Wednesday, June 30, 2010

ఎదురీత--1977::ఖమాస్::రాగం

సంగీతం::సత్యం
రచన::వేటూరి సుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు

ఖమాస్::రాగం 
పల్లవి::

ఎదురీతకు అంతం లేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా

వాడిన ప్రేమ వసంతం..ఏనాడైనా వికసించి రాదా

చరణం::1

సాగరమే నా చేరువనున్న..దాహం తీరదులే
తీరాలేవో చేరుతు ఉన్నా..దూరం మారదులే
ఇది నడి ఏట తీరాల వేట..ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత

ఎదురీతకు అంతం లేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా

చరణం::2

చేయని నీరం చెలిమిని కూడా..మాయం చేసేనా
మాసిన మదిలో మమతను కూడా..గాయం చేసేనా
నాయను వారే పగవారైతే..ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత

No comments: