Wednesday, June 30, 2010

ప్రాణం ఖరీదు--1978
























చిరంజీవి మొదటి సినిమా ప్రాణంఖరీదు 1978  
సంగీతం::చక్రవర్తి
రచన::జాలాది రాజా రావ్
గానం::SP.బా
లు

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఎడ్సినా పొంత నిండదు

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మణిసికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటదా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

2 comments:

కొత్త పాళీ said...

అర్ధవంతమైన లిరిక్. బాలూ చాలా భావయుక్తంగా పాడారు.
Thanks for sharing

srinath kanna said...

chaalaa thanks kotta paalii gaaru :)