Friday, July 02, 2010

వయసొచ్చిన పిల్ల--1975


సంగీతం::T.చలపతిరావు  
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల ,రమేష్ 
తారాగణం::లక్ష్మీ,మురళిమోహన్,గిరిబాబు,జి.వరలక్ష్మి

పల్లవి::

జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా

చరణం::1

తారలు ప్రతీ రేయి వస్తాయి
పున్నమి మాసానికి ఒకేసారి ఒకేసారి
పువ్వులు ప్రతిరోజూ పూస్తాయి
వసంతం ఏడాదికి ఒకేసారి ఒకేసారి
ఎన్ని కోర్కెలున్నాకలలేవో కంటున్నా
ఎన్ని కోర్కెలున్నా కలలేవో కంటున్నా

చరణం::2

కన్నె మనసు వలచెది ఒకేసారి
బ్రతుకులో ఒకేసారి
జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా

చరణం::3

నింగిని విడిపోదు నీలిమ
రంగుల మబ్బులెన్నో ముసిరినా ముసిరినా
కెరటం విడిపోదూ కడలినీ
పెను తుఫానులెన్నెన్నో విసిరినా విసిరినా
కాలం కాదన్నా ఆ దైవం ఏమన్నా
కాలం కాదన్నా ఆ దైవం ఏమన్నా
ఏనాడు విడిపోదు ఈ భంధము
అదేలే...అనుబంధం
జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా

Thursday, July 01, 2010

వయసొచ్చిన పిల్ల--1975


సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::లక్ష్మీ,మురళిమోహన్,గిరిబాబు,G.వరలక్ష్మి

పల్లవి::

చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
వయసొచ్చిన పిల్లకు..ఆన్నిటి కంటే
వలపే అందము..వలపే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ

చరణం::1

కొమ్మకు పువ్వులందము..పూలకు తావులందమూ
రేయికి చుక్కలందము..చుక్కలకు చంద్రుడందమూ
రేయికి చుక్కలందము..చుక్కలకు చంద్రుడందమూ
నీ నల్లని సిగలో...తెల్లని మల్లెలు 
తళుకే అందము...తళుకే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ

చరణం::2

పాటకు రాగమందము..ఆ ఆ ఆ ఆ ఆ
పాటకు రాగమందము..ఆటకు తాళమందమూ
కళ్లకు కాటుకందము..కాళ్లకు గజ్జలందమూ
కళ్లకు కాటుకందము..కాళ్లకు గజ్జలందమూ
నీ వెచ్చని కౌగిట...ఊయలలూగే
బ్రతుకే అందము..బ్రతుకే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ

చరణం::3

నింగికి మబ్బులందము..మబ్బుకు మెరుపులందమూ
మోముకు తిలకమందము..పెదవికి నవ్వులందమూ
మోముకు తిలకమందము..పెదవికి నవ్వులందమూ 
నీ నీడను తోడును...కోరే
నాకు నీవే అందము..నీవే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ

Wednesday, June 30, 2010

ఎదురీత--1977::ఖమాస్::రాగం



సంగీతం::సత్యం
రచన::వేటూరి సుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు

ఖమాస్::రాగం 
పల్లవి::


ఎదురీతకు అంతం లేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా
ఎదురీతకు అంతం లేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా
వాడిన ప్రేమ వసంతం..ఏనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతం లేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా

చరణం::1

సాగరమే నా చేరువనున్న..దాహం తీరదులే
తీరాలేవో చేరుతు ఉన్నా..దూరం మారదులే
ఇది నడి ఏట తీరాల వేట..ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత

ఎదురీతకు అంతం లేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా

చరణం::2

చేయని నీరం చెలిమిని కూడా..మాయం చేసేనా
మాసిన మదిలో మమతను కూడా..గాయం చేసేనా
నాయను వారే పగవారైతే..ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత

ఎదురీతకు అంతం లేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా
వాడిన ప్రేమ వసంతం..ఏనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతం లేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా

ఎదురీత--1977






సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల


తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ..చిరుకాటు ఈ తేనెటీగా

నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే
నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే
నీ ఊపిరిసోకి మనసు వేణువులూదే

తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా

నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే
నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే
నీ నడకలలోనే వయసు మువ్వలు మోగే

ఒకసారి రుచి చూడమందీ..చిరుకాటు ఈ తేనెటీగా

ఈ రేయి హాయి మోయలేను వంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
ఈ రేయి హాయి మోయలేను వంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
నులివెచ్చన కాదా మనసిచ్చిన రేయి
నులివెచ్చన కాదా మనసిచ్చిన రేయి
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ

తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ..చిరుకాటు ఈ తేనెటీ
గా

ఓ సీత కథ--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::D. సినారె
గానం::S.P.బాలసుబ్రహ్మణ్యం,P.సుశీల

తారాగణం::చంద్రమోహన్,కాంతారావు,అల్లు రామలింగయ్య,రోజారమణి,శుభ,రమాప్రభ

పల్లవి::

