Wednesday, October 13, 2010

శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం--1972





























సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు, కాంతారావు, S.V.రంగారావు,రాజనాల,వాణిశ్రీ

పల్లవి::

ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ
ఏక పత్నీ వ్రతుడు..మా..ఆ..రామచంద్రుడే 

రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా  
   
చరణం::1

కైక కిచ్చిన మాటకోసమై..కట్టుపడెను ఆ దశరధుడు
తండ్రిచేసిన బాసకోసమై..తరలె కానలకు రాఘవుడు  
పౌరులెంత విలపించినా..ప్రకృతికూడ శోకించినా   
భరతుడెంత ప్రార్థించినా..తిరిగిరాననె రాముడు  
ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ 
ఆదర్శము ఒకే మాట అదే మా రాముని రాచబాట  

రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా  

చరణం::2

దశకంఠుడు సీతమ్మ నెత్తుకొని మింటికేగిరిపోగా 
వానిని ప్రతిఘటించిన జటాయువు పాపం
ఢరణి నొదిగిపోగా ఆ పక్షికి మోక్షం ప్రసాదించి
వానరకోటిని సమీకరించి సమభావనకే పాదులువేసె శౌర్య ధర్మనిధి దాశరధి  
ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ
జీవులందరిది ఒకే జాతి..అదే రాముని ఆదర్శ నీతి 

రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా  

చరణం::3

సీతమ్మ చెర విడిపించుటకై సేతు బంధనము గావించీ
శరణుకోరిన విభీషణునిపై కరుణా మృతమును కురిపించీ
సురులు మునులు వినుతింపగ లంకేశ్వరుని ద్రుంచి యిల రక్షించీ
అగ్ని పునీతను సీతను పరిగ్రహించె శ్రీరాముడు  
ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ
ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని..అదే మా రాముని ఆదర్శం

రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా  
రామ రామ రామ సీతా..రామా రఘురామా  
దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా 
రామ రామ రామ సీతారామా రఘురామా 
దశరధ నందన దానవ భంజన జయజయ శ్రీరామా  
జయ జయ శ్రీరామా జయ జయ శ్రీరామా జయ జయ శ్రీరామా

No comments: