Monday, April 11, 2011

చిన్ననాటి స్నేహితులు--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 

పల్లవి::

ఎందుకయ్యా నవ్వుతావూ
ఎవరు సుఖపడినారనీ..ఈ..ఎందుకయ్యా..ఆ 
నవ్వుకోరా తనివితీరా ఎవ్వరేమైతేమనీ నవ్వుకోరా..ఆ

చరణం::1

నువ్వు కడుపున పడిన నాడే
నుదుటి కుంకుమ చెరిపినావే
నువ్వు కడుపున పడిన నాడే
నుదుటి కుంకుమ చెరిపినావే
నిండు వెన్నెల బాటలో
కన్నీటి చీకటి నింపినావే
ఎందుకయ్యా నవ్వుతావూ
ఎవరు సుఖపడినారనీ ఎందుకయ్యా..ఆ 

చరణం::2

చావు బ్రతుకుల ఉందిరా
నిను చల్లగా కాపాడు దేవతా..ఆ
చావు బ్రతుకుల ఉందిరా
నిను చల్లగా కాపాడు దేవతా..ఆ 
ఆమే నీడయే లేని నాడు
ఆగిపోవును..మనకథా
ఆగిపోవును..మనకథా..ఆ
ఎందుకయ్యా..నవ్వుతావూ
ఎవరు సుఖపడినారనీ ఎందుకయ్యా..ఆ 

నిన్ను పెంచిన కల్పవల్లీ
నిండుగా బ్రతకాలనీ..ఈ
వేడుకోరా..వెంకటేసుని
వేడుకోరా..విశ్వనాధునీ
వేడుకోరా..ఆ..వేడుకోరా..ఆ

No comments: