Wednesday, May 20, 2009

వైకుంఠపాళి--1975


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల 
తారాగణం::శారదా,రంగనాద్,సత్యనారాయణ,రాజబాబు,అరుణ,కె.విజయ, జ్యొతిలక్ష్మి

పల్లవి::

నిదురపో బాబూ నిదురపో 
కుదురులేని లోకమందు
నిదుర ఒకటే మత్తు మందు
నిదురపో బాబూ నిదురపో 

చరణం::1
   
కన్నవారు నిన్ను గూర్చి ఎన్ని కలలు కన్నారో 
ఎన్ని కళ్ళు నిన్ను చూచి ఎర్రబడుతు ఉన్నయో
ఆ కళ్ళ ఎరుపే కడిగి నీకు ఎర్రనీళ్ళుగ చేస్తాను 
కళ్ళ ఎరుపే కడిగి నీకు ఎర్రనీళ్ళుగ చేస్తాను
ఆ కలలు పండే రోజు వరకు కంటిరెప్పగ ఉంటాను  
నిదురపో బాబూ నిదురపో 

చరణం::2

కొండకవతల సూర్యుడున్నాడు 
కోడికూస్తే లేచివస్తాడు
కారుచీకటి కప్పిపెట్టిన 
కల్లలన్నీ బయటపెడతాడు 
నిదురపో బాబూ నిదురపో 
కుదురులేని లోకమందు 
దుర ఒకటే మత్తు మందు
నిదురపో బాబూ నిదురపో

Sunday, May 17, 2009

వైకుంఠపాళి--1975


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::శారదా,రంగనాద్,సత్యనారాయణ,రాజబాబు,అరుణ,K.విజయ, జ్యొతిలక్ష్మి

పల్లవి::

గౌరమ్మోలే గౌరమ్మ గౌరమ్మోలే గౌరమ్మా 
నీ గుట్టు నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మా
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు 
నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ
గౌరమ్మ..గౌరమ్మ

చరణం::1

బిత్తర చూపులు చూచేవెందుకు
బిరబిర నడకలు నడిచేవెందుకు
బిత్తర చూపులు చూచేవెందుకు
బిరబిర నడకలు నడిచేవెందుకు
కొత్త కధలు చెప్పకు నాకు
కొత్త కధలు చెప్పకు నాకు
మెత్తగ వున్నాననుకోకు        
గౌరమ్మ గౌరమ్మ హోయ్ హోయ్ 
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు 
నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ

చరణం::2

కనకుండానే పిల్లాడా అసలు మొగుడంటూ ఉన్నాడా గౌరమ్మ 
కనకుండానే పిల్లాడా అసలు మొగుడంటూ ఉన్నాడా
బిగువు సడలని ఈ సొగసు
పెళ్ళైయిన పిల్లకు వుంటుందా బిగువు 
సడలని ఈ సొగసు పెళ్ళైయిన పిల్లకు వుంటుందా      
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు నాకు తెలిసిపొయిందే 
గౌరమ్మా నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ
గౌరమ్మ గౌరమ్మ ఆ ఆ గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::


అదే అదే భద్రాచలం ఆర్తుల పాలిటి దివ్య వరం

ఆ పుణ్యస్థలి అడుగు మోపితే అడుగక దొరుకును ఆత్మానందం 

చరణం::1


పాహి పాహి మాంపాహి పరాత్పర పావన గుణధామా

పాహి పాహి మాంపాహి పరాత్పర పావన గుణధామా 
నీ పాద కమలములె మాకు శరణ్యము భద్రాచల రామా
పాల ముంచినా నీట ముంచినా భారము నీదే రామా 
భారము నీదే రామా భారము నీదే రామా

చరణం::2


లేక లేకనీ దర్శన భాగ్యము నేటికి కల్గిందీ

రామయ్య తండ్రీ రామయ్య తండ్రీ
రామయ్య తండ్రీ అని నొరారగ పిలవాలని వుంది 
కాని పిలువలేక నా గుండె గొంతుతో కొట్టుక చస్తూంది
పుడమిలోన నావంటి దురాత్ముడు పుట్టబోడు రామా
నీల మేఘశ్యామా శ్రీరామ పరంధామా
నన్నేలుకొమ్ము రామా భద్రాచల రామా
రామా రామా రామా రామా రామా

రాముని మించిన రాముడు--1975



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య,వాణిశ్రీ,శ్రీవిద్య,S.వరలక్ష్మి

పల్లవి :

ఏదో మైకంలో ఉన్నాను నేను..హహహ
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను..నేను
ఏదో మైకంలో పాడేను నేను..నీవూ పాడాలిరా
ఓ ప్రియా..ఆ..హరే..హరే..హరే..హరే       
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా

చరణం::1 

నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా మేనిలో నేడేలనో రగిలింది కనరాని జ్వాల..రగిలింది కనరాని జ్వాల  
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా 

చరణం::2

నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
ఈ రేయిలో ఈ వేళలో...తీరాలి 
ఇన్నాళ్ళ దాహం..తీరాలి ఇన్నాళ్ళ దాహం   
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను.. నీవే రావాలిరా

చరణం::3

నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
ఆ రూపమే నా కోసమే..నిలిచింది 
నా కళ్ళలోన..నిలిచింది నా కళ్ళలోన  
     
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను...నేను
ఏదో మైకంలో పాడేను నేను..నీవూ పాడాలిరా
ఓ ప్రియా..ఆ..హరే..హరే..హరే..హరే       
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా

Saturday, May 16, 2009

ఎర్ఱమల్లెలు --- 1981



సంగీతం::చక్రవర్తి
రచన::ప్రభు
గానం::S.P.శైలజ


నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇళ్ళే లేదు
తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇళ్ళే లేదు
చేదామంటే కొలువూ లేదు,పోదామంటే నెలవు లేదు
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
ఓ లింగా రామారాజ్యం తీరును చూడు శంభులింగ

గుక్కెడు గంజి కరువైపోయె,బక్కడి ప్రాణం బరువైపోయె
గుక్కెడు గంజి కరువైపోయె,బక్కడి ప్రాణం బరువైపోయె
బీదాబిక్కి పొట్టలుకొట్టి మేడలుకట్టేసి కనిపెట్టి
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకి అందం ఎరువు
లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకి అందం ఎరువు
కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
ఓయ్ లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

ముందు మొక్కులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ముందు మొక్కులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ఉలకావేమి పలకావేమి బండారాయిగ మారిన సామి
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
ఆ..లింగ..రామారాజ్యం తీరూచూడు
శివా..శంబులింగా..లింగ..
రామారాజ్యం తీరూచూడు..శివా..శంబులింగా

బొబ్బిలి రాజ--1990




సంగీతం::ఇళయ రాజ
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు,S.జానకి

Film Directed By::B.Gopal

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ....ఐ లవ్ యూ....
రాజా....ఐ లవ్ యూ....
చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క

మారుమూల సోకుచేర లేఖ రాయనా..
చెరసాలు కోరు సంతకాలు తాకి చూడనా..
తేరి పార చూడనీ..దోర ఈడునీ..
చూర చూరు దాటనీ..వేడి ఊహనీ
వెక్కిరించు వన్నెలన్ని గొల్లగొట్టుకోనీ
సన్నజాజీ కత్తిరించు మల్లి కట్టుకోనీ
నా...జాలంగా..సంగా..సారంగా..

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ....ఐ లవ్ యూ....
మ్మ్..రాజా....ఐ లవ్ యూ....

తీగలాంటి నాటుచూపు నాటుకొన్నది
అలవాటులేని చాటుతోట మాటుకొన్నదీ
తీగలేని యవ్వనం..ఆదరించవా..
తీరవాలు మోజుతో..స్వాగతించవా..
రంగరంగ వైభవాల..మంటలేలుకోవా
గంగపొంగు సంబరాల..రంగుతేలనీవా
ఈ...ఈ చోటే...డార్లింగ్..అహ్హా..ఐ లవ్ యూ..

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ..ఈ..ఈ..ఐ లవ్ యూ....
రాజా....ఐ లవ్ యూ....

బొబ్బిలి రాజ--1990




సంగీతం::ఇళయ రాజ
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు,S.జానకి

Film Directed By::B.Gopal
చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ....ఐ లవ్ యూ....
రాజా....ఐ లవ్ యూ....
చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క

మారుమూల సోకుచేర లేఖ రాయనా..
చెరసాలు కోరు సంతకాలు తాకి చూడనా..
తేరి పార చూడనీ..దోర ఈడునీ..
చూర చూరు దాటనీ..వేడి ఊహనీ
వెక్కిరించు వన్నెలన్ని గొల్లగొట్టుకోనీ
సన్నజాజీ కత్తిరించు మల్లి కట్టుకోనీ
నా...జాలంగా..సంగా..సారంగా..

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ....ఐ లవ్ యూ....
మ్మ్..రాజా....ఐ లవ్ యూ....

తీగలాంటి నాటుచూపు నాటుకొన్నది
అలవాటులేని చాటుతోట మాటుకొన్నదీ
తీగలేని యవ్వనం..ఆదరించవా..
తీరవాలు మోజుతో..స్వాగతించవా..
రంగరంగ వైభవాల..మంటలేలుకోవా
గంగపొంగు సంబరాల..రంగుతేలనీవా
ఈ...ఈ చోటే...డార్లింగ్..అహ్హా..ఐ లవ్ యూ..

చెమ్మచెక్క చెమ్మచెక్కా..జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క చిమ్మచెక్క..నమ్మకంగ తిమ్మిరెక్క
కో..అంది కోక ఎందుకో..
కోరింది..కోకి ఎందుకో..
రాణీ..ఈ..ఈ..ఐ లవ్ యూ....
రాజా....ఐ లవ్ యూ....

Friday, May 15, 2009

బొబ్బిలి రాజ ~~ 1990



సంగీతం::ఇళయ రాజ
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు,S.జానకి


మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..మ్మ్ మ్మ్ మ్మ్
చంచకు చాంచకు చం చం
చాంచకు చాంచకు చం
చంచకు చాంచకు చం చం
చాంచకు చాంచకు చం

అబింబిండింగ్..అబింబిండింగ్
అబింబిండింగ్..అబింబిండింగ్
అబింబిండింగ్..అబింబిండింగ్

కన్యాకుమారీ కనపడద దారి..
కయ్యాలమారీ పడతావే జారి..
పాతాళం కనిపెట్టేలా..ఆకాశం పనిపెట్టేలా
ఊగకేమరి..మతిలేని సుందరీ
జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

గోపాలబాలా..ఆపర ఈ గోలా
ఈ కైపు ఇలా..ఊపర ఉయ్యాలా..
మైకంలో మయసభచూడు..మహారాజా రాణా తోడు..
సాగనీ..మరీ..సరదాల గారడీ
జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

బింబా..బబబ..బింబా..బంబం..బింబాం..
బింబాం బింబ బింబ బింబా...ఆం...

కొండలూ..గుట్టలూ..చిందులాడే తకఝణుథోం
వాగులూ..వంకలూ..ఆడిచూసే..కథచెపుదాం
తూనీగ రెక్కలెక్కుదాం..సూరీడు పక్క నక్కుదాం
ఊదేటి కొమ్ము వెదుకుదాం..బంగారు జింక నడుగుదాం
చూడమ్మా..హంగామా..అడివంతా..రంగేద్దాము
సాగించేయ్..వెరైటీ..పోగ్రాం..
కళ్ళవిందుగా..పైత్యాల పండుగా
జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

ఆహా..కన్యాకుమారీ..
కనపడదా దారి..ఉహు..
కయ్యాలమారీ పడతావే జారి
మైకంలో మయసభచూడు..మహారాజా రాణా తోడు..
సాగనీ..మరీ..సరదాల గారడీ
జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

చాజజా జాంచకు జకుం..హా..ఏహే..
హై..హేహే..జకు జకు జకు
జా జా జా జాంచకు జాజా

డేగతో..ఈగలే..ఫైటు చేసే చడుగుడులో
చేపలే..చెట్టుపై పళ్ళుకోసే గడబిడిలో
నేలమ్మ తప్పతాగెనూ..ఏమూల చెప్పిపోయేనో
మేఘాల కొంగు పట్టుకో..తూలేటి నడక నాపుతూ
ఓయమ్మో..మాయమ్మో..దిక్కుల్నే ఆటాడించే..
చిక్కుల్లో గందరగోళం..ఒళ్ళు ఊగగా..ఎక్కిళ్ళు రేగగా

జింకుచకు జింగుచకు జా
చా..జింకుచకు జింగుచకు జా
జాజజా జాంచకు జకుం..హా..ఏహే..
హై..హేహే..జకు జకు జకు
జా జా జా జాంచకు జాజా


ఏయ్..గోపాలబాలా..ఓయ్..ఆపర ఈ గోలా
ఈ కైపు ఇలా..హహహ..ఊపర ఉయ్యాలా..
ఓయ్..పాతాళం కనిపెట్టేలా..హా..
ఆకాశం పనిపెట్టేలా..ఊగకే మరి..ఆ..
మరిలేని..సుందరీ...ఆ ఆ..
జాజజా జాంచకు జకుం..హా..ఏహే..
హై..హేహే..జకు జకు జకు
జా జా జా జాంచకు జాజా
సాగనీ..మరీ..సరదాల గారడీ
జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

బొబ్బిలి రాజ ~~ 1990




సంగీతం::ఇళయ రాజ
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు,S.జానకి

బలపం పట్టి భామ బళ్ళో..అ ఆ ఇ ఈ నేర్చుకొంటాం
పంతంపట్టి ప్రేమవోళ్ళో..ఆహా..ఓహో..పాడుకొంటాం
అమ్మహా..అంటా అమ్మడూ..హోయ్యారే..హోయ్యారే..హోయ్
కమ్మహ వుండేటప్పుడూ...బుజ్జిపాపాయీ....
పాఠాలు నేర్పించు..పైటమ్మ ప్రణయాలతో..

సరసమింక ఎక్కువైతే..ఛఛ..ఛీఛీ.. తప్పదయ్యో
అప్పుడె ఇట్ట ప్రేమవళ్ళో ఐతే..గియ్తే..ఎందుకయ్యో
అచ్చులే అయ్యాఇప్పుడూ..హోయ్యారే..హోయ్యారే..హోయ్
హల్లుల్లో..హల్లో..ఎప్పుడూ..ఉ..ఉ..ఉ..

ఎట్టాగుందెపాప తొలిచూపే చుట్టుకోంటే
ఏదో కొత్తవూపే..ఎటువైపో నెట్టేస్తుంటే..
ఉండుండీయ్య..కొంచం ఒక నవ్వేతాకుతుందీ
మొత్తంగా ప్రపంచం..మహా గమ్మత్తుగావుందీ
ప్రేమంటే ఇంతేనేమో..బాగుంది ఏమైనా..
నాక్కూడ కొత్తేనయ్యో..ఏంచేద్దాం ఈపైనా
కాస్తైనా...కంగారు తగ్గాలి..కాదన్ను ఏంచేసినా
సరసమింక ఎక్కువైతే..ఛఛ..ఛీఛీ.. తప్పదయ్యో
అప్పుడె ఇట్ట ప్రేమవళ్ళో..ఐతే..గియ్తే..ఎందుకయ్యో
అమ్మహా..అంటా అమ్మడూ..హోయ్యారే..హోయ్యారే..హోయ్
కమ్మహ వుండేటప్పుడూ..అరె రె..ఓ..హో..హో..

చూపుల్లోతుపాకి తడి ఎట్టారేగుతుందో..
రెప్పల్లో రహస్యంపడి అట్టా అయిందయ్యో
కొమ్మాల్లోనిపూలే..మన స్నేహం కోరుతుంటే
కొండల్లోయకూలే మనమెట్టావున్నామంటే
అడివంతా అత్తారిల్లే..నీకైనా..నాకైనా..
ఎవరెవరో అత్తామావా..వరసెట్టా తెలిసేనే..
అందాకా....ఆపర్ని ఎత్తమ్మ ఈ మంచి మా మనసు
బలపం పట్టి భామ బళ్ళో అ ఆ ఇ ఈ నేర్చుకొంటాం
పంతంపట్టి ప్రేమవోళ్ళో ఆహా..ఓహో..పాడుకొంటాం
అచ్చులే అయ్యాఇప్పుడూ..హోయ్యారే..హోయ్యారే..హోయ్
హల్లుల్లో..హల్లో..ఎప్పుడూ..ఉ..
పిచ్చి బుజ్జాయీ..అల్లర్లు తగ్గించి వొళ్ళోన బజ్జోవయ్యో

బలపం పట్టి భామ బళ్ళో..అ ఆ ఇ ఈ నేర్చుకొంటాం
అప్పుడె ఇట్ట ప్రేమవళ్ళో..ఐతే..గియ్తే..ఎందుకయ్యో
అమ్మహా..అంటా అమ్మడూ..హోయ్యారే..హోయ్యారే..హోయ్
హల్లుల్లో..హల్లో..ఎప్పుడూ..ఉ..పిచ్చి బుజ్జాయీ...

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.జానకి 
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::

ఆఆఆఆఆ..ఏఏఏఏఏఏఏఏఏఏ 
ఏమండోయ్‌ బావగారూ..ఎప్పుడొచ్చారూ
ఏమండోయ్‌ బావగారూ..ఎప్పుడొచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ
ఏమి తేలేదా..మనసే రాలేదా..ఆ   
ఓఓఓ..ఏమండోయ్‌ బావగారూ ఎప్పుడొచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ

చరణం::1

చిలక కొరకని జామపండు..తీసుకో బావా
చిలక కొరకని జామపండు..తీసుకో బావా..ఆ
గోరంటని గోరింట పువ్వు..కోసుకో బావా..ఆ..అహా
చూడు బావా పాడుగాలి..నా పైట లాగుతుందీ
చూడు బావా పాడుగాలి..నా పైట లాగుతుందీ 
నీ కోసం నే దాచిన తాయం తనకిమ్మంటుందీ
ఎట్టా గిచ్చేదీ..ఆ..నీకని దాచిందీ.ఈ
ఓఓఓ..ఏమండోయ్‌ బావగారూ ఎప్పుడొచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ..ఊ

చరణం::2

ముదిరిపోతే బెండకాయను..ముట్టుకోరెవరు
అహా..వయసు మళ్ళితె బ్రహ్మచారిని..కట్టుకోరెవరు
కందిచేను నిన్నూ నన్నూ..విందుకు రమ్మంది
బావ..కందిచేను నిన్నూ నన్నూ..విందుకు రమ్మందీ
సందె వాలితే చోటు దొరకదని..ముందే చెప్పింది
అర్ధం కాలేదా..అయ్యో..నా రాతా  
ఓఓఓ..ఏమండోయ్‌ బావగారూ ఎప్పుడొచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