Sunday, November 18, 2007

అబ్బాయిగారు అమ్మాయిగారు--1972


















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గీతాంజలి,అల్లు రామలింగయ్య,పద్మనాభం,రమాప్రభ, సాక్షి రంగారావు

పల్లవి::

తొలిచూపు దూసిందీ..హృదయాన్ని
మరుచూపు వేసిందీ..బంధాన్ని
ప్రతి చూపు చెరిపింది..దూరాన్ని
పెళ్ళిచూపులే..కలపాలి ఇద్దరిని      
తొలిచూపు దూసిందీ..హృదయాన్ని
మరుచూపు వేసిందీ..బంధాన్ని

చరణం::1

ఒక చూపు తూపులా గాయాన్ని చేసిందీ
వేరొక చూపు  వెన్నెల మావులా మెరిసిందీ
ఒక చూపు తూపులా గాయాన్ని..చేసిందీ
వేరొక చూపు వెన్నెల మావులా మెరిసిందీ
ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టిందీ
ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టిందీ 
వేరొక చూపు వేరొక చూపు 
నిలువునా గెలుచుకొని వెళ్ళిందీ 
తొలిచూపు దూసిందీ హృదయాన్ని
మరుచూపు వేసిందీ బంధాన్ని

చరణం::2

చూపు లున్నందుకు చూసుకోవాలీ
చూచుకున్నది తనది చేసుకోవాలీ 
వలపు మొలకెత్తేది ఒక చూపులోనే
మనసు మనసయ్యేది ఆ చూపుతోనే    
ఈడు జోడుగ మనమిద్దరం వెళుతుంటే
ఎన్నెన్ని చూపులో ఈసుతో చూస్తాయి
ఈడు జోడుగ మనమిద్దరం వెళుతుంటే
ఎన్నెన్ని చూపులో ఈసుతో చూస్తాయి
తోడు నీడగ మన మేకమైనామంటె
తోడు నీడగ మన మేకమైనామంటె 
దేవతల చూపులే దీవెనలు అవుతాయి 

తొలిచూపు దూసిందీ హృదయాన్ని
మరుచూపు వేసిందీ బంధాన్ని
ప్రతి చూపు చెరిపింది దూరాన్ని
పెళ్ళిచూపులే కలపాలి ఇద్దరిని        

అ..హ..హా..ఆ ఆ ఆ ఆ ఆ
అ..హ..హా..ఆ ఆ ఆ ఆ ఆ
అ..హ..హా..ఆ ఆ ఆ ఆ ఆ
అ..హ..హా..ఆ ఆ ఆ ఆ ఆ  

No comments: