Tuesday, March 18, 2014

బాలరాజు కథ--1970

సంగీతం::K.V.మహదేవన్
రచన::కొసరాజు
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ..ఏమిటీ విచిత్రం
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ..ఏమిటీ విచిత్రం

చరణం::1

ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు

అది వీధిలోన పడి ఉన్నందుకు..అది వీధిలోన పడి ఉన్నందుకు
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ..ఊ..

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ..ఏమిటీ విచిత్రం

చరణం::2

మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు

లోకులు చూచి తరించుటకు..లోకులు చూచి తరించుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు..పలుగాకుల బొజ్జల పెంచుటకు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ..ఏమిటీ విచిత్రం

చరణం::3

మహమ్మదీయులు పిలిచే దేవుడు..క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు..గోవిందా..గోవిందా
శ్రీశైలంలో మల్లికార్జునుడు..వారూ వీరూ ఒకటేనా..వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లికార్జునుడు..వారూ వీరూ ఒకటేనా..వేరువేరుగా ఉన్నారా

సర్వవ్యాపి నారాయణుడు..సర్వవ్యాపి నారాయణుడు..ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా..తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా

ఆఁ అట్టా రండి దారికి..

అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు..మీరొక్క దెబ్బతో తేల్చారు
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు..మీరొక్క దెబ్బతో తేల్చారు
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు..ఏ రాతికి మొక్కను వచ్చారు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ..ఏమిటీ విచిత్రం

No comments: