సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,S.జానకి
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
మంచితనం మనకెందులకు..వంచకులను మన్నించుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
తీయని వలపు ఎందులకు..తీరని వగపై కుండుటకు
మాయని మమతలు ఎందులకు..మదిలో జ్వాలై రగులుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
కమ్మని మాటలు ఎందులకు..కల్లాకపటం దాచుటకు
కన్నియ కలలు ఎందులకు..కలవారికి బలిచేయుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
పూవున తేనియ ఎందులకు..తేపికి విందులు చేయుటకు
తేపికి రెక్కలు ఎందులకు..పూవును మోసం చేయుటకు
కళ్ళల్లో నీరెందులకు.హోయ్...కలకాలం విలపించుటకు
మంచితనం మనకెందులకు..హోయ్..వంచకులను మన్నించుటకు
కళ్ళల్లో నీరెందులకు..హోయ్..కలకాలం విలపించుటకు
No comments:
Post a Comment