Friday, May 15, 2009

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.జానకి 
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::

ఆఆఆఆఆ..ఏఏఏఏఏఏఏఏఏఏ 
ఏమండోయ్‌ బావగారూ..ఎప్పుడొచ్చారూ
ఏమండోయ్‌ బావగారూ..ఎప్పుడొచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ
ఏమి తేలేదా..మనసే రాలేదా..ఆ   
ఓఓఓ..ఏమండోయ్‌ బావగారూ ఎప్పుడొచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ

చరణం::1

చిలక కొరకని జామపండు..తీసుకో బావా
చిలక కొరకని జామపండు..తీసుకో బావా..ఆ
గోరంటని గోరింట పువ్వు..కోసుకో బావా..ఆ..అహా
చూడు బావా పాడుగాలి..నా పైట లాగుతుందీ
చూడు బావా పాడుగాలి..నా పైట లాగుతుందీ 
నీ కోసం నే దాచిన తాయం తనకిమ్మంటుందీ
ఎట్టా గిచ్చేదీ..ఆ..నీకని దాచిందీ.ఈ
ఓఓఓ..ఏమండోయ్‌ బావగారూ ఎప్పుడొచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ..ఊ

చరణం::2

ముదిరిపోతే బెండకాయను..ముట్టుకోరెవరు
అహా..వయసు మళ్ళితె బ్రహ్మచారిని..కట్టుకోరెవరు
కందిచేను నిన్నూ నన్నూ..విందుకు రమ్మంది
బావ..కందిచేను నిన్నూ నన్నూ..విందుకు రమ్మందీ
సందె వాలితే చోటు దొరకదని..ముందే చెప్పింది
అర్ధం కాలేదా..అయ్యో..నా రాతా  
ఓఓఓ..ఏమండోయ్‌ బావగారూ ఎప్పుడొచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ
బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమితెచ్చారూ

No comments: