Showing posts with label ప్రాణం ఖరీదు--1978. Show all posts
Showing posts with label ప్రాణం ఖరీదు--1978. Show all posts

Wednesday, June 30, 2010

ప్రాణం ఖరీదు--1978
























చిరంజీవి మొదటి సినిమా ప్రాణంఖరీదు 1978  
సంగీతం::చక్రవర్తి
రచన::జాలాది రాజా రావ్
గానం::SP.బా
లు

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఎడ్సినా పొంత నిండదు

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మణిసికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటదా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

Thursday, January 07, 2010

ప్రాణం ఖరీదు--1978


















సంగీతం::చక్రవర్తి
రచన::జాలది
గానం::G.ఆనంద్,P.సుశీల  
తారాగణం::చిరంజీవి,చంద్రమోహన్,జయసుధ,సత్యనారాయణ,చలం,నూతన్ ప్రసాద్,రమాప్రభ

చిరంజీవి మొదటి సినిమా ప్రాణంఖరీదు 1978  

సాకీ::  

యేలియల్లో..యేలియల్లో..ఎందాకా..ఆ..ఆ
యాలమీది..పోయేరమ్మ..గూటిచిలకా
యేలియల్లో..యేలియల్లో..ఎందాకా..ఆ..ఆ
యాలమీది..పోయేరమ్మ..గూటిచిలకా

పల్లవి::

ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా

ఎన్నెల్లో ఇళ్లేయనా..ఆ..ఆ..చుక్కల్లో పక్కేయనా
ఎన్నెల్లో ఇళ్లేయనా..ఆ..ఆ..చుక్కల్లో పక్కేయనా

గోరంకా గోరంకా తుమ్మెదా..ఆ..ఆ
గీరెక్కిపోయింది తుమ్మెదా..ఆ..ఆ
గోరంకా గోరంకా తుమ్మెదా..ఆ..ఆ
గీరెక్కిపోయింది తుమ్మెదా..ఆ..ఆ

ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ 
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ
ఆమూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా
ఆమూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా

చరణం::1

ఆలమబ్బు బుగ్గల మీద
మెరెపు మెరిసి ఆడినట్టే
నీలికొండ గుండెల మీద 
వాన చుక్క జారినట్టే

వానచుక్క వాగులైయీ
సముద్రాన కలిసినట్టే
వానచుక్క వాగులైయీ
సముద్రాన కలిసినట్టే
రోజువారి మోజులన్నీ
మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకోనా
వడినిండా నేనుండి పోనా
ఓరయ్య నేనాడుకోనా
వడినిండా నేనుండి పోనా

యేలియల్లో..యేలియల్లో..ఎందాకా..ఆ..ఆ
యాలమీది..పోయేరమ్మ..గూటిచిలకా

చరణం::2

రేతిరంతా నిద్దరకాచి..కలువపూలు నవ్వినట్టే
రేపుమాపు ఆకాశం..ఆకువక్క యేసినట్టే

పడమటేపు పడకేసి..సూరిగాడు దొర్లినట్టే 
పడమటేపు పడకేసి..సూరిగాడు దొర్లినట్టే 
ఊరివైపు తలుపు తీసి తొంగి చూసి నవ్వినట్టే
సంధెల్లో చిందేయనా..పొద్దెల్లే ముద్దెట్టనా
సంధెల్లో చిందేయనా..పొద్దెల్లే ముద్దెట్టనా

ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ 
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ
ఎన్నెల్లో ఇళ్లేయనా..ఆ..ఆ..చుక్కల్లో పక్కేయనా
ఆమూడు ముళ్లెయ్యరా..నూరేళ్ల పడకేయరా

యేలియల్లో..యేలియల్లో..ఎందాకా..ఆ..ఆ
యాలమీది..పోయేరమ్మ..గూటిచిలకా
యేలియల్లో..యేలియల్లో..ఎందాకా..ఆ..ఆ
యాలమీది..పోయేరమ్మ..గూటిచిలకా