Monday, April 11, 2011

కానిస్టేబులు కూతురు --1963

సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::PB.శీనివాస్

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది
కన్నుల కేలా నాపై కోపం..కణకణలాడినవి
నీ..చూపుల కేలా నాపై కోపం..తూపులు దూసినవి

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

బులిపించు పైట కలహించి అచట..తరిమిన దెందులకో
బులిపించు పైట కలహించి అచట..తరిమిన దెందులకో
నీ వలపులు చిందే పలుకుల విందే..చేదుగ మారినదో
పీటలపైన పెళ్ళి దినాన మాటలు కరువైనా..
నన్ను ఓరచూపుల కోరికలూర చూడవ నీవైనా

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

మరదలు పిల్లా జరిగినదెల్లా..మరచుటే మేలుగదా ఓఓఓ
మరదలు పిల్లా జరిగినదెల్లా..మరచుటే మేలుగదా
నిన్నుకోరిన బావను కూరిమితోడను..చేరుటే పాడిగదా
నిన్నుకోరిన బావను కూరిమితోడను..చేరుటే పాడిగదా

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

No comments: