Friday, August 01, 2014

మంత్రిగారి వియ్యంకుడు--1983















సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి 
గానం::S.P.బాలు , S.జానకమ్మ 
తారాగణం::చిరంజీవి,సుధాకర్,అల్లు రామలింగయ్య,పూర్ణిమా జయరాం,
తులసి,నిర్మల, రావి కొండలరావు

పల్లవి::

ఏమని నే చెలి పాడుదును 
తిక మకలో..ఈ మక తికలో
తోటలలో పొదమాటులలో తెరచాటులలో..ఓ

ఏమని నే చెలి పాడుదును 
తిక మకలో..ఈ మక తికలో

చరణం::1

నవ్వు చిరినవ్వు..విరబూసే పొన్నల
ఆడు నడయాడు..పొన్నల్లో నేమిలిలా
పరువాలే పార్కుల్లో..ప్రణయాలే పాటల్లో 

నీ చూపులే నిట్టూర్పులై..నీ చూపులే ఒధర్పులై
నా ప్రాణమే నీ వేణువై..నీ ఊపిరే నా ఆయువై
సాగే తీగ సాగే రేగిపోయే ..లేత ఆశల కౌగిట

ఏమని నే చెలి పాడుదును 
తిక మకలో..ఈ మక తికలో

చరణం::2

లలలలాలలాలా..లలలాలలాలలాల
లలలాలహాహ్హహా..లలలాలలాలలాల

చిలక గోరింక..కలబోసే కోరిక
పలికే వలపంత..మనదేలే ప్రేమిక 
దడ పుట్టే పాటల్లో..ఈ దాగుడు మూతల్లో 

నవ్విందిలే బృందావని నా తోడుగా ఉన్నవని
ఊగే తనువులూగే వనకసాగె రాసలీలలు ఆడగా 
ఏమనినే మరి పాడుదును..తొలకరిలో తొలి అల్లరిలో 
మన అల్లికలో..ఓ..

ఏమని నే చెలి పాడుదును 
తిక మకలో..ఈ మక తికలో

No comments: