Friday, August 01, 2014

ప్రేమమందిరం--1981


సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::P.సుశీల,S.జానకి
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్

పల్లవి::  

మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా
మహా జనానికి మరదలు పిల్లను
మహానుభావుల మరులకు మల్లెనుకో
అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో
మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా 

మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా
మహా జనానికి మరదలు పిల్లను
మహానుభావుల మరులకు మల్లెనుకో
అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో
మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా

రాజరంజనీ::

యదువంశ సుధాంబుధి చంద్ర సామిరారా
శతకోటి మన్మధాకారా ఇటురారా
నీ మనసులోని తనివితీరా
ముని మనుమరాలి నేలుకోరా
చేతకోకపోతే ఊరుకోరా
చేతకానీ లేక పోతే పోరా
మాది మన్మధ పురాగ్రహారం  
మాది రోజుకొక్క సంసారం
పరువాలమీద వ్యాపారం
పరువున్న పెద్ద వ్యవహారం
నీ దానరా..ఆ..నన్నేలరా 

మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా
మహా జనానికి మరదలు పిల్లను
మహానుభావుల మరులకు మల్లెనుకో
అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో
మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా

ఆంగ్లరంజని:: 

లండన్ దొరబాబురో ఎమ్డన్ గురిచూడరో
అన్నెం పున్నెం తెలియని కన్నెపిల్ల
దానికన్నీ తెలియాలీ తెల్లారేకల్లా
నీ జత కూడినాక అది జాణ కావాల
మగజాతికి దెబ్బతో మన్మధబాణమవ్వాల
రాజరంజని రక్తి ఈ ఆంగ్లరంజని యుక్తి
సభారంజని శక్తి మందార పువ్వంటి మధుర రంజనికి
శృంగార పురుషుడా నీతోనే విముక్తి

సభారంజని:: 

ఐవింటి తోశాక చిలుకేసి వచ్చాక
చీర నలిగే దెప్పుడో నాసామి
చిన్న దలిగే దెప్పుడో
పువ్వూ విరిసేవేళ పులకింతలవేళ
నువ్వు కాస్త నెమ్మది నా అల్లుడో
కెవ్వుమంటదయో నా కూతురు రాచవన్నెవాడివని
రగడ నువ్వు చెయ్యవని
నమ్మినా కన్నకడుపు నమ్మినాను
మా అందరితోడు మా అందెలతోడు మా అంతంతోడు
కోడిగొంతు నొక్కుతాను కోరికంత తీర్చుకో
సూరీణ్ణి ఆపుతాను సోకు సొమ్ముచేసుకో 

మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా
మహా జనానికి మరదలు పిల్లను
మహానుభావుల మరులకు మల్లెనుకో
అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో
మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా

మధుర నెలవంక ఇలవంక దిగివచ్చింది 
నా చెక్కిలిపై నీ మక్కువ నిలిచింది
నెలవంక ఇలవంక దిగివచ్చింది
కౌగిలిలా వుంటుందని అనుకోలేదు
జాబిలింత వెచ్చనని అనుకొనేలేదు
ఇదే ఇదే ఇదే నా మొదటి అనుభవం
ఎన్న ఎన్ని జన్మలదో ఈ పరిచయం 
నెలవంక ఇలవంక దిగివచ్చింది

No comments: