Wednesday, June 30, 2010

ఎదురీత--1977






సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల


తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ..చిరుకాటు ఈ తేనెటీగా

నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే
నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే
నీ ఊపిరిసోకి మనసు వేణువులూదే

తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా

నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే
నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే
నీ నడకలలోనే వయసు మువ్వలు మోగే

ఒకసారి రుచి చూడమందీ..చిరుకాటు ఈ తేనెటీగా

ఈ రేయి హాయి మోయలేను వంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
ఈ రేయి హాయి మోయలేను వంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
నులివెచ్చన కాదా మనసిచ్చిన రేయి
నులివెచ్చన కాదా మనసిచ్చిన రేయి
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ

తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ..చిరుకాటు ఈ తేనెటీ
గా

No comments: