సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాసరి
గానం::P.సుశీల,S.P.బాలసుబ్రహ్మణ్యం
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్
పల్లవి::
అమరంఅమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం
ఏ చరిత్ర వ్రాయని కావ్యం
అమరంఅమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం
ఏ చరిత్ర వ్రాయని కావ్యం
సాకీ::
అమర ప్రేమికుల ఆత్మకథా
సమాధి రాళ్ళకు అంకితం
చరణం::1
యుగాని కొకరు..ఆ యుగాన
వారు ఏ యుగాన అయినా
ప్రేమజీవులు..ఒకరే
ప్రేమకథలు ఒక్కటే
ముగింపు విషాదమే
అమరంఅమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం
ఏ చరిత్ర వ్రాయని కావ్యం
సాకీ::
ప్రేమ పవిత్రం..యువతీ యువకుల స్వార్జితం
రాతి గుండెల..స్వార్థానికి అర్పితం
చరణం::2
ప్రేమకు జన్మలు ఏడు
పెళ్ళికి ముడులు మూడు
ఈ మూడు ముడుల బంధం
ఒకే జన్మ..అనుబంధం
ఆ ఏడు జన్మల బంధం
ఆ చంద్ర తారార్కం
ఆ ఏడు జన్మల బంధం
ఆ చంద్ర తారార్కం
అది పరిమితం ఇది శాశ్వతం
అమరంఅమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం
ఏ చరిత్ర వ్రాయని కావ్యం
సాకీ::
అనురాగానికి మారుపేరు..అపజయం
ప్రేమ కథలకు తుదిరూపు..పరాజయం
చరణం::2
ప్రేమకే ప్రాణాలు పోశారు..ఎందరో
ఆ ప్రేమే ప్రాణాలు తీసింది..ఎందరివో
ప్రేమే ప్రణయమై..ఆ ప్రణయమే మరణమై
ఆ మరణమే అమరమై..అది అజరామరమై
ప్రేమ చరిత్ర తిరిగి వ్రాసిన..మన కథ
అమరం అమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం
ఏ చరిత్ర వ్రాయని కావ్యం
No comments:
Post a Comment