Wednesday, June 30, 2010

ఓ సీత కథ--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::D. సినారె
గానం::S.P.బాలసుబ్రహ్మణ్యం,P.సుశీల

తారాగణం::చంద్రమోహన్,కాంతారావు,అల్లు రామలింగయ్య,రోజారమణి,శుభ,రమాప్రభ

పల్లవి::

మల్లె కన్న తెల్లన..వెన్నెలంత చల్లన
ఏది..ఏది..ఏది
మల్లె కన్న తెల్లన మా సీత సొగసు
వెన్నెలంత చల్లన మా సీత సొగసు

తేనె కన్న తీయన..పెరుగంత కమ్మన
ఏది..ఏది..ఏది
తేనె కన్న తీయన మా బావ మనసు
పెరుగంత కమ్మన మా బావ మనసు

చరణం::1

నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి
నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి
ఏమని?
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని
నీతోనే ఒక మాట ...నీతోనే ఒక మాట
చెప్పాలి..ఏమని?
నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని

మల్లె కన్న తెల్లన మా సీత సొగసు
తేనె కన్న తీయన మా బావ మనసు

చరణం::2

మనసుంది ఎందుకని..మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని..ఆ గుడిలో దివ్వెగా నిలవాలని
మనసుంది ఎందుకని..మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని..ఆ గుడిలో దివ్వెగా నిలవాలని

మనువుంది ఎందుకని..ఆ దివ్వెకు వెలుగై పోవాలని
బ్రతుకుంది ఎందుకని..ఆ వెలుగే నీవుగా చూడాలని
ఆ వెలుగే...నీవుగా చూడాలని

మల్లె కన్న తెల్లన..ఊహు..ఊ
తేనె కన్న తీయన..ఊ..ఊ..ఊ

2 comments:

వేణు said...

ఈ పాట రాసింది సినారె. సరిచేయగలరు.

srinath kanna said...

chaalaa chaalaa thanks venu garu tappakundaga sarichestaanu.. :)