగ్రహించె శ్రీరాముడు  
ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ
ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని..అదే మా రాముని ఆదర్శం

రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా  
రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా 
రామ రామ రామ సీతారామా రఘురామా 
దశరధ నందన దానవ భంజన జయజయ శ్రీరామా  
జయ జయ శ్రీరామా జయ జయ శ్రీరామా జయ జయ శ్రీరామా

శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం--1972


















సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు, కాంతారావు, S.V.రంగారావు,రాజనాల,వాణిశ్రీ

పల్లవి::

రామా..ఆ ఆ ఆ ఆ
రఘురామా..ఆ ఆ ఆ   
ఎన్నాళ్ళు వేచేను..ఓ రామా 
నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా 
నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా 

ఎన్నాళ్ళు వేచేను..ఓ రామా 
నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా 
నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా 

చరణం::1

నీ అండ నేచేర రాలేను..రామా 
నా కొండకే నీవు రావయ్య..రామా 
ఏ జన్మకైనా..నా జపము నా తపము
నీవే..నీవే..రఘురామా 
జగధభి రామా..జానకి రామా
జయరామా..శ్రీరామా 

ఎన్నాళ్లు వేచేను..ఓ రామా
నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా

చరణం::2

సీతమ్మ సేమం..తెలిపానే
నీ తమ్ముని ప్రాణం..నిలిపానే 
సీతమ్మ సేమం..తెలిపానే
నీ తమ్ముని ప్రాణం..నిలిపానే 
మహిరావణుని..గుట్టు చెప్పానే
నిన్ను మూపున..ఇడుకొని మోశానే 
ఇంతగ కొలిచిన..నీ పదదాసుని
ఇంతగ కొలిచిన..నీ పదదాసుని 
ఎటుల మరచితివయ్యా..రామయ్యా 

ఎన్నాళ్లు వేచేను..ఓ రామా
నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా

శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం--1972

























సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P. సుశీల
తారాగణం::N.T.రామారావు, కాంతారావు, S.V.రంగారావు,రాజనాల,వాణిశ్రీ

పల్లవి::

నీవైన చెప్పవే..ఓ మురళీ
ఇక నీవైన చెప్పవే ప్రియమురళీ..ఈ
నీవైన చెప్పవే..ఓ మురళీ 
అడుగడుగున నా ప్రియభామినికి
అలుక ఎందుకని..ఎందుకని
నీవైన చెప్పవే..ఓ మురళీ 

నీవైన చెప్పవే..జాబిలీ
ఇక నీవైన చెప్పవే..ఓ జాబిలీ..ఈ
నీవైన చెప్పవే..జాబిలీ..ఈ
తలబంతి యెవరో..పదదాసి యెవరో
తెలుసుకొమ్మనీ..పిదప రమ్మనీ
నీవైన చెప్పవే..జాబిలీ..ఈ

చరణం::1

అలుకలోన నా చెలియ..వదనము
అరుణ కమలమై..విరిసెననీ..ఈఈ 
అలుకలోన నా చెలియ..వదనము
అరుణ కమలమై..విరిసెననీ
ఆ కమలములోని..తేనియలానగ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ 
కమలములోని..తేనియలానగ 
నామది భ్రమరమై..ఎగసెననీ
నీవైన చెప్పవే..ఓ మురళీ 

చరణం::2

కోటిపూలతో కులుకు..తుమ్మెదకు
ఈ తోటలో..చొటు లేదనీ..ఈఈ
కోటిపూలతో కులుకు..తుమ్మెదకు
ఈ తోటలో..చొటు లేదనీ 
మనసెరిగిన సత్యా..విధేయునికే
ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆ  
మనసెరిగిన సత్యా..విధేయునికే 
అనురాగ మధువు..అందుననీ
నీవైన చెప్పవే..జాబిలీ
ఇక నీవైన చెప్పవే..ఓ జాబిలీ
నీవైన చెప్పవే..జాబిలీ

శ్రీమంతుడు--1971


















నిర్మాత::G రాధాకృష్ణమూర్తి
దర్శకత్వం::K. ప్రత్యగాత్మ
సంగీతం::T.చలపతిరావ్
రచన::దాశరధి
గానం::జిక్కి,P.సుశీల బృందం
తారాగణం::అక్కినేని, జమున,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు

చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు 
చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు 
బుల్లి బుల్లి రాధకు..ముద్దు ముద్దు రాజుకు
బుల్లి బుల్లి రాధకు..ముద్దు ముద్దు రాజుకు
పెళ్ళండీ..పెళ్ళీ..ముచ్చటైన పెళ్ళి బహుముచ్చటైన పెళ్ళి

చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు 
చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు

చరణం::1

కొంగులు ముడివేసి..కోర్కెలు పెనవేసి
బుగ్గలపై సిగ్గుతో..కన్నులలో వలపుతో
అడుగులలో అడుగులతో..నడచిపోవు బొమ్మలు

చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు 
చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు

చరణం::2

మెరసిపోవు తాళితో..మెడలో పూమాలతో
మేళాలూ..తాళాలు..సన్నాయీ..బాజాలు

రాజు వెంట రాణి..కాళ్ళకు పారాణి
రాజు వెంట రాణి..కాళ్ళకు పారాణి
చేయి చేయి కలుపుకొని..చిందులేయు బొమ్మలు
చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు 
చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు

చరణం::3

పూలపల్లకీలో..ఊరేగె వేళలో
కోయిలమ్మ పాటతో..చిలకమ్మల ఆటతో
అంతులేని ఆశలతో..గంతులేయు బొమ్మలు

చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు 
చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు 
బుల్లి బుల్లి రాధకు..ముద్దు ముద్దు రాజుకు
బుల్లి బుల్లి రాధకు..ముద్దు ముద్దు రాజుకు
పెళ్ళండీ..పెళ్ళీ..ముచ్చటైన పెళ్ళి బహుముచ్చటైన పెళ్ళి

Sreemantudu--1971
Producer::G raadhaakRshNamoorti
Director::Kotayya Pratyagatma 
Music::T.chalapatiraav^
Lyrics::daaSaradhi
Singer's::Jikki,P.Suseela & Brundam
Taaraaganam::Akkinaeni, Jamuna,GummaDi,Sooryakaantam,RaajaBaabu

chittipotti bommalu..chinnaari bommalu 
chittipotti bommalu..chinnaari bommalu 
bulli bulli raadhaku..muddu muddu raajuku
bulli bulli raadhaku..muddu muddu raajuku
pellandee..pellee..muchchataina pelli bahumuchchataina pelli

chittipotti bommalu..chinnaari bommalu 
chittipotti bommalu..chinnaari bommalu 

:::::1

kongulu mudivesi..kOrkelu penavesi
buggalapai siggutO..kannulalO valaputO
adugulalO adugulatO..nadachipOvu bommalu

chittipotti bommalu..chinnaari bommalu 
chittipotti bommalu..chinnaari bommalu 

::::2

merasipOvu taalitO..medalO poomaalatO
melaaloo..taalaalu..sannaayee..baajaalu

raaju venta raani..kaallaku paaraani
raaju venta raani..kaallaku paaraani
cheyi cheyi kalupukoni..chinduleyu bommalu

chittipotti bommalu..chinnaari bommalu 
chittipotti bommalu..chinnaari bommalu 

::::3

poolapallakeelo..oorege velalo
koyilamma paatatO..chilakammala aatatO
antuleni aaSalatO..gantuleyu bommalu

chittipotti bommalu..chinnaari bommalu 
chittipotti bommalu..chinnaari bommalu  
bulli bulli raadhaku..muddu muddu raajuku
bulli bulli raadhaku..muddu muddu raajuku

pellandee..pellee..muchchataina pelli bahumuchchataina pelli


శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం--1972



















సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి,B.వసంత,సుమిత్ర 
తారాగణం::N.T. రామారావు, కాంతారావు, S.V. రంగారావు,రాజనాల,వాణిశ్రీ

పల్లవి::

హోయ్..చక్కాని గోపాల కృష్ణుడమ్మా..ముద్దుకృష్ణుడమ్మా
ముద్దుకృష్ణుడమ్మా 
చిక్కాని నంద కుమారుడమ్మా..వేణులోలుడమ్మా 
వేణులోలుడమ్మా  
హోయ్..చక్కాని గోపాల కృష్ణుడమ్మా..ముద్దుకృష్ణుడమ్మా  
చిక్కాని నంద కుమారుడమ్మా..వేణులోలుడమ్మా  

చరణం::1

దేవకి కడుపున పుట్టాడమ్మా..యశోద యింటను పెరిగాడమ్మా
కాళీయునీ తలపైనెక్కి తకధిం ధిమ్మని ఆడెనమ్మా..తకధిం ధిమ్మని ఆడెనమ్మా 

చక్కాని గోపాల కృష్ణుడమ్మా..ముద్దుకృష్ణుడమ్మా  
చిక్కాని నంద కుమారుడమ్మా..వేణులోలుడమ్మా  
హోయ్..చక్కాని గోపాల కృష్ణుడమ్మా..ముద్దుకృష్ణుడమ్మా 
చిక్కాని నంద కుమారుడమ్మా..వేణులోలుడమ్మా  

చరణం::2

మధురా నగరిలో చల్ల లమ్మబోదు దారి విడుము..కృష్ణా..కృష్ణా..ఆఆఆఆ 
మధురా నగరిలో చల్ల లమ్మబోదు దారి విడుము..కృష్ణా..కృష్ణా..ఆఆఆఆ  
నీపై మోహము ఓపగలేనే..నీపై మోహము ఓపగలేనే  
నీవ తరుపుకడ నిలువవే భామా..నిలువవే ఓ భామా 

మాపటి వేళకు తప్పక వచ్చెద..మా..ఆ..పటి వేళకు తప్పక వచ్చెద 
పట్టకురా కొంగు గట్టిగాను..కృష్ణా..పట్టకురా కొంగు గట్టిగాను..కృష్ణా        
సాకులు చూపి చల్లగజారగ..సాకులు చూపి చల్లగజారగ 
సమ్మతింపనే ఓ భామా..నే సమ్మతింపనే..ఏ..ఓ భామా 

దేవుడు ఒక్కడే భక్తులు ఎందరో..ఆ భావనలోనే కైవల్యముందిలే