మల్లె కన్న తెల్లన..వెన్నెలంత చల్లన
ఏది..ఏది..ఏది
మల్లె కన్న తెల్లన మా సీత సొగసు
వెన్నెలంత చల్లన మా సీత సొగసు

తేనె కన్న తీయన..పెరుగంత కమ్మన
ఏది..ఏది..ఏది
తేనె కన్న తీయన మా బావ మనసు
పెరుగంత కమ్మన మా బావ మనసు

చరణం::1

నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి
నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి
ఏమని?
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని
నీతోనే ఒక మాట ...నీతోనే ఒక మాట
చెప్పాలి..ఏమని?
నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని

మల్లె కన్న తెల్లన మా సీత సొగసు
తేనె కన్న తీయన మా బావ మనసు

చరణం::2

మనసుంది ఎందుకని..మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని..ఆ గుడిలో దివ్వెగా నిలవాలని
మనసుంది ఎందుకని..మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని..ఆ గుడిలో దివ్వెగా నిలవాలని

మనువుంది ఎందుకని..ఆ దివ్వెకు వెలుగై పోవాలని
బ్రతుకుంది ఎందుకని..ఆ వెలుగే నీవుగా చూడాలని
ఆ వెలుగే...నీవుగా చూడాలని

మల్లె కన్న తెల్లన..ఊహు..ఊ
తేనె కన్న తీయన..ఊ..ఊ..ఊ

ప్రాణం ఖరీదు--1978
























చిరంజీవి మొదటి సినిమా ప్రాణంఖరీదు 1978  
సంగీతం::చక్రవర్తి
రచన::జాలాది రాజా రావ్
గానం::SP.బా
లు

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఎడ్సినా పొంత నిండదు

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మణిసికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటదా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

Tuesday, June 29, 2010

కొత్త నీరు--1981






సంగీతం::రమేష్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.
శైలజ

ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో ఆశగా ఉందనో
ఉర్రూతలూగకే మనసా

తలలోన ముడిచాక విలువైన పూవైన
దైవపూజకు తగదు మనసా
తలలోన ముడిచాక విలువైన పూవైన
దైవపూజకు తగదు మన
పొరపాటు చేసావో దిగాజారిపోతావు
నగుబాటు తప్పదు మనసా
పెడదారి మురిపాలు మొదటికే మోసాలు
చాలు నీ వేషాలు మనసా...2

ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా

తుమ్మెదలు చెలరేగి తోటలో ముసిరేను
దిమ్మరిని నమ్మకే మనసా
దేశదిమ్మరిని నమ్మకే మనసా
తుమ్మెదలు చెలరేగి తోటలో ముసిరేను
దిమ్మరిని నమ్మకే మనసా
దేశదిమ్మరిని నమ్మకే మన
చపల చిత్తము విపరీతమవుతుంది
చలియించకే వెర్రి మనసా
కపటాలు సరదాలు కవ్వింపు సరసాలు
కాలు జారేనేమో మనసా...2

ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మన
సా

గుఢాచారి 116--1966
























సంగీతం::T.చలపతి రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘటసాల.P.సుశీల. బృందం   
Film Directed By::M.Mallikaarjuna Rao
తారాగణం::కృష్ణ,జయలలిత,ముక్కామల,రాజబాబు,గీతాంజలి,నెల్లూరుకాంతారావు,రాజనాల.

పల్లవి::

యా యా యా య యా య యా యా యా యా యా 
మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వులె నవ్వాలి
మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వులె నవ్వాలి
మనమురోజూ పండుగె పండుగె చేయాలి

చరణం::1

లలలా లాలలాలలా..లాలలాలలా
చేయి కలుపు సిగ్గుపడకు చేయికలుపు సిగ్గుపడకు
అందుకోవోయ్ నా పిలుపు 

లలలాం లలలాం లలలాం లలలాం 
లలలాం లలలాం లలలాం లలలాం 

అవునునేడే ఆశవుదుపు..అవునులేవే నేడే ఆశవిడుపు
ఆటప్ పాటల కలగలుపు

యా యా యా య యా య యా యా యా యా యా 
మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వులె నవ్వాలి
మనమురోజూ పండుగె పండుగె చేయాలి

చరణం::2

లలలా లాలలాలలా..లాలలాలలా
పూవులాగ పులకరించు..పూవులాగ పులకరించు
దాచకోయీ కోరికలు..

లలలాం లలలాం లలలాం లలలాం 
లలలాం లలలాం లలలాం లలలాం 

ఆశలుంటే అనుభవించు..ఆశలుంటే అనుభవించు
అనుభవాలే సంపదలు

యా యా యా య యా య యా యా యా యా యా 
మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వులె నవ్వాలి
మనమురోజూ పండుగె పండుగె చేయాలి


Gudhaachaari 116--1967
Music::T.Chalapati Rao
Lyrics::Arudra
Singer's::Ghatasaala , P.Suseela, & Brundam
Film Directed By::M.Mallikaarjuna Rao
Cast::Krishna,Jayalalita,Mukkaamala,Rajababu,Geetaanjali,NellooriKanta Rao,Raajanaala.

:::::::::::::::::::::::::::

yaa yaa yaa ya yaa ya yaa yaa yaa yaa yaa 
manasuteeraa navvule navvule navvule navvaali
manasuteeraa navvule navvule navvule navvaali
manamurOjU panDuge panDuge chEyaali

::::1

lalalaa laalalaalalaa..laalalaalalaa
chEyi kalupu siggupaDaku chEyikalupu siggupaDaku
andukOvOy naa pilupu 

lalalaam lalalaam lalalaam lalalaam 
lalalaam lalalaam lalalaam lalalaam 

avununEDE ASavudupu..avunulEvE nEDE ASaviDupu
ATap paaTala kalagalupu

yaa yaa yaa ya yaa ya yaa yaa yaa yaa yaa 
manasuteeraa navvule navvule navvule navvaali
manamurOjU panDuge panDuge chEyaali

::::2

lalalaa laalalaalalaa..laalalaalalaa
poovulaaga pulakarinchu..poovulaaga pulakarinchu
daachakOyii kOrikalu..

lalalaam lalalaam lalalaam lalalaam 
lalalaam lalalaam lalalaam lalalaam 

ASalunTE anubhavinchu..ASalunTE anubhavinchu
anubhavaalE sampadalu

yaa yaa yaa ya yaa ya yaa yaa yaa yaa yaa 
manasuteeraa navvule navvule navvule navvaali
manamurOjU panDuge panDuge chEyaali



Monday, June 28, 2010

రెండు రెళ్ళు ఆరు--1986






సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి


కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే.. ముద్దర వేసి..ప్రేయసి కౌగిలి అందుకో

ఆ..కాస్తందుకో..దరఖాస్తందుకో..భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి..దస్తతు చేసి..ప్రేయసి కౌగిలి అందుకో

ఆ..ఆ కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో

చిరుగాలి దరఖాస్తు..లేకుంటె కరిమబ్బు
చిరుగాలి దరఖాస్తూ..లేకుంటె కరిమబ్బూ
మెరుపంత నవ్వునా..చినుకైన రాలునా

జడివాన దరఖాస్తు..పడకుంటె సెలయేరు
జడివాన దరఖాస్తూ..పడకుంటె సెలయేరూ
వరదల్లె పొంగునా..కడలింట చేరునా

శుభమస్తు అంటే..దరఖాస్తు ఓకే

ఆ..కాస్తందుకో..దరఖాస్తందుకో..భామ దరఖాస్తందుకో

చలిగాలి దరఖాస్తు..తొలిఈడు వినకుంటె
చలిగాలి దరఖాస్తూ..తొలిఈడు వినకుంటే
చెలి జంట చేరునా..చెలిమల్లె మారునా

నెలవంక దరఖాస్తు..లేకుంటె చెక్కిళ్ళు
నెలవంక దరఖాస్తూ..లేకుంటె చెక్కిళ్ళూ
ఎరుపెక్కి పోవునా..ఎన్నెల్లు పండునా

దరిచేరి కూడా దరఖాస్తులేలా

కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో
దగ్గర చేరి..దస్తతు చేసి..ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో

Sunday, June 27, 2010

సంసారం--1988


సంగీతం::రాజ్ కోటి
రచన::?

గానం::SP.బాలు,P.సుశీల


కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలూ..
ఆరాధనంతా..ఆలాపనైతే..
కోరుకొన్న పాటలీవేళ
రచించే శుభలేకా..
ఫలించే కలలింకా..

కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలూ..
ఆరాధనంతా..ఆలాపనైతే..
కోరుకొన్న పాటలీవేళ
రచించే శుభలేకా..
ఫలించే కలలింకా..

కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలూ.

కంటి కలలే..ఏటి అలలై..2
తీరాలు దాటాయి రాగాలతో
తీరాలు కలిసాయి కౌగిళ్ళలో

సన్నగాలి పెట్టుకొన్న పూలమొగ్గలూ
ఎన్నలొచ్చి అంటుకొంది ఎన్నిచీరలో
ఆగాహమే ఈ స్నేహమై అదింది ఇన్నాళ్ళకూ
ఇదేలే శుభవేళా..యదల్లో రసలీలా

కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలూ

కన్నె వడిలో..ప్రేమ గుడిలో..2
నే హారతిస్తాను అందాలనీ
నే హారమేస్తాను ప్రాణాలనీ

చేతిమీద పెట్టుకొన్న లేతముద్దుల్లో
గాజులమ్మ నవ్వుకొన్న మోజుమధ్యల్లో

నా పల్లకీ సాగాలిలే..
నీ చైత్ర గీతాలతో
అందాక సెలవింకా..సరేలే గోరింకా

కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలూ..
ఆరాధనంతా..ఆలాపనైతే..
కోరుకొన్న పాటలీవేళ
రచించే శుభలేకా..
ఫలించే కలలింకా..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్.
.