సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి,B.వసంత,సుమిత్ర
తారాగణం::N.T. రామారావు, కాంతారావు, S.V. రంగారావు,రాజనాల,వాణిశ్రీ
పల్లవి::
హోయ్..చక్కాని గోపాల కృష్ణుడమ్మా..ముద్దుకృష్ణుడమ్మా
ముద్దుకృష్ణుడమ్మా
చిక్కాని నంద కుమారుడమ్మా..వేణులోలుడమ్మా
వేణులోలుడమ్మా
హోయ్..చక్కాని గోపాల కృష్ణుడమ్మా..ముద్దుకృష్ణుడమ్మా
చిక్కాని నంద కుమారుడమ్మా..వేణులోలుడమ్మా
చరణం::1
దేవకి కడుపున పుట్టాడమ్మా..యశోద యింటను పెరిగాడమ్మా
కాళీయునీ తలపైనెక్కి తకధిం ధిమ్మని ఆడెనమ్మా..తకధిం ధిమ్మని ఆడెనమ్మా
చక్కాని గోపాల కృష్ణుడమ్మా..ముద్దుకృష్ణుడమ్మా
చిక్కాని నంద కుమారుడమ్మా..వేణులోలుడమ్మా
హోయ్..చక్కాని గోపాల కృష్ణుడమ్మా..ముద్దుకృష్ణుడమ్మా
చిక్కాని నంద కుమారుడమ్మా..వేణులోలుడమ్మా
చరణం::2
మధురా నగరిలో చల్ల లమ్మబోదు దారి విడుము..కృష్ణా..కృష్ణా..ఆఆఆఆ
మధురా నగరిలో చల్ల లమ్మబోదు దారి విడుము..కృష్ణా..కృష్ణా..ఆఆఆఆ
నీపై మోహము ఓపగలేనే..నీపై మోహము ఓపగలేనే
నీవ తరుపుకడ నిలువవే భామా..నిలువవే ఓ భామా
మాపటి వేళకు తప్పక వచ్చెద..మా..ఆ..పటి వేళకు తప్పక వచ్చెద
పట్టకురా కొంగు గట్టిగాను..కృష్ణా..పట్టకురా కొంగు గట్టిగాను..కృష్ణా
సాకులు చూపి చల్లగజారగ..సాకులు చూపి చల్లగజారగ
సమ్మతింపనే ఓ భామా..నే సమ్మతింపనే..ఏ..ఓ భామా
దేవుడు ఒక్కడే భక్తులు ఎందరో..ఆ భావనలోనే కైవల్యముందిలే
No comments:
Post a Comment