సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::PB.శీనివాస్,P.సుశీల
వగల చూపులేలా..వేచితి జవరాలా
పరువాల సోయగాల..పరవశమ్ము చేయవా!2
మనసులోని కోరికలు..మరులుగొన్న వేళలు
తరిగిపోవనీ అలలపై..మనము తేలిపోదామా
యవ్వనమె పూలవనం..నవ్వులతో జీవనం
వలపు వూయలా వూగగా చేర రావేలా
మరల మరల రాదంటూ..మనదే యీ సుఖమంటూ
మరల మరల రాదంటూ..మనదే యీ జగమంటూ
హాయిగా తీయగా కలసి సాగిపోదామా!
ఆహా..హా హా హా హా హా హా హా
No comments:
Post a Comment