Monday, April 11, 2011

కానిస్టేబులు కూతురు --1963




సంగీతం::R.గోవర్ధనం
రచన::?
గానం::PB.శీనివాస్,P.సుశీల


రాగం::శహన::
(హిందుస్తాని కర్నాటక )

పూవువలె విరబూయవలె
పూవువలె విరబూయవలె
నీ నవ్వువలె..వెలుగీయవలె

మరి నివ్వేమంటవ్ ?

తావివలె మురిపించవలె..
తావివలె మురిపించవలె..
మనమెవ్వరమొ..మరిపించవలె
ఆఆఆఆఅ ఆఆ ఒహో ఒహో ఒహో..
ఒహో..ఓ ఓ ఓ ఓ ...

మమతలనెలవై..మాయని కలవై..
మనుగడ మధురం..చేయవలే..
మమతలనెలవై..మాయని కలవై..
మనుగడ మధురం..చేయవలే.

పుణ్యములఫలమై..ఎన్నుకొన్నవరమై
నాఇహపరమై..ఏలవలే..
పుణ్యములఫలమై..ఎన్నుకొన్నవరమై
నాఇహపరమై..ఏలవలే..

మనమే..నిజమై..మనకే రుజువై..
మనమే..నిజమై..మనకే రుజువై..
మనమే..జగమై..జగమే..ఏలవలే..
మనమే..జగమై..జగమే..ఏలవలే..

పూవువలె విరబూయవలె
నీ నవ్వువలె..వెలుగీయవలె

చిట్టిపాపనేనై..తల్లివడినీవై..
నీ హృదిలోనే..దాగవలే..
చిట్టిపాపనేనై..తల్లివడినీవై..
నీ హృదిలోనే..దాగవలే..

చిత్తమున నిన్ను..హత్తుకొని నేను
జీవితమంతా..సాగవలే..
చిత్తమున నిన్ను..హత్తుకొని నేను
జీవితమంతా..సాగవలే..
నిన్నే..తలచీ..నన్నే..మరచీ..
అన్నీ..గెలిచీ..అలరించవలే..

తావివలె మురిపించవలె..
మనమెవ్వరమొ..మరిపించవలె

No comments: