Tuesday, March 18, 2014

బుద్ధిమంతుడు--1969







సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల

పల్లవి:

తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం::1

కన్ను సైగ చేయకురా కామినీ చోరా..గోపికాజారా
కన్ను సైగ చేయకురా కామినీ చోరా..గోపికాజారా
మా రాధ అనురాగం మారనిది..అది ఏ రాసకేళిలోన చేరనిది 
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం::2

జిలుగు పైట లాగకురా..జిలుగు పైట లాగకురా
తొలకరి తెమ్మెరా..చిలిపి తెమ్మెరా
జిలుగు పైట లాగకురా..తొలకరి తెమ్మెరా..చిలిపి తెమ్మెరా
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది..అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ..ఆ

చరణం::3

రోజు దాటి పోగానే..జాజులు వాడునురా..మోజులు వీడునురా
రోజు దాటి పోగానే..జాజులు వాడునురా..మోజులు వీడునురా
కన్నెవలపు సన్నజాజి వాడనిది..అది ఎన్ని జన్మలైనా వసివాడనిది

తోటలోకి రాకురా..తుంటరి తుమ్మెదా..గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది..అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

Budhimantudu--1969
Music:;K.V.Mahadevan
Lyrics::D.C.Narayanareddy
Singer's::P.Suseela

:::

tOtalOki raakuraa.. tuntari tummedaa... gaDasari tummedaa
maa malli manasentO tellanidi adi E vannelechinneleruganidi
tOtalOki raakuraa..aa..aa.aa

:::1

kannu saiga cheyakuraa kaaminee chOraa..gOpikaajaaraa
kannu saiga cheyakuraa kaaminee chOraa..gOpikaajaaraa
maa raadha anuraagam maaranidi..adi E raasakeLilOna cheranidi 
tOTalOki raakuraa..aa..aa.aa

:::2

jilugu paita laagakuraa..jilugu paita laagakuraa
tolakari temmeraa..chilipi temmeraa
jilugu paita laagakuraa..tolakari temmeraa..chilipi temmeraa
kannesiggu melimusugu veeDanidi..adi innaaLLu enDakanneruganidi
tOtalOki raakuraa..aa..aa..aa

:::3

rOju daati pOgaane..jaajulu vaaDunuraa..mOjulu veeDunuraa
rOju daati pOgaane..jaajulu vaaDunuraa..mOjulu veeDunuraa
kannevalapu sannajaaji vaaDanidi..adi enni janmalainaa vasivaaDanidi

tOtalOki raakuraa..tuntari tummedaa..gadasari tummedaa
maa malli manasentO tellanidi..adi E vanne E chinneleruganidi
tOtalOki raakuraa..aa..aa.aa

No comments: