Sunday, November 18, 2007

ఆజన్మ బ్రహ్మచారి--1973

సంగీత::S.P.కోదండపాణి
రచన::అప్పలాచార్య
గానం::B.వసంత,S.P.బాలు  
తారాగణం::నాగభూషణం, పద్మనాభం, గీతాంజలి,లీలారాణి,రామకృష్ణ.

పల్లవి::

వినుమా వేదాంతసారం..విని కనుమా కైవల్యమార్గం 
యిది యిలలో మేలైన యోగం..మది కలుగును ఆనంద వైభోగం
ఏదమ్మా..అను..ఆ..వినుమా వేదాంత సారం
వినుమా వేదాంతసారం..విని కనుమా కైవల్యమార్గం 
యిది యిలలో మేలైన యోగం..మది కలుగును ఆనంద వైభోగం  
వినుమా వేదాంత..సారం
తదరి నాసన నా సా సా నీ నీ
సా సా రీ రీ రిస రిస నిస 
నిస మప నిస మన మరి

చరణం::1

తరుణము చూసి శరణము వేడి గురువును చేరాలి బేలా 
తరుణము చూసి శరణము వేడి గురువును చేరాలి బేలా
గురువును చేరి ఇహమును మరచే సాధన వివరించు స్వామీ
కనుగవ మూసి...చేతులు చాచి 
మనసును బంధించు లలనా..అర్థమైందా 
కాలేదు..ఇంత అమాయకమతే..ఎలా?         
కనుగవ మూసి చేతులు..చాచి 
మనసును బంధించు..లలనా 
ఈ మనసును బంధించు..లలనా            

చరణం::2

అహా..ఇదే ఆనందం సచ్చిదానందం
బ్రహ్మానందం శెభాష్..అలా నేర్చుకోవాలి
బంధనలోని ఆత్మానందం తెలిసెను యీనాడె దేవా 
వినుమా వేదాంతసారం..విని కనుమా కైవల్యమార్గం 
యిది యిలలో మేలైన యోగం..మది కలుగును ఆనంద వైభోగం  
వినుమా వేదాంత సారం
తదరి నానన నాసన నా సా సా నీ నీ
సా సా రీ రీ రిస రిస నిస 
నిస మప నిస మన మరి మరి్

చరణం::3

సత్తూ చిత్తూ కలిసేవేళా దేహము పులకించెనేలా..చెప్పమ్మా చెప్పు  
చిన్మయజ్యొతి కనపడగానే పొంగెను నామేను స్వామీ 
చిన్నదానివైనా...చురుగ్గా గ్రహించావ్ 
ఇది కనజాలని మూర్ఖులు ఎవరూ..పరమును కనలేరు బాలా  
అర్థములేని జపమే వ్యర్థము జీవనపరమార్ధమిదియే
వినుమా...వేదాంత సారం  
అర్థములేని జపమే వ్యర్థము..జీవనపరమార్ధమిదియే   
వినుమా వేదాంత సారం..విని కనుమా కైవల్యమార్గం 
యిది యిలలో మేలైన యోగం..మది కలుగును ఆనంద వైభోగం  
వినుమా...వేదాంత సారం    

No comments: