సంగీత::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గీతాంజలి,అల్లు రామలింగయ్య,పద్మనాభం,రమాప్రభ, సాక్షి రంగారావు
పల్లవి::
అమ్మాయ్ గోరూ..ఓహో..అమ్మాయ్ గోరూ
అమ్మాయ్ గోరూ..ఓహో..అమ్మాయ్ గోరూ
అవుతారు త్వరలోనే అమ్మగారూ..తమరు అమ్మగారూ
అమ్మాయ్ గోరూ..ఓహో..అమ్మాయ్ గోరూ
అవుతారు త్వరలోనే అమ్మగారూ..తమరు అమ్మగారూ
అమ్మాయ్ గోరూ..ఓహో అమ్మాయ్ గోరూ
చరణం::1
ఉంగా ఉంగా సంగీతాలే వింటారూ
ఉయ్యాల జంపాల అంటారూ
ఉంగా ఉంగా సంగీతాలే వింటారూ
అహ ఉయ్యాల జంపాల అంటారూ
ఉళ్ళుళ్ళుళ్ళ హాయీ హాయీ హాయీ పాడతారూ
నా ఉబలాటాన్ని జో జో జో కొడతారూ
అమ్మాయ్ గోరూ..ఓహో..అమ్మాయ్ గోరూ
చరణం::2
రాని విద్యలే నేర్చుకుంటారూ
అవి నాని గాడికే నేర్పుకుంటారూ
రాని విద్యలే నేర్చుకుంటారూ
మీ నాని గాడికే నేర్పుకుంటారూ
ముద్దులన్నీ బాబుకే అంటారూ
నే వద్దకొస్తే వద్దు వద్దు పొమ్మంటారూ
అమ్మాయ్ గోరూ..ఓహో..అమ్మాయ్ గోరూ
చరణం::3
అలసి సొలసి ఒడిలోన వాలేరూ
మన అనురాగ కెరటాల తేలేరూ
అలసి సొలసి ఒడిలోన వాలేరూ
మన అనురాగ కెరటాల తేలేరూ
ఉళ్ళుళ్ళుళ్ళ హాయీ హాయీ హాయీ పాడతాను
మీ ఉబలాటాన్ని జో జో జో కొడతాను
అమ్మాయ్ గోరూ..ఓహో..అమ్మాయ్ గోరూ
అవుతారు త్వరలోనే అమ్మగారూ..తమరు అమ్మగారూ
అమ్మాయ్ గోరూ..ఓహో..అమ్మాయ్ గోరూ
No comments:
Post a Comment