Saturday, November 17, 2007

మాతౄ దేవత--1969



సంగీతం::ఘంటసాల,(KV.mahadevan)
రచన ::దాశరధి
గానం::P.సుశీల


మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా..నన్నెన్నడు మరువకురా
కృష్ణా....!
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా..నన్నెన్నడు మరువకురా
కృష్ణా....!
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
కలకాలం మధి నిండాలి కలలన్నీ పండాలి
కలకాలం మధి నిండాలి కలలన్నీ పండాలి
మన కలలన్నీ పండాలి

!!మనసే కోవెలగా మమతలు మల్లెలుగా!!

ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ప్రతి రేయీ పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము
ప్రతి రేయీ పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము

!!మనసే కోవెలగా మమతలు మల్లెలుగా!!

నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో
నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా..నన్నెన్నడు మరువకురా
కృష్ణా....!
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా!!!!

No comments: