Friday, August 01, 2014

మగాడు--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,రామకృష్ణ,అంజలీదేవి,మంజుల,లత,కాంతారావు,జయమాలిని

పల్లవి::

కొట్టేసిండు జింజర జింజర జింజర కొట్టేసిండు 
బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు 
కొట్టేసిండు జింజర జింజర కొట్టేసిండు

చరణం::1

ఆహహా ఆహహా గాలి రెక్కలపై ఏవేల వస్తాడో 
పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
గాలి రెక్కలపై ఏవేల వస్తాడో 
పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
వాడు తుమ్మెదలంటాడు ఆ తుంటరిదంటాడు 
తుమ్మెదలంటాడు ఆ తుంటరిదంటాడు
ఒక రేకైన నలగకుండా దోచుకుపోయిండు 
తేనెలు దోచుకుపోయిండు
కొట్టేసిండు జింజర జింజర జింజర కొట్టేసిండు 
బంగారం లాంటి మనసు కొట్టేసిండు కొట్టేసిండు

చరణం::2

వాని చూపుల్లో కైపారు మెరిసింది  
వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది 
వాని చూపుల్లో కైపారు మెరిసింది  
వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది 
వాడు పగటిసందెరాడు ఇటు రాతిరి సూర్యుడు 
కదిలేటి వెన్నెల్లో సెగలు రేపుతాడు 
సెగలు..సెగలు..రేపుతాడు
కొట్టేసిండు జింజర జింజర జింజర కొట్టేసిండు 
బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు 
కొట్టేసిండు జింజర జింజర కొట్టేసిండు
జింజర జింజర జింజర జింజర

No comments: