సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P. సుశీల
తారాగణం::N.T.రామారావు, కాంతారావు, S.V.రంగారావు,రాజనాల,వాణిశ్రీ
పల్లవి::
నీవైన చెప్పవే..ఓ మురళీ
ఇక నీవైన చెప్పవే ప్రియమురళీ..ఈ
నీవైన చెప్పవే..ఓ మురళీ
అడుగడుగున నా ప్రియభామినికి
అలుక ఎందుకని..ఎందుకని
నీవైన చెప్పవే..ఓ మురళీ
నీవైన చెప్పవే..జాబిలీ
ఇక నీవైన చెప్పవే..ఓ జాబిలీ..ఈ
నీవైన చెప్పవే..జాబిలీ..ఈ
తలబంతి యెవరో..పదదాసి యెవరో
తెలుసుకొమ్మనీ..పిదప రమ్మనీ
నీవైన చెప్పవే..జాబిలీ..ఈ
చరణం::1
అలుకలోన నా చెలియ..వదనము
అరుణ కమలమై..విరిసెననీ..ఈఈ
అలుకలోన నా చెలియ..వదనము
అరుణ కమలమై..విరిసెననీ
ఆ కమలములోని..తేనియలానగ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
కమలములోని..తేనియలానగ
నామది భ్రమరమై..ఎగసెననీ
నీవైన చెప్పవే..ఓ మురళీ
చరణం::2
కోటిపూలతో కులుకు..తుమ్మెదకు
ఈ తోటలో..చొటు లేదనీ..ఈఈ
కోటిపూలతో కులుకు..తుమ్మెదకు
ఈ తోటలో..చొటు లేదనీ
మనసెరిగిన సత్యా..విధేయునికే
ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆ
మనసెరిగిన సత్యా..విధేయునికే
అనురాగ మధువు..అందుననీ
నీవైన చెప్పవే..జాబిలీ
ఇక నీవైన చెప్పవే..ఓ జాబిలీ
నీవైన చెప్పవే..జాబిలీ
No comments:
Post a Comment